తాజా వార్తలు

ACB Raids in Jogi Ramesh Residence: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఉదయం 5 గంటల నుంచి తనిఖీలు.. అగ్రి గోల్డ్ భూములకు సంబంధించే ఈ దాడులు

Rudra

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున నుంచి ఏసీబీ సోదాలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది.

Vangalapudi Anitha On YS Jagan: జగన్‌ను జైల్లో వేయాలి, భద్రత తొలగింపుపై అన్నీ అబద్దాలే, తప్పు చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందేనన్న ఏపీ హోంమంత్రి అనిత

Arun Charagonda

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను జైలులో వేయాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడిన అనిత..తన భద్రత కుదింపుపై జగన్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో జగన్ 950 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అది ఒక గ్రామం ఓటింగ్‌తో సమానమని ఇప్పుడు అంతమంది పోలీసులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.

Telangana JAC Again: తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఉద్యోగ జేఏసీ, ఒకటో తేదీ జీతాలేవి?, రేవంత్ సర్కార్‌ పై పోరాటానికి ఉద్యోగులు రెడీ

Arun Charagonda

తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యోగ జేఏసీ మళ్లీ ఏర్పాటైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు ఉద్యోగులు. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డీఏ అని అన్నారు కానీ 9 నెలలు అయిన ఇంకా ఇవ్వలేదు.. ఇప్పటికీ 4 డీఏలు ఇవ్వలేదు అన్నారు.

Mastan Sai: డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్, అమ్మాయిలే టార్గెట్‌గా న్యూడ్ కాల్స్, రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్

Arun Charagonda

సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్. గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలను గుర్తించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే లక్ష్యంగా లోబర్చుకొని వారితో మస్తాన్ సాయి న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.

Advertisement

Shocking Video: ఆగ్రాలోని షాపింగ్‌మాల్‌లో దారుణం, కారు కింద పడి పసికందు మృతి, కన్నీరు పెట్టిస్తున్న వీడియో

Arun Charagonda

ఆగ్రాలోని ఓ షాపింగ్ మాల్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయటకు తీస్తుండగా ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో వీడియో రికార్డు కాగా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.

Warangal Shocker: చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్య, వరంగల్ జిల్లా రాయపర్తిలో ఘటన, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

వరంగల్ జిల్లా: రాయపర్తి చెరువులో దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు హన్మకొండ జిల్లా పైడిపెల్లికి చెందిన దూకి అంజలి (25), సంగాల దిలీప్ (30) గా గుర్తించగా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు స్మితా సబర్వాల్ కాంట్రవర్సీ కామెంట్స్ వ్యవహారం...పూర్తి సమాచారంతో అఫిడవిట్ ఇవ్వాలన్న న్యాయస్థానం

Arun Charagonda

దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనెక్కి తీసుకునేలా యూపీఎస్సికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సామాజికవేత్త వసుందర. ఈ సందర్భంగా పిటీషనర్ అర్హతను ప్రశ్నించింది ధర్మాసనం. తాను ఒక వికలాంగురాలని, స్మితా వ్యాఖ్యలు తన మనోభావాలు దెబ్బతీసే లాగా ఉన్నాయని పేర్కొంది వసుందర. పూర్తి సమాచారంతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది హైకోర్టు.

Harishrao On Sitarama project: సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ బీఆర్‌ఎస్‌దే, గులాబీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు, డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న హరీష్ రావు

Arun Charagonda

ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(ఆగస్టు 11న) ట్రయల్ రన్ నిర్వహించింది ప్రభుత్వం. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Telangana Speaker Meets ChandraBabu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ, శ్రీవారి దర్శనాల్లో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలపై చర్చ

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరుగగా తిరుమల లో శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టు స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. టీటీడీలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ శాసనసభ్యులకు అర్హత కల్పించాలని, శాసనసభ్యుల రిక్వెస్టును ఆమోదించాలని కోరారు.

Astrology: శుక్ర గ్రహ సంచారం వల్ల ఆగస్టు 22 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదకు ఆనందానికి అధిపతి శుక్రుడు గ్రహం అయితే శుక్ర గ్రహం ఆగస్టు 11న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశించింది.

Astrology: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా..అయితే ఆగస్టు 18 ఆదివారం నాడు ఈ మూడు పనులు చేయండి అదృష్టం ప్రకాశిస్తుంది

sajaya

ఆదివారం సూర్యునికి ఎంతో ఇష్టమైన రోజు ఆరోజు పూజలు చేయడం ద్వారా మనము మన అదృష్టాన్ని పెంచుకోవచ్చు. ఆదివారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి కొన్ని పనులు చేయడం ద్వారా. ఎప్పటినుండో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది.

Astrology: రాఖీ పౌర్ణమి తో పాటు యాదృచ్ఛికంగా ఈసారి రెండు యోగాల కలయిక ఈ 3 రాశుల వారికి అదృష్టం.

sajaya

ఈసారి రాఖీ పౌర్ణమి ఆగస్టు 19 వస్తుంది. అదే రోజు సర్వార్ధ సిద్ధియోగం, రవి యోగం కూడా యాదృచ్ఛికంగా కలయిక జరుగుతున్నాయి. అదే విధంగా ఆరోజు సోమవారం కాబట్టి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఇవన్నీ కూడా కలగలిపి శుభయోగాలు ఏర్పడ్డాయి.

Advertisement

Venu Swamy About Astrology: సెలెబ్రెటీల జ్యోతిష్యం చెప్పను, వారి జోలికి పోను...వేణు స్వామి సంచలన వీడియో

Arun Charagonda

తాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నానని సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను...మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు అని వీడియో రిలీజ్ చేశారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని.. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను...దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య- శోభిత ల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చిందన్నారు. చైతూ - శోభిత ఇద్దరికి విడాకులు ఖాయమని వేణుస్వామి చెప్పడం వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు గతంలో మాట ఇచ్చి తప్పరని వేణుస్వామిని ప్రశ్నించారు.

Health Tips: ముఖం పైన మచ్చలు, మొటిమలు సమస్యతో బాధపడుతున్నారా..ఈ చిట్కాతో మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.

sajaya

చాలామంది యువతలో ఈ మధ్యన ఎక్కువగా కనిపించే సమస్య మొహం పైన ముడతలు, మొటిమలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని ద్వారా నలుగురిలోకి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మన ఇంట్లోనే దొరికే కొన్ని ఆహార కొన్ని పదార్థాలతోటి ఈజీగా మన ఫేస్ పైన మచ్చలను తగ్గించుకోవచ్చు.

Health Tips: ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

కోడిగుడ్డు పోషకాలు అధికంగా ఉన్న ఒక ఆహార పదార్థం. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, జింక్, పొటాషియం, విటమిన్స్ ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక మూలకాలు ఉన్నాయి.

Viral Video:ప్రాణాలతో చెలగాటం...రన్నింగ్ లారీ పట్టుకుని విన్యాసాలు, ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతే, వీడియో వైరల్

Arun Charagonda

సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చకుంటున్నారు. తాజాగా ఓ ఇద్దరు వ్యక్తులు రన్నింగ్ లారి పట్టుకుని ప్రాణాంతక విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని నెటిజన్లు కోరుతున్నారు.

Advertisement

Health Tips: రాగిజావ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

sajaya

రాగులు మనందరికీ తెలుసు ప్రస్తుత సమయంలో చాలామంది అన్నానికి బదులుగా రాగులు తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. దీనిలో ఉన్న అనేక రకాలైన పోషక విలువలు దీనికి కారణం.

Botsa Satyanarayana Files Nomination: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

Arun Charagonda

విశాఖపట్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స. రాజకీయాలను టీడీపీ నేతలు వ్యాపారంగా మార్చారని తెలిపారు.

Allu Aravind Plays Cricket With Ayaan: మనవడితో క్రికెట్ ఆడిన అల్లు అరవింద్, వీడియో వైరల్

Arun Charagonda

టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ ఫ్రీ టైంను కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉండే అరవింద్ క్రికెట్ ఆడారు. అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో కలిసి ఇంటి ఆవరణలో సరదాగా క్రికెట్‌ ఆడారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ వైరల్‌గా మారింది.

Health Tips: పీరియడ్ క్రాంప్స్ తో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ నొప్పి కి ఉపశమనం.

sajaya

చాలామంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిని పీరియడ్ క్రాంప్స్ అంటారు. ఇవి దాదాపుగా అందరూ మహిళలను కనిపించే సాధారణ సమస్య

Advertisement
Advertisement