జాతీయం

Kanpur Horror: కాన్పూర్‌లో దారుణం, హైవేపై తల లేకుండా నగ్నంగా మహిళ మృతదేహం, ఆ పార్టులో దారుణంగా రక్తంతో తడిసి చేతులు, కాళు విరిగిపోయి..

Hazarath Reddy

భయంకరమైన సంఘటనలో, కాన్పూర్‌లోని గుజైని ప్రాంతంలోని హైవేపై బుధవారం నాడు సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళ తల, నగ్న శరీరం కనుగొనబడింది. మున్నా తీరా సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

CPL 2024: దంచికొట్టిన డికాక్, వీడియో చూస్తే షాకవడం పక్కా!

Arun Charagonda

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్వింటర్ డికాక్ అదరగొట్టాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డికాక్ 48 పరుగులతో రాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

West Bengal: ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద బ్యాగు కలకలం, బాంబు స్వ్కాడ్‌తో పోలీసుల తనిఖీలు, డాక్టర్ల షరతులను తిరస్కరించిన మమతా సర్కార్

Arun Charagonda

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద డాక్టర్ల నిరసన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద ఇవాళ ఓ బ్యాగు అనుమానస్పదంగా కనిపించడం కలకలం రేపింది. డాక్టర్లు నిరసనలు చేస్తున్న శిబిరం వద్ద ఓ బెంచీపై బ్యాగును గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

MLA Padi Kaushik Reddy: తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో

Arun Charagonda

తనపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చర్యకు ప్రతి చర్య ఉంటుందని..దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే గాంధీకి మంగళహారతులతో స్వాగతం పలికేందుకు తాము ఉంటే కోడిగుడ్లు, టమోటోలతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు.

Advertisement

Harishrao On Kaushik Reddy Issue: కౌశిక్ రెడ్డిపై దాడిని ఖండించిన హరీశ్‌ రావు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్న, ఎమ్మెల్యే గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్..

Arun Charagonda

ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. గేట్లు, గోడ దూకి మరి దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ నేతల దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయి.

MLA Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నీది మనిషి జన్మేనా? ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావ్ అంటూ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు

Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటో, కోడిగుడ్లతో దాడి, అరికెపూడి గాంధీ అనుచరుల బీభత్సం, కౌశిక్ ఇంటికి బయల్దేరిన హరీశ్‌ రావు..వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు సవాల్, ప్రతిసవాల్‌కు దిగగా తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలు దేరారు గాంధీ. అయితే ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటోలు, కోడిగుడ్లతో దాడి చేశారు గాంధీ అనుచరులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pocharam Vs Ravinder Reddy: పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, అవాక్కయిన పోలీసులు..వీడియో

Arun Charagonda

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే కొట్టుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బాన్సువాడ - వర్ని పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు, నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Andhra Pradesh Shocker: వినాయక మండపం వద్ద డీజే సౌండ్ గొడవ, కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్, సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పిన వినకపోవడంతో కత్తితో దాడి.. వీడియో

Arun Charagonda

హిందూపురంలో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించాడు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని లక్ష్మీపురంలో శ్రీహరి అనే వ్యక్తి కత్తితో బీభత్సం సృష్టించాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, వినాయకుడి మండపం వద్ద డీజే సౌండ్ ఎక్కువ పెట్టొద్దని చెప్పినా వినకపోవడంతో కత్తికి పనిచెప్పాడు

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరదలతో ఇంకా తీరని కష్టాలు, ప్రభుత్వం అందించే ఆహారం కోసం ఎగబడ్డ జనాలు

Hazarath Reddy

విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో పది రోజులుగా పొయ్యి వెలిగించలేని స్థితిలో ప్రజలు ఉన్నారు.

Arekapudi Gandhi Vs Kaushik Reddy: ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్

Arun Charagonda

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా రాజకీయాలు మారిపోయాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు గాంధీ.

Fake Whatsapp Calls Alert: మీ కూతురు కిడ్నాప్ అంటూ వాట్సప్ కాల్స్, అలర్ట్ చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వి.సజ్జనార్, అలాంటివి నమ్మవద్దని హెచ్చరిక

Hazarath Reddy

స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారని, అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే ఆడ‌పిల్ల‌ల‌ను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Ganesh Visarjan 2024: గణేశుడి మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసు వేసి తీయకుండానే నిమజ్జనం, ఇంటికి వచ్చాక గుర్తుకు రావడంతో లబోదిబోమంటూ చెరువుకు, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

బెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది.

PM Modi Ganesh Pooja AT CJI House: సీజేఐ చంద్రచూడ్‌ ఇంట గణపతి పూజ...సంప్రదాయ వస్త్రాధారణలో పాల్గొన్న ప్రధాని మోడీ..

Arun Charagonda

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో వినాయక చవిత ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజలో సంప్రదాయ వస్త్రాధారణలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తమ నివాసానికి వచ్చిన ప్రధానికి సీజేఐ దంపతులు సాదర స్వాగతం పలికారు

MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్, పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోర్టులో క్యాష్ పిటిషన్

Hazarath Reddy

సత్యవేడు టీడీపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆదిమూలం. తాజాగా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.

Actress Hema On Rave Party: నటి హేమపై పోలీసుల ఛార్జ్‌షీట్, గతంలో డ్రగ్స్ తీసుకోలేదన్న వీడియో వైరల్

Arun Charagonda

బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని గతంలో వీడియో రిలీజ్ చేసిన నటి హేమ. తాజాగా బెంగళూర్ రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొనడంతో మరోసారి వైరల్‌గా మారుతోంది వీడియో.

Advertisement

Students Protest: పీఈటీ వేధింపులు తాళలేక విద్యార్థుల ధర్నా, మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీసి బెదిరిస్తోందని రోడ్డుపై బైఠాయింపు, పీఈటీకి వ్యతిరేకంగా నినాదాలు

Arun Charagonda

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. నెలవారీ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా పీఈటీ జ్యోత్స్న ప్రవర్తిస్తోందని ఆరోపిస్తు రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు.

Bengaluru Rave Party: నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల ఛార్జ్‌షీట్, 9 మంది రేవ్ పార్టీ నిర్వహించినట్టు నిర్థారణ

Arun Charagonda

బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. నటి హేమ తో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఇక ఈ పార్టీని 9 మంది నిర్వహించారని, హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ జతపరిచారు పోలీసులు.

Ganesh Chaturthi Special Dance Video: ఈ వీడియో చూస్తే ముగ్దులవడం ఖాయం, వినాయక మండపం ముందు లయబద్దంగా డ్యాన్స్ చేసిన యవతులు..వైరల్ వీడియో

Arun Charagonda

వినాయక నవరాత్రుల సందర్భంగా కొందరు యువతులు ఎంతో లయబద్ధంగా డాన్స్ చేశారు. ఆ వినాయకుడే ముగ్థుడయ్యే విధంగా డాన్స్ వేశారంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Cancer Patient Last Wish: దేవర సినిమా చూసి చనిపోతా..క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక, అప్పటివరకు బతికించండని విన్నపం

Arun Charagonda

దేవర సినిమా చూసి చనిపోతా..సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించండని ఓ క్యాన్సర్ పేషంట్ చివరి కోరిక కోరాడు. టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ కౌశిక్(19)కు బోన్ క్యాన్సర్ అని నిర్దారించారు డాక్టర్లు. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన కౌశిక్‌.. దేవర సినిమా విడుదలయ్యే వరకు తనను బతికించమని కోరారు. తన కొడుకు ట్రీట్‌మెంట్‌కు రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు

Advertisement
Advertisement