India
Atul Subhash Suicide Case: విడాకుల భరణం నిర్ణయించేందుకు 8 మార్గదర్శకాలను వెల్లడించిన సుప్రీంకోర్టు, దేశ వ్యాప్తంగా కదలికలు రేపుతున్న అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు
Hazarath Reddyవరకట్న చట్టాల దుర్వినియోగంపై చర్చకు దారితీసిన బెంగుళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య నుండి ఉత్పన్నమైన వార్తల మధ్య సుప్రీంకోర్టు ప్రత్యేక విడాకుల కేసుపై దృష్టి సారించింది. విడాకుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు, భరణం మొత్తాన్ని నిర్ణయించడానికి ఎనిమిది పాయింట్ల సూత్రాన్ని జాబితా చేసింది
Jagga Reddy: ఏఐసీసీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్, పార్టీని చంపేయాలని చూస్తున్నారు..అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? అని మండిపాటు
Arun Charagondaఅధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? చెప్పాలని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు...ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? చెప్పాలన్నారు. దీపాదాస్ మున్షీ ఉందా? ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా?, కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా? ఫైనల్ అయ్యేవరకు మాకు చెప్పరా? అని మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి.
Mandakrishna Madiga: కేబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలి, మాదిగలంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు తగదన్నమందకృష్ణ మాదిగ,తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్న?
Arun Charagondaమాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ..కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మాదిగలకు పలుకుబడి లేదు అన్నారు.
Telangana: దారుణం, స్కూల్ నుంచి గంట ముందు ఇంటికి వెళ్లిందని విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్, దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
Hazarath Reddyస్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టింది ఓ టీచర్. నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.
One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఒకే దేశం-ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Jamili Elections: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం, త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్న బిల్లు, అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు
Arun Charagondaజమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.ఈ బిల్లు అమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంటు,
Keerthy Suresh Marries Antony: గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్ వివాహం, చిననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న కీర్తి
Arun Charagondaనటి కీర్తి సురేష్ వివాహం కన్నుల పండువగా జరిగింది. తన చిననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకుంది కీర్తి. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కీర్తి సురేష్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు
Arun Charagondaముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు...కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి...అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? చెప్పాలన్నారు.
Grandhi Srinivas Resigns: వైసీపీని వీడిన మరో కీలక నేత, పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
Hazarath Reddyవైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.
Delhi to Rajahmundry Flight: రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం, తొలి నాన్‌స్టాప్ విమానానికి వాటర్ కేనన్స్‌తో సిబ్బంది స్వాగతం
Hazarath Reddyరాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
Opposition MPs Protest: జార్జ్ సోరస్, అదానీ అంశాలతో పార్లమెంటులో గందరగోళం, పార్లమెంట్ ఆవరణలో అదానీ ఇష్యూపై ప్రతిపక్ష ఎంపీల నిరసన
Hazarath Reddyలోక్‌సభ(Loksabha)లో నేడు కూడా గందరగోళం నెలకొన్నది. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అదానీ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రాధిక శరత్ కుమార్..వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం...వీడియో ఇదిగో
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, నటి రాధికా శరత్ కుమార్. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Varikuntla Subbaiah Funeral: సైనిక లాంచనాలతో ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చన ప్రజానీకం
Hazarath Reddyవిధి నిర్వహణలో ఎల్‌ఓసీలో అమరుడైన వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. మతాలకతీతంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
AP High Court: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ట్రాఫిక్ ఛలాన్ కట్టకపోతే విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు..పోలీసు అధికారుల తీరుపై ఫైర్
Arun Charagondaఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది.
Missing Virus Vials: క్వీన్స్‌లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్‌లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
Hazarath Reddyచైనా వూహాన్ ల్యాబ్ నుంచి లీకయినట్లుగా భావిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనమందరం చూశాం. తాజాగా అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన వందలాది వైరస్ లు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది.
Tamilnadu: స్కూల్‌లో దారుణం..పాఠాలు వింటూనే గుండెపోటుతో విద్యార్థిని మృతి, సీసీటీవీలో రికార్డు అయిన షాకింగ్ దృశ్యాలు
Arun Charagondaతమిళనాడులోని రాణిపేటలో విషాదం నెలకొంది. స్కూల్లో పాఠాలు వింటూనే హార్ట్ ఎటాక్‌తో విద్యార్థిని మృతి చెందింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని అద్విత హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలి మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
AP Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్‌పై గెలుపు
Arun Charagondaతెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. జితేందర్ రెడ్డి , మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీ నాథ్‌కి మధ్య ఎన్నిక జరగగా.. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జితేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.
Weather Forecast: ఏపీకి తప్పిన ముప్పు, తమిళనాడు వైపుకు కదిలిన అల్పపీడనం, రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ వర్షాలతో చెన్నై విలవిల
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు.
Andhra Pradesh Shocker: ఏపీలో సంచలనం.. కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేశాడు, తానే హత్యచేశానని కువైట్ నుండి వీడియో రిలీజ్
Arun Charagondaఏపీలో సంచలనం జరిగింది. కూతురుని వేధించాడని కువైట్ నుంచి వచ్చి ఓ దివ్యాంగుడిని చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేశారు పోలీసులు.
Hyderabad: లాల్‌దర్వాజ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం, పసుపులో కుడికాలి పాదం..క్యూ కడుతున్న భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం జరిగింది. పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.