తాజా వార్తలు

MLA Raja Singh on Mohan Babu: జర్నలిస్టు దాడి ఘటనపై మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి, ఇష్యూని ఇలాగే వదిలేస్తే మరింత పెద్దది అవుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hazarath Reddy

జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు.మోహన్ బాబు ఫ్యామీలి గొడవల్లో వారి కొడుకు మీడియాను పిలవడం వల్లే హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. మోహన్ బాబు మీ కుటుంబ సమస్య మీ ఇంటివరకే ఉంటే బాగుంటుంది.. అని తెలిపారు.

Telangana: దారుణం, స్కూల్ నుంచి గంట ముందు ఇంటికి వెళ్లిందని విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్, దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఘటన

Hazarath Reddy

స్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టింది ఓ టీచర్. నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.

One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఒకే దేశం-ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Jamili Elections: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం, త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్న బిల్లు, అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు

Arun Charagonda

జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.ఈ బిల్లు అమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంటు,

Advertisement

Keerthy Suresh Marries Antony: గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్‌ వివాహం, చిననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న కీర్తి

Arun Charagonda

నటి కీర్తి సురేష్‌ వివాహం కన్నుల పండువగా జరిగింది. తన చిననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకుంది కీర్తి. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కీర్తి సురేష్‌ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు

Arun Charagonda

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు...కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి...అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? చెప్పాలన్నారు.

Grandhi Srinivas Resigns: వైసీపీని వీడిన మరో కీలక నేత, పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

Hazarath Reddy

వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

Delhi to Rajahmundry Flight: రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం, తొలి నాన్‌స్టాప్ విమానానికి వాటర్ కేనన్స్‌తో సిబ్బంది స్వాగతం

Hazarath Reddy

రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

Advertisement

Opposition MPs Protest: జార్జ్ సోర‌స్, అదానీ అంశాల‌తో పార్లమెంటులో గందరగోళం, పార్లమెంట్ ఆవరణలో అదానీ ఇష్యూపై ప్రతిపక్ష ఎంపీల నిరసన

Hazarath Reddy

లోక్‌స‌భ‌(Loksabha)లో నేడు కూడా గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. స‌భ ప్రారంభ‌మైన క్ష‌ణం నుంచి అధికార‌, విప‌క్ష ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టారు. అదానీ అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో స‌భ‌ను మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు వాయిదా వేశారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రాధిక శరత్ కుమార్..వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం...వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, నటి రాధికా శరత్ కుమార్. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Varikuntla Subbaiah Funeral: సైనిక లాంచనాలతో ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చన ప్రజానీకం

Hazarath Reddy

విధి నిర్వహణలో ఎల్‌ఓసీలో అమరుడైన వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. మతాలకతీతంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ట్రాఫిక్ ఛలాన్ కట్టకపోతే విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు..పోలీసు అధికారుల తీరుపై ఫైర్

Arun Charagonda

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది.

Advertisement

Missing Virus Vials: క్వీన్స్‌లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్‌లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..

Hazarath Reddy

చైనా వూహాన్ ల్యాబ్ నుంచి లీకయినట్లుగా భావిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనమందరం చూశాం. తాజాగా అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన వందలాది వైరస్ లు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది.

Tamilnadu: స్కూల్‌లో దారుణం..పాఠాలు వింటూనే గుండెపోటుతో విద్యార్థిని మృతి, సీసీటీవీలో రికార్డు అయిన షాకింగ్ దృశ్యాలు

Arun Charagonda

తమిళనాడులోని రాణిపేటలో విషాదం నెలకొంది. స్కూల్లో పాఠాలు వింటూనే హార్ట్ ఎటాక్‌తో విద్యార్థిని మృతి చెందింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని అద్విత హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలి మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

AP Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్‌పై గెలుపు

Arun Charagonda

తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. జితేందర్ రెడ్డి , మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీ నాథ్‌కి మధ్య ఎన్నిక జరగగా.. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జితేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.

Weather Forecast: ఏపీకి తప్పిన ముప్పు, తమిళనాడు వైపుకు కదిలిన అల్పపీడనం, రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, భారీ వర్షాలతో చెన్నై విలవిల

Hazarath Reddy

నైరుతి బంగాళా­ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్ల­డించారు.

Advertisement

Andhra Pradesh Shocker: ఏపీలో సంచలనం.. కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేశాడు, తానే హత్యచేశానని కువైట్ నుండి వీడియో రిలీజ్

Arun Charagonda

ఏపీలో సంచలనం జరిగింది. కూతురుని వేధించాడని కువైట్‌ నుంచి వచ్చి ఓ దివ్యాంగుడిని చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేశారు పోలీసులు.

Hyderabad: లాల్‌దర్వాజ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం, పసుపులో కుడికాలి పాదం..క్యూ కడుతున్న భక్తులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం జరిగింది. పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tamil Nadu Rains: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై (Chennai)కూడా తడిసి ముద్దయింది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

Tirumala: తిరుమలలో భారీ వర్షం, అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత

Arun Charagonda

తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమయ్యారు సిబ్బంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు.

Advertisement
Advertisement