India

Tomato Virus: టొమాటో వైరస్ అంటే ఏమిటి ? ఈ వ్యాధి ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏమైనా ఉందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Team Latestly

భోపాల్‌లో పాఠశాలల్లో ‘టొమాటో వైరస్’ అని పిలువబడే వైరల్ ఇన్‌ఫెక్షన్ పుట్టిందని అధికారులు గుర్తించారు. గురువారం పాఠశాలలు తల్లిదండ్రులను అప్రమత్తం చేసి, ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, పిల్లలు దాని ప్రభావంతో ఏ పరిస్థితుల్లో ఉన్నారో వివరించారు.

Devaragattu Bunny Festival: నెత్తురోడిన దేవరగట్టు బన్నీ ఉత్సవం, కర్రలతో తీవ్రంగా కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు, వీడియోలు ఇవిగో..

Team Latestly

కర్నూలు(Kurnool) జిల్లాహొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది.

Khandwa Tragedy: దుర్గామాత నిమ‌జ్జ‌నం కోసం వెళుతుండగా చంబాల్ న‌దిలో పడిపోయిన ట్రాక్టర్, ఊపిరాడక 16 మంది మృతి, వీడియో ఇదిగో..

Team Latestly

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో దుర్గామాత నిమజ్జన వేడుకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంబాల్ నదిలో దుర్గామాత నిమజ్జనం కోసం భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ నియంత్రణ కోల్పోవడంతో నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు.

Sudden Death in Sitapur: షాకింగ్ వీడియో ఇదిగో, ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో డ్రమ్స్ వాయిస్తూ కుప్పకూలి పడిపోయిన కార్యకర్త, చికిత్స పొందుతూ మృతి

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో విషాదకరమైన సంఘటన జరిగింది. ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన మార్చ్‌లో ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త డ్రమ్ వాయిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అంకిత్ సింగ్ అనే స్వచ్ఛంద సేవకుడు డ్రమ్స్ వాయిస్తుండగా అకస్మాత్తుగా సమతుల్యత కోల్పోయి కుప్పకూలి పడిపోయాడు,

Advertisement

Dussehra Quotes in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు, విజయదశమి పండుగ వేళ మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

Realme 15x 5G Launched in India: రియల్‌మీ 15x 5G భారత మార్కెట్లో విడుదల, 7,000mAh బ్యాటరీతో పాటు 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా, ధర ఎంతంటే..

Team Latestly

ప్రముఖ చైనా దిగ్గజం రియల్ మీ తన తాజా స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 15x 5G ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 7,000mAh బ్యాటరీతో వస్తుంది, అది 60W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కెమెరా వ్యవస్థలో 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వినియోగదారుకు స్పష్టమైన, ప్రొఫెషనల్-క్వాలిటీ ఫోటోలు, సెల్ఫీలు అందించేలా డిజైన్ చేశారు.

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతి వేగంగా వెళుతూ ట్రక్కును ఢీకొట్టిన కారు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని చెబుతున్న నివేదికలు

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు, వీరిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్యాన్సర్‌తో మరణించిన స్థానిక మహిళ భర్త చితాభస్మ నిమజ్జనం కోసం బాధితులు హరిద్వార్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad: మాదన్నపేటలో దారుణం, కుక్క విషయంలో గొడవపడి వృద్ధురాలిపై కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులు దాడి, వీడియో ఇదిగో..

Team Latestly

హైదరాబాద్‌ నగరంలోని మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది.

Advertisement

US Government Shuts Down: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ అంటే ఏమిటి? ఆరేళ్ల తర్వాత షట్‌డౌన్‌లోకి ట్రంప్ సర్కారు, భారత వాణిజ్యంపై దీని ప్రభావం ఎంత ఉంటుంది?

Team Latestly

డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆరేళ్ల తర్వాత షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ప్ర‌వేశపెట్టిన ఫెడరల్ నిధుల బిల్లుకు అవసరమైన ఆమోదం దక్కలేదు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11.59 నిమిషాల వరకూ ఆ బిల్లు క్లియరెన్స్ కోసం వేచి చూడడం జరిగింది

RBI Repo Rate 2025: రెపో రేటు 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా, రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయిలోనే ఉందని వెల్లడి

Team Latestly

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును ఎటువంటి మార్పులు లేకుండా 5.5 శాతం వద్దే కొనసాగించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన రేట్లు అవసరమని స్పష్టం చేశారు

Hyderabad New CP: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా బదిలీ అయిన సీవీ ఆనంద్‌

Team Latestly

Bomb Threat: ముంబై నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధింపు

Hazarath Reddy

సెప్టెంబర్ 30, మంగళవారం ఉదయం ముంబై నుండి దేశ రాజధానికి వెళ్తున్న ఇండిగో విమానం 6E 762 లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు PTI నివేదించింది. సెప్టెంబర్ 30, 2025న ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానం 6E 762 లో భద్రతా బెదిరింపు కనిపించింది.

Advertisement

ఆసియా కప్ హీరో Tilak Varma చిన్నప్పటి కోచ్ Salam Bayash గురించి ఎవరికైనా తెలుసా ? తిలక్ వర్మని టీమిండియా భవిష్యత్ స్టార్ గా తీర్చిదిద్దిన చిన్నప్పటి గురువును ఓ సారి కలిసొద్దాం పదండి

Team Latestly

తిలక్ వర్మకు క్రికెట్ లో మొదటి కోచ్ సలాం బయాష్ అని చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ క్రికెటర్ కు అయినా జీవితంలో మొదటి కోచ్ అంటే చాలా ముఖ్యుడు. వాళ్లే ఆటగాడి ప్రతిభను గుర్తించి, సరైన దిశలో నడిపిస్తారు. హైదరాబాద్‌కు చెందిన సలాం బయాష్ చిన్న వయసులో తిలక్ వర్మను గుర్తించి, అతన్ని లీగాలా క్రికెట్ అకాడమీలో తీసుకున్నారు.

Dussehra Messages in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ పండుగ వేళ మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

భారతదేశంలో హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు.

Dussehra Wishes in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు, మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు తెలుగులో చక్కగా చెప్పేయండి

Team Latestly

హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది.

Dussehra 2025: దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు ? మంచి పై చెడు విజయం స్ఫూర్తిగా జరుపుకునే మహోత్సవం ప్రత్యేక కథనం ఇదిగో..

Team Latestly

దసరా లేదా విజయదశమి ప్రతి భారతీయుడి జీవనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది మంచి పై చెడు విజయం సాధించిన రోజున జరుపుకునే పండుగ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విభిన్న సాంప్రదాయాలతో, పెద్ద ఉత్సాహంతో జరుపుకుంటారు.

Advertisement

Andhra Pradesh: మద్యం కేసులో మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, జైలు నుంచి విడుదల

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. మిధున్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు హాజరు కావాలి.

PM Modi’s ‘Operation Sindoor’ Post: ఆసియా కప్ విజేతగా భారత్, ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ ప్రధాని మోదీ ట్వీట్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Team Latestly

ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మీడియా పోస్ట్‌లో "ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ కేంద్ర సైనిక చర్యతో సరిపోల్చి, క్రికెటర్లు ప్రశంసించారు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది. అది సుమారు 1,07,000 రీట్వీట్‌లు, 25 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లు పొందింది.

Telangana Panchayat Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, మొత్తం ఐదు దశల్లో పోలింగ్‌, 565 జడ్పీటీసీ, 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

Team Latestly

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది. మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారు.

V.C. Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

Team Latestly

నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ ఈ రోజు బాధ్యతల నుంచి తప్పుకుని కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు

Advertisement
Advertisement