India

Puneet Superstar Slapped: వీడియో ఇదిగో, 'బిగ్ బాస్' ఫేమ్ పునీత్ సూపర్ స్టార్‌ను చితకబాదిన ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకా

Hazarath Reddy

India's Got Latent, బిగ్ బాస్ OTT 2 లో కనిపించినందుకు పేరుగాంచిన సెన్సేషనల్ పునీత్ సూపర్ స్టార్ , ఇటీవల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రదీప్ ఢాకాతో బహిరంగ వాగ్వాదాన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది, ఢాకా పునీత్‌ను ఎదుర్కొన్నట్లు, తరువాత అతనిని చెంపదెబ్బ కొట్టినట్లు వీడియో చూపిస్తుంది.

Rajasthan: అంత్యక్రియల సమయంలో చితిమంటల మీద నుంచి లేచిన యువకుడు చికిత్స పొందుతూ మృతి, నలుగురి వైద్యులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

రాజస్థాన్‌లో గురువారం అంత్యక్రియల చితిపై నుంచి లేచిన వ్యక్తి జైపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మార్చురీకి, ఆపై శ్మశాన వాటికకు పంపిన ముగ్గురు వైద్యులను జిల్లా కలెక్టర్ గురువారం రాత్రి సస్పెండ్ చేశారు.

Indore Road Accident Video: షాకింగ్ వీడియో, కారు బ్రేకులకు బదులు యాక్సిలరేటర్‌ను తొక్కిన వైద్యుడు, ముందున్న కారును ఢీకొట్టడంతో మృతి

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బ్రేకులకు బదులు యాక్సిలరేటర్‌ను తొక్కిన ఓ వైద్యుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

Sarpanch Dies by Suicide: కొండారెడ్డి ప‌ల్లె గ్రామ మాజీ స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్య‌, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన హరీష్ రావు, మీ అన్నదమ్ముళ్ల‌పై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలని డిమాండ్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయ‌న అన్నారు

Advertisement

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. విజన్ డాక్యుమెంట్-2047పై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. నవంబరు 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి.

Harishrao: రోడ్డెక్కిన ప్రజాపాలన దరఖాస్తులు...సైబర్‌ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటి?..హరీశ్ రావు ప్రశ్న

Arun Charagonda

నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు..నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం..రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? ఏంటన్నారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పెళ్లి చేయడంలేదని తండ్రిని రూంలో బంధించి చితకబాదిన కొడుకులు, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

పెళ్లి చేయడం లేదని తండ్రిని రూమ్ లో బంధించి కొడుకు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.మంత రాజు (65) అనే వ్యక్తి కిరణం షాపు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం.

Andhra Pradesh: మహిళల ముందు బట్టలు విప్పేసి వ్యాపారి నగ్న ప్రదర్శన, మగవారు రోడ్లపై స్నానాలు చేయొద్దంటూ వీరంగం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చెయ్యొద్దంటూ రామాంజనేయులు ఈ నగ్న ప్రదర్శన చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, పురాతన శివాలయంలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు ధర్నా

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఉన్న పురాతన శివాలయంలో రాత్రి శివలింగాన్ని తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. శివుని పక్కనే ఉన్న వినాయకుడు విగ్రహాన్ని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేశారు. హిందూ సంఘాలు చేరుకొని శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను గుర్తించి అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.

Hydra: చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్‌ సమావేశం, మూడు గంటల పాటు చర్చ, హైడ్రా కూల్చివేతలు ఆగవని స్పష్టం

Arun Charagonda

చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులు, నాళాలకు FTL బౌండరీల నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ ENC లు, మైనర్ ఇరిగేషన్ సీఈలు , వీసీలు, ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, పీసీబీకి చెందిన సీనియర్ అధికారులతో రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా మీటింగ్ జరుగగా మేధావుల సలహలు, సూచనలు తీసుకున్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, గన్ మిస్ ఫైర్ అయి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ మృతి, గుంటూరులో విషాదకర ఘటన

Hazarath Reddy

గన్ మిస్‌ఫైర్‌ అయి ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గుంటూరులో శుక్రవారం చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

Chandrababu: వీడియో ఇదిగో, నేను ఐదోసారి సీఎం అవుతా, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Hazarath Reddy

AP రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్‌ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని.. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు.

Advertisement

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

Hazarath Reddy

ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులకు ఏపీ శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. దీంతో పాటుగా చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది.

Sangli MIDC Gas Leak: ఎరువుల కర్మాగారంలో రియాక్టర్‌లో పేలుడు, గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులు మృతి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఎరువుల కర్మాగారంలో రియాక్టర్‌లో పేలుడు సంభవించి గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది ఆసుపత్రి పాలైనట్లు అధికారి శుక్రవారం తెలిపారు.

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్

Arun Charagonda

అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్ .. ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి అన్నారు. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు.. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడిందన్నారు.

India-US Ties Have Strong Foundation: భారత్-అమెరికా మధ్య సంబంధాలపై వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు, అదాని అంశం ఎంతమాత్రం ప్రభావం చూపదని వెల్లడి

Hazarath Reddy

భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలమైన పునాదిపై నిర్మించబడిందని, భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల చుట్టూ కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇవి అధిగమించగలవని వైట్ హౌస్ విశ్వాసం వ్యక్తం చేసింది.

Advertisement

Siddipet: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన డీసీఎం...ఆరుగురికి తీవ్ర గాయాలు...బాధితులను ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

సిద్దిపేట - పొన్నాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆటోను అతివేగంగా వెనకనుంచి ఢీకొట్టింది డీసీఎం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Balakrishna on YS Sharmila: వైఎస్ షర్మిల అంశంపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలని వెల్లడి

Hazarath Reddy

.అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందన్నారు.

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

Hazarath Reddy

కెనడాలో నేర కార్యకలాపాలతో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై కెనడా ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా వివరణ ఇచ్చింది.

RK Roja On Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రోజా ఛాలెంజ్, ఇండిపెండెంట్‌గా పోటి చేసి గెలవాలని సవాల్..రెండు చోట్ల ఓడిపోయినప్పుడే నీ బలం తెలిసిందని కామెంట్

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు సవాల్ విసిరారు మాజీ మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్‌గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువు అని సవాల్ విసిరారు. టీడీపీతోనో, బీజేపీతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప.. నీ బలంతో నువ్వు రాలేదు అన్నారు. నీ బలమేంటో, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే తెలిసిపోయిందన్నారు. నేను నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేశాను.. ఇవ్వాల ఓడిపొయినా రేపు నేను మళ్లీ గెలవగలను అన్నారు.

Advertisement
Advertisement