India

90 Feet Hanuman Statue:అమెరికాలోని టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం, చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట..వీడియో

Arun Charagonda

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా 90 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగింది. ఓపెనింగ్ కార్య‌క్ర‌మం స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ ద్వారా పువ్వులు, ప‌విత్ర జ‌లాన్ని చ‌ల్లారు. హ‌నుమంతుడి మెడ‌లో 72 ఫీట్ల పూల‌మాల‌ను వేశారు.

Noida: వీడియో ఇదిగో, శవాలను భద్రపరిచే మార్చురి గదిలో శృంగారం, అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

Hazarath Reddy

నోయిడాలోని పోస్ట్‌మార్టం హౌస్ నుండి ఒక షాకింగ్ సంఘటన నివేదించబడింది, అక్కడ సాధారణంగా మృతదేహాలను భద్రపరిచే డీప్ ఫ్రీజర్ రూమ్‌లో ఒక పురుషుడు మరియు స్త్రీ 'అసభ్యకరమైన చర్య'లో నిమగ్నమై ఉన్న వీడియో కనిపించింది. తోటి సిబ్బంది రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది,

Delhi: వీడియో ఇదిగో, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సీఐఎస్‌ఎఫ్ అధికారి

Hazarath Reddy

ఆగస్ట్ 20న ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని సీఐఎస్‌ఎఫ్ అధికారి ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో CPR ద్వారా ప్రాణాలను కాపాడారు. టెర్మినల్ 2 నుండి బయలుదేరే ప్రాంతంలో ఉదయం 10:50 గంటలకు ఈ సంఘటన జరిగింది, ఇండిగో విమానంలో శ్రీనగర్‌కు వెళుతున్న మిస్టర్ అర్షిద్ అయూబ్ తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు.

Jagtial Shocker: జగిత్యాలలో దారుణం, హోంవర్క్ పూర్తి చేయలేదని రక్తమొచ్చేలా పాపని కొట్టిన టీచర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని జగిత్యాల్లోని ఎంపీపీఎస్ టీఆర్ నగర్ పాఠశాలలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. హోంవర్క్ పూర్తి చేయనందుకు రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని ఉపాధ్యాయుడు దారుణంగా శిక్షించడంతో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కుమార్ అనే ఉపాధ్యాయుడు ఆ పాపని చెవిపై బలంగా కొట్టడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం మొదలైంది.

Advertisement

Sudden Death Caught on Camera: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హార్ట్ ఎటాక్, కుప్పకూలి మరణించిన వైద్య విద్యార్థి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జామ్‌నగర్‌లో 19 ఏళ్ల MBBS విద్యార్థి కిషన్ మానెక్ జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు ప్రాణాంతక గుండెపోటుకు గురయ్యాడు. పిజివిసిఎల్‌లో డిప్యూటీ ఇంజనీర్ అయిన హేమంత్ మానెక్ కుమారుడు కిషన్ తన వ్యాయామ దినచర్యలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

Supreme Court On Kolkata Doctor Rape-Murder Case: తక్షణమే విధుల్లోకి వెళ్లండి.. విధుల్లో చేరిన తర్వాత ఎలాంటి చర్యలుండవని కీలక వ్యాఖ్యలు

Arun Charagonda

కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సైతం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. డాక్టర్లు అందరూ తక్షణమే విధుల్లో చేరాలని, వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది.

Anakapalle Pharma Company Explosion: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదం, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు, 17 మంది మృతి

Hazarath Reddy

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Badlapur Sexual Assault Case: నువ్వే అత్యాచారానికి గురైనట్లు రిపోర్ట్ చేస్తున్నావా, జర్నలిస్టుపై విరుచుకుపడిన శివసేన నేత, చివరకు ఏమన్నారంటే..

Hazarath Reddy

ఇద్దరు కిండర్ గార్టెన్ బాలికలపై లైంగిక వేధింపుల కేసుపై నిరసనను కవర్ చేస్తున్నప్పుడు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సీనియర్ నాయకుడు వామన్ మ్హత్రే అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారని జర్నలిస్ట్ మోహిని జాదవ్ ఆరోపించడంతో మహారాష్ట్రలో రాజకీయ వివాదం చెలరేగింది.

Advertisement

Kolkata Rape-Murder Case: రండి 20 రూపాయలు ఇచ్చినా మీతో పడుకుంటాం, ఈ దారుణాలెందుకు, కామాంధులకు సూటి ప్రశ్నలు సంధించిన సెక్స్ వర్కర్, వీడియో ఇదిగో

Hazarath Reddy

పురుషులకు రెడ్‌లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది.

Delhi Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, 3వ అంతస్తు నుండి కిందపడిన మూడేళ్ల పాప, రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసిన తల్లిదండ్రులు..

Hazarath Reddy

పశ్చిమ ఢిల్లీలోని సాగర్‌పూర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనంలోని మూడో అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలిక గురువారం మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీల్లో రికార్డైంది. చిన్నారి అకస్మాత్తుగా కింద వీధిలో పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది

MLC Kavitha Injured: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు, వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న కవిత

Arun Charagonda

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత గైనిక్ సమస్య , వైరల్ జ్వరంతో బాధపడుతుండగా వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kolkata Rape-Murder Case: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో కామాంధులైన నెటిజన్లు, గూగుల్ సెర్చ్‌లో దారుణమైన పదాలతో వెతుకులాట

Hazarath Reddy

కోల్‌కతా ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కొందరు నెటిజన్లు గూగుల్‌లో బాధితురాలి ఫొటోలు, అత్యాచార వీడియోల కోసం తెగ వెతికారు. అక్కడితో ఆగకుండా ఆమె పేరు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ‘వీడియో’, ‘రేప్ వీడియో’ అంటూ ఉత్సాహంగా వెతికారు

Advertisement

KTR Questions Revanth Reddy: ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా?, సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామంలో మహిళా జర్నలిస్టుల దాడిని ఖండించిన కేటీఆర్

Arun Charagonda

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదేనా ఇందిరమ్మ పాలన?, మహిళా జర్నలిస్టులకే రక్షణ లేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్‌ రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు

Defamation Case: పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీపై ప్రజల్లో అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయంటూ పిటిషన్

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది.

Harishrao Slams CM Revanth Reddy: 'స్వామీ.. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు'..రేవంత్‌పై హరీశ్‌ ఫైర్, మాట తప్పిన సీఎం ఆలయాలను శుద్దిచేయాలని కామెంట్, రుణమాఫీ చేసే వరకు వదలిపెట్టమని వార్నింగ్

Arun Charagonda

ప్రజలనే కాదు దేవుళ్లను మోసం చేసిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తుండగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని ఆలేరులో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు హరీశ్ రావు.

APPSC Group-1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..

Hazarath Reddy

గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది.

Advertisement

Mega Fan Extraordinary Gift To Chiranjeevi: చిరంజీవికి ఫ్యాన్ అదిరే గిఫ్ట్...3D పెయింటింగ్‌లో చిరు ఫోటోలో రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్!

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదిరే గిఫ్ట్ ఇచ్చారు ఓ అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ కనిపించేలా 3D ఫెయింటింగ్ వేశారు. కుప్పంకు చెందిన కళాకారుడు పురుషోత్తం.. చిరంజీవి ఫోటోలో రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ కనిపించేలా 3D పెయింటింగ్ వేశారు. ఇది అందరిని ఆకట్టుకుంటోంది.

Andheri Horror: ముంబైలో దారుణం, 13 ఏళ్ళ బాలికపై ఇన్‌స్టాలో పరిచయమైన ఫ్రెండ్ అత్యాచారం, మళ్ళీ గుజరాత్ తీసుకువెళ్ళి పదే పదే రేప్, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

మహారాష్ట్రలో షాకింగ్ ఘటనలో 13 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు సోషల్ మీడియా ద్వారా బాధితురాలిని కలిశాడు. నిందితుడు ఆమెను ముంబైలోని అంధేరీలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత గుజరాత్‌కు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశారు.

Pushpa 2: The Rule Update: డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే, ఇది మాత్రం ఫిక్స్‌, పుష్ప 2: ది రూల్‌ అభిమానులకు అంకితమంటూ అల్లు అర్జున్ బూస్ట్ వ్యాఖ్యలు

Hazarath Reddy

మారుతినగర్‌ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు.డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్‌. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్‌) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్‌’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు.

Allu Arjun: వీడియో ఇదిగో, నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వస్తా, అది మన ఫ్రెండ్‌ అయినా, కావాల్సిన వాళ్లు అయినా..అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

మారుతినగర్‌ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్‌ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్‌ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను.

Advertisement
Advertisement