తాజా వార్తలు

India vs England 4th T20I 2025: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, ఇరగదీసిన హార్ధిక్ పాండ్యా, శివమ్ దుబె

VNS

ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. పుణె వేదికగా జరిగిన కీలకమైన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది

Union Budget 2025: సరికొత్త రికార్డు సృష్టించే దిశగా నిర్మలా సీతారామన్, అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రిగా అతి త్వరలోనే రికార్డు

VNS

మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ (Morarji Desai) సమర్పించిన పది వార్షిక బడ్జెట్‌ల రికార్డుకు చేరువలో ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ 1959-1964 మధ్య ఆరు, 1967-1969 మధ్య నాలుగు బడ్జెట్‌లు సమర్పించారు. తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ, లాల్‌ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంల్లో బడ్జెట్‌లు సమర్పించారు.

Garbage Bins In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి చెత్త డబ్బాలు, ఏకంగా 931 బిన్లు ఏర్పాటు చేయనున్న జీహెచ్‌ఎంసీ

VNS

గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్‌ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ (GHMC) చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త (Garbage) పేరుకుపోతున్నది.

Laila Movie Third Single Out: ట్రెండ్‌కు తగ్గట్లు విశ్వక్‌ సేన్‌ లైలా మూవీ మూడో సాంగ్, కోయ్ కోయ్‌ అంటూ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

VNS

రెండు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. తాజాగా మూవీ నుంచి ఓహో రత్తమ్మా అనే థ‌ర్డ్ సింగిల్‌ను (Third Single) విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ పాట‌లో రీసెంట్‌గా వైర‌ల్ అయిన కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అనే లిరిక్స్ వాడారు. పెంచల్ దాస్ లిరిక్స్ అందిస్తూ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Advertisement

Sachin Tendulkar Will Get Lifetime Achievement Award: సచిన్ టెండూల్కర్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌, బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో అందించే ఏర్పాట్లు

VNS

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు (Sachin Tendulkar) బీసీసీఐ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును (Lifetime Achievement Award) ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్‌ను అవార్డుతో సత్కరించనున్నది. సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు సచిన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Rajasthan Shocker: టీచర్ కాదు కామాంధుడు, రెండవ తరగతి చదివే బాలికపై దారుణం, ట్యూషన్ పేరుతో ప్రైవేట్ పార్టుల్లో పెన్నుతో పొడుస్తూ లైంగిక వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని సిగ్గుపడే ఉదంతం వెలుగులోకి వచ్చింది . అక్కడ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక గత 6 నెలలుగా లైంగిక వేధింపులకు (Sexually Abused Class 2 Girl for 6 Months) గురవుతోంది.

Gurgaon Shocker:ఘోరం.. నైట్ డ్యూటీకి వెళుతూ కూతురిని మేనమామ ఇంట్లో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు, దారుణంగా అత్యాచారం చేసిన మేనమామ స్నేహితుడు

Hazarath Reddy

గురుగ్రామ్‌లో 13 ఏళ్ల బాలికపై ఆమె మామ స్నేహితుడే అత్యాచారం చేశాడు. రాత్రి పనికి వెళ్తుండగా తల్లిదండ్రులు బాలికను మేనమామ ఇంట్లో వదిలి వెళ్లారు. నిందితుడు బాలికను ఆమె ఇంటి నుంచి తన కారులో తీసుకెళ్లి తెల్లవారుజామున తిరిగి దింపేశాడు.

Bengaluru Horror: దారుణం, మదర్సాలో బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు, చివరకు తల్లిదండ్రులకు ఘోరాన్ని చెప్పిన బాలుడు

Hazarath Reddy

బెంగళూరులోని మదర్సాలో చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై మహారాష్ట్రలోని థానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

Advertisement

Vijaysai Reddy: వైసీపీతో బంధాన్ని అధికారికంగా పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్‌కు పంపించానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.

Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో మొబైల్ టవర్ పైకి ఎక్కిన మందుబాబు, ఆ తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

భోపాల్‌లోని ఐష్‌బాగ్ ప్రాంతానికి చెందిన వివేక్ ఠాకూర్ అనే 33 ఏళ్ల వ్యక్తి శుక్రవారం మద్యం మత్తులో బర్ఖేడీ ప్రాంతంలో మొబైల్ టవర్ ఎక్కి సంచలనం సృష్టించాడు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ సంఘటనలో ఠాకూర్ మొబైల్ టవర్ చివరి వరకు చేరుకుని అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు. వీక్షకులు పోలీసులు, మున్సిపల్ బృందాలను అప్రమత్తం చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.

Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు

Dog Attack in Hyderabad: వీడియో ఇదిగో, 6 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి, చిన్నారి కాలు పట్టుకుని రోడ్డు మీద లాగి మరీ అటాక్.. తీవ్ర గాయాలు

Hazarath Reddy

Advertisement

Delhi Election 2025: ఢిల్లీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌కు షాక్, ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా, రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో గుడ్ బై

Hazarath Reddy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది, మెహ్రౌలీకి చెందిన నరేష్ యాదవ్‌తో సహా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

MLC Kavitha: నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని కామెంట్

Arun Charagonda

నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నాని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). జలాలపై రాజకీయం చేయడం మానేసి ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

YS Jagan: వీడియో ఇదిగో, లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న జగన్, బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈరోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు.

Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం

Hazarath Reddy

పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని కాల్వలో పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన వ్యక్తిని గంగినేని కొండయ్య (80)గా గుర్తించారు.

Advertisement

Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్‌ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం

Hazarath Reddy

విశాఖ జిల్లా మల్కాపురం(Visakha District Malkapuram)లో కన్నకొడుకు తల్లిని చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక Malkapuram police station పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. సముద్ర తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్‌(Defense Force Coast Quarters)లో ఆమె మృతదేహాన్ని కొందరు గుర్తించారు.

Congress Corporator Baba Fasiuddin: కాంగ్రెస్ కార్పొరేటర్లపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల విష ప్రయోగం.. సంచలన ఆరోపణలు చేసిన బాబా ఫసియుద్దీన్, కేటీఆర్ కుట్రలన్నీ తెలుసని ఫైర్

Arun Charagonda

కాంగ్రెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Congress Corporator Baba Fasiuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, కుంభమేళాలో వండుతున్న ఆహారంలో మట్టి పోసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసిన అధికారులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని 'భండారా' వద్ద ఆహార పాత్రలో మట్టిని డంపింగ్ చేస్తున్నట్లు ఆరోపించబడిన వీడియో వైరల్ కావడంతో సోరాన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బ్రిజేష్ తివారీని సస్పెండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Ghazipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, కుంభమేళా నుంచి ఇంటికి వెళుతున్న భక్తుల వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు, ఆరు మంది మృతి..పలువురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

యూపీలోని ఘాజీపూర్‌ (Ghazipur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా (Maha Kumbh Mela) భక్తులతో (devotees) వెళ్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement