India

Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన

Vikas M

ఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.

Bull Attacks Elderly Woman: వీడియో ఇదిగో, వృద్ధురాలిని కొమ్ములతో అమాంతం ఎత్తేసిన ఎద్దు, గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టిన బాధితురాలు

Vikas M

సెప్టెంబరు 2న ఆన్‌లైన్‌లో కనిపించిన కలతపెట్టే వీడియోలో, ఒక వృద్ధ మహిళను ఒక భారీ ఎద్దు గాలిలో అనేక మీటర్ల పైకి ఎగరవేయడం కనిపించింది. బలహీనమైన స్త్రీ తన మద్దతు కర్రతో ఇంటి ప్రవేశ ద్వారం వైపు నడుస్తుండగా, ఒక పెద్ద ఎద్దు అదే ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయత్నించింది.

Pakistan Floods: పాకిస్థాన్‌లో వరదలు, 293 మంది మృతి, 564 మందికి గాయాలు, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

Hazarath Reddy

పాకిస్థాన్‌లో గత రెండు నెలల్లో రుతుపవనాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మొత్తం 293 మంది మృతి చెందగా, 564 మంది గాయపడ్డారని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.

Indian National Jailed in Singapore: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, సింగపూర్‌లో భారతీయ వ్యక్తికి 14 నెలలు జైలు శిక్ష

Hazarath Reddy

సింగపూర్‌లో తెలిసిన కుటుంబానికి చెందిన టీనేజ్ బాలికపై వేధింపులకు పాల్పడిన కేసులో 52 ఏళ్ల భారతీయ వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష పడింది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వేధించినందుకు, నేరస్థుడికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా, లాఠీ లేదా అటువంటి శిక్షలను ఒకేసారి పొందవచ్చు

Advertisement

France Shocker: భర్త దారుణం, భార్యకు మత్తు ఇచ్చి 71 మంది మగాళ్ల చేత 92 సార్లు అత్యాచారం, అంతే కాకుండా కసిగా వారిని బూతు పదాలతో రెచ్చగొడుతూ వీడియోలు తీస్తూ పైశాచికానందం

Hazarath Reddy

ఫ్రాన్స్ కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి పదేళ్లుగా అపరిచిత వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. భర్త తన భార్య సాయంత్రం భోజనం లేదా వైన్‌లో నిద్ర మాత్రలు, యాంటి యాంగ్జైటీ మందులను చూర్ణం చేసి ఆమెను అపస్మారక స్థితికి చేర్చేవాడు.

Kadapa Fire Video: వీడియో ఇదిగో, కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం, సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ఒక్కసారిగా పేలుడు

Hazarath Reddy

ఏపీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. కడప కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. పేలిన వెంటనే మంటలు అక్కడున్న బైకులకు అంటుకున్నాయి.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, ఔటర్ రింగ్ రోడ్డులోని 51 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తు ఆర్డినెన్స్

Hazarath Reddy

రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.

Vijayawada Floods: విజయవాడలో బాహుబలి ఘటన, పీకల్లోతు నీళ్ళలో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని తీసుకెళ్తున్న వరద బాధితులు

Hazarath Reddy

విజయవాడ లో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని వరద బాధితులు తీసుకెళ్తోంది. పీకల్లోతు నీళ్ళు ఉండటం తో బిడ్డను కాపాడుకునేందుకు సింగ్ నగర్ వాసులు ఇలా మోసుకెళ్ళారు.

Advertisement

CM Chandrababu: వీడియో ఇదిగో, నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు, మీరున్నారు కదా ఏపీ ప్రజలకు భయం లేదని మోదీ చెప్పారని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

చంద్రబాబు మాట్లాడుతూ..ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు మీరున్నారు కదా.. భయం లేదని చెప్పారు. హుద్‌హుద్‌ సమయంలో నా పనితీరును ఆయన మెచ్చుకున్నారు. నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు’’ అని చంద్రబాబు అన్నారు.

Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, చేపలు పట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన బాధితుడు

Hazarath Reddy

మెదక్ జిల్లాలో వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు. టేక్మాల్ మండలం గుండు వాగులో ఘటన చోటు చేసుకుంది.చేపలు పట్టేందుకు గుండు వాగు బ్రిడ్జి పైకి వెళ్లిన కల్లూరుకు చెందిన రమావత్ నందు (45) ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో కొట్టుకుపోతున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు తాళ్ల సాయంతో అతన్ని కాపాడారు.

Andhra Pradesh Floods: ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్‌ చేస్తారా, కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడిన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని వెల్లడి

Hazarath Reddy

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్‌ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు

Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Andhra Pradesh Floods: వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జగన్, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో తెలిపిన వైసీపీ అధినేత

Hazarath Reddy

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Reddy on Khammam Floods: తాను ఫామ్‌ హౌస్‌లో పడుకున్నోడిలా కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు, ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని వెల్లడి

Hazarath Reddy

ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు (CM Revanth Reddy on Khammam Floods) వచ్చాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాప్స్‌ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు.

Harish Rao Slams CM Revanth Reddy: రేవంత్ రెడ్డివి మోకాలికి, బోడిగుండుకు లింక్ పెట్టే పిచ్చి మాట‌లు, ప్రభుత్వం వరదలపై ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేయలేదంటూ మండిపడిన హరీష్ రావు

Hazarath Reddy

ఖ‌మ్మం జిల్లాలో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఖ‌మ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.గ‌త మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

Astrology: లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలి అంటే మీ పూజ గదిలో ఈ వస్తువులు ఉంచండి.

sajaya

లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో సిరిసంపదలు నిండి ఉంటాయి. ఐశ్వర్యానికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 7 వినాయక చవితి వినాయకుడికి ఇష్టమైన ఈ నైవేద్యాలు పెడితే మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది.

sajaya

వినాయక చవితి పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న ప్రారంభమవుతుంది.

Astrology: సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ నెలలో అన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా బుధుడు సెప్టెంబర్లో రెండుసార్లు తన రాశిని మార్చుకుంటున్నాడు. సెప్టెంబర్ నాలుగున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు.

Hyd Traffic Police Issues Advisory: ఆ మూడు రోజులు గచ్చిబౌలి నుండి లింగంపల్లి వెళ్లే ప్రయాణిలకు అలర్ట్, ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

సెప్టెంబర్‌ 3,6, 9 తేదీల్లో గచ్చిబౌలిలోని జీఎంసీబీ స్టేడియంలో ఇంటర్‌కాంటినెంటల్‌ కప్‌ 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆయా రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్‌ అడ్వైజర్‌ జారీ చేశారు.

Vijayawada Floods: వీడియో ఇదిగో, మూడు రోజుల నుంచి అన్నం, నీళ్లు లేవు, దయచేసి మమ్మల్ని కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న కుటుంబం

Hazarath Reddy

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌ వాసుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపునకు గురైన బాధితులు ఆపన్న హస్తం కోసం హాహాకారాలు చేస్తున్నారు.తాజాగా విజయవాడలో వచ్చిన వరదల్లో వైఎస్సార్ జంక్షన్ సమీపంలోని రైతు బజార్ దగ్గర ఉన్న ఓ ఇంట్లో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయింది.

Advertisement
Advertisement