India
Shardiya Navratri 2025: శారదీయ నవరాత్రి 2025, ఈసారి నవరాత్రులు కాదు.. పది రోజులు పాటు దసరా ఉత్సవాలు, తేదీలు, ప్రత్యేకతలు, నవరాత్రుల గురించి పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyసంవత్సరంలో జరుపుకునే నాలుగు నవరాత్రులలో శారద నవరాత్రి అత్యంత ప్రాచుర్యం పొందింది. దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు అంకితం చేయబడిన ఈ పండుగను దేశవ్యాప్తంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు
Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసం ఉత్సవాలకు రెడీ అవుతున్న శ్రీశైలం ఆలయం, విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు, అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు ఉత్సవాలు
Team Latestlyఅక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు నెల రోజుల పాటు జరగనున్న కార్తీక మాసం ఉత్సవాలకు శ్రీశైలం ఆలయ అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పవిత్ర సమయంలో వేలాది మంది భక్తులు సాంప్రదాయ ఆచారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆలయ పట్టణాన్ని సందర్శిస్తారని అధికారులు భావిస్తున్నారు.
Punjab and Haryana High Court: జడ్జి పదవికి నోటిఫికేషన్, పొరపాటున ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిపిన న్యాయవాది, చివరకు ఏమైందంటే..
Team Latestlyకుమార్ పొరపాటుగా ఆ కాలమ్‌లో “అవును” అని రాశాడు. ఈ కారణంగా తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేసినా.. చీఫ్ జస్టిస్ షీల్ నాగు మరియు జస్టిస్ సంజీవ్ బెర్రీలతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ నాగు వ్యాఖ్యానిస్తూ.. మీకు ఇద్దరు భార్యలు ఉన్నారని మీరు చెబుతున్నారు
Jammu and Kashmir High Court: తండ్రి ఎక్కువ డబ్బు సంపాదించినా పిల్లల సంరక్షణపై తల్లికే హక్కు.. పిల్లల కస్టడీ కేసులో జమ్మూ & కాశ్మీర్ హైకోర్టు కీలక తీర్పు..
Team Latestlyజమ్మూ & కాశ్మీర్, లడఖ్ హైకోర్టు పిల్లల కస్టడీ (పెంపక హక్కు) గురించి ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది.తండ్రి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడనే కారణంతో పిల్లలు తల్లి కస్టడీలోకి వెళ్లడం కరెక్ట్ కాదనే అంశాన్ని తప్పుబట్టింది. జస్టిస్ జావేద్ ఇక్బాల్ వాని చెప్పినట్లుగా ఆర్థిక పరిస్థితి ఒక విషయం మాత్రమే.
టీం ఇండియాకు కొత్త స్పాన్సర్‌గా అపోలో టైర్స్, రూ.579 కోట్ల భారీ బిడ్‌తో హక్కులు దక్కించుకున్న దిగ్గజం, టీం ఇండియా జెర్సీలో ఇకపై అపోలో టైర్స్ లోగో
Team Latestlyభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీం ఇండియాకు కొత్త లీడ్ స్పాన్సర్ కోసం నిర్వహించిన ప్రక్రియ నేటితో ముగిసింది. ఈ పోటీలో పలు కంపెనీలు పోటీ పడగా చివరకు గురుగ్రామ్ ఆధారిత అపోలో టైర్స్ రూ.579 కోట్ల భారీ బిడ్‌తో కొత్త స్పాన్సర్‌గా ఎంపికైంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం, టీం ఇండియా జెర్సీలో ఇకపై అపోలో టైర్స్ లోగో కనిపిస్తుంది.
Telangana Liberation Day Wishes 2025: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, తెలంగాణ మిత్రులకు తెలంగాణ లిబరేషన్ డే సందేశాలు చెప్పేద్దామా.. బెస్ట్ వాట్సప్ మెసేజెస్ మీకోసం..
Team Latestlyసెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, బస్సులో సీటు కోసం జుట్టులు పట్టుకుని తన్నుకున్న మహిళలు, పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో ఘటన
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకం అమలు అయినప్పటి నుంచి బస్సుల్లో సీటు విషయంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి.తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో, సీటు కోసం ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది
Bull Attack Video: షాకింగ్ వీడియో ఇదిగో, షాపుకు వెళుతున్న యజమానిపై అకస్మాత్తుగా దాడి చేసిన ఎద్దు, చికిత్స పొందుతూ బాధితుడు మృతి
Team Latestlyరాజస్థాన్‌లోని బలోత్రాలోని బల్దేవ్ జీ కి పోల్ ప్రాంతంలో ఆదివారం నాడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 55 ఏళ్ల దుకాణదారుడిపై వీధిలో వెళుతున్న ఎద్దు దాడి చేసి ప్రాణాపాయం కలిగించింది. బాధితుడిని మోతీలాల్ అగర్వాల్‌గా గుర్తించారు.
Triple Talaq Row: భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త, కోర్టు బయట చెప్పుతో అతడిని చితకబాదిన బాధితురాలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Team Latestlyఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాంపూర్ కోర్టులో భరణం కేసు విచారణకు హాజరైన ఓ మహిళ, కోర్టు బయటే తన భర్తను చెప్పుతో కొట్టింది. బాధితురాలి వివరాల ప్రకారం.. భర్త కోర్టు వెలుపల మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఆ తర్వాత ఆగ్రహంతో ఆమె భర్తపై చెప్పుతో దాడి చేసింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Waqf Act 2025: వక్ఫ్ చట్టం-2025పై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, ఓ ప్రొవిజన్ నిలిపివేస్తూ కీలక తీర్పును వెలువరించిన అత్యున్నత ధర్మాసనం
Team Latestlyవక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని ముఖ్యమైన ప్రావిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ప్రావిజన్ ప్రకారం, కనీసం ఐదేళ్లపాటు ఇస్లాం మతాన్ని అనుసరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్ ఆస్తిని చేయగలరనే అంశాన్ని అత్యున్నత ధర్మాసనం నిలిపివేసింది.
Bengaluru Pothole Incident: బెంగళూరు రోడ్లు పరిస్థితి తెలిపే షాకింగ్ వీడియో, మరో బస్సును క్రాస్ చేస్తూ గుంతలో కూరుకుపోయిన బస్సు, 20 మంది పిల్లలకు తప్పిన పెను ప్రమాదం
Team Latestlyకర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని రోడ్లు గుంతలతో నిండిపోయిన దురవస్థ కారణంగా ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పాణత్తూరు-బలగెరె ప్రధాన మార్గంలో భారీ గుంతలో స్కూల్ బస్సు ఒరిగిపోయింది. రెండు స్కూల్ బస్సులు పాణత్తూరు-బలగెరె మార్గంలో ప్రయాణిస్తున్నాయి.
Jio and Airtel: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు బిగ్ షాక్, రూ. 246 ప్లాన్ ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రాయ్ ఆదేశాలు
Team Latestlyభారత టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) Reliance Jio, Bharti Airtelకు చౌకైన రూ. 249 మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను తొలగించడం పై వివరణాత్మక సమాచారం కోరినట్లు తాజాగా సమాచారం వెల్లడి అయింది. గత కొన్ని రోజులుగా జియో 28 రోజుల చెల్లుబాటు గల రూ. 249 ప్లాన్‌ను నిలిపివేసింది.
Bomb Threat Email: ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపు మెయిళ్లు, కోర్టు నుంచి పరుగులు పెట్టిన లాయర్లు, అర్ధాంతరంగా ఆగిపోయిన విచారణలు
Team Latestlyఈ రోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ అందడంతో కోర్టు సిబ్బంది, లాయర్లు, కేసులు విచారించేందుకు వచ్చిన ప్రజలు వెంటనే బయటకు పరుగులు పెట్టారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దూకడంతో ఘటనా స్థలంలో సమగ్ర తనిఖీలు ప్రారంభించారు.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది నేడు భారత్ తీరాలను దాటి ప్రయాణించే అవకాశం ఉంది.
Heart Health Tips: గుండె సమస్యలు ఉన్నవారు ఏ వైపు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.. గుండె నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Team Latestlyరాత్రిపూట మంచి నిద్ర అందరికీ అవసరం. ఇది శరీరానికి శక్తిని పునఃప్రాప్తి చేయడమే కాకుండా, అలసటను తగ్గించి మనస్సుకు పదును పెడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Heart Disease Deaths India: భారత్ లో ప్రతి మూడు మరణాల్లో ఒక దానికి గుండెపోటే కారణం, తాజా నివేదికలో దిమ్మతిరిగే వాస్తవాలు, యువత పైనే ప్రభావం ఎక్కువగా..
Team Latestlyఇటీవల భారతదేశంలో గుండె జబ్బులు, వాటి ప్రభావాలు, మరణాలపై వచ్చిన తాజా నివేదిక ప్రజలను అప్రమత్తం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నమూనా రిజిస్ట్రేషన్ సర్వేలో (Sample Registration Survey), నిపుణుల బృందం దేశంలో జరిగే మరణాల్లో సుమారుగా మూడవ వంతు గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నదని వెల్లడించింది.
Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో..రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారి, తల్లి అప్రమత్తతో ప్రాణాలతో బయటకు.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఘటన
Team Latestlyహైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రోడ్డు మీద తెరచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిన చిన్నారిని ఆమె తల్లి వెంటనే గమనించి సురక్షితంగా బయటకు తీసింది. ఈ ఘటన ఆరేళ్ల బాలిక తన తల్లి, సోదరితో కలిసి స్కూల్‌కు వెళ్తున్న సమయంలో జరిగింది.
Robbery Caught on Camera: వీడియో ఇదిగో.. కదులుతున్న వాహనం నుంచి సినిమా ఫక్కీలో దొంగతనం, ఆరుగురు నిందితులు అరెస్ట్
Team Latestlyమహారాష్ట్రలో కదులుతున్న ట్రక్కుపై సినిమా తరహాలో దొంగతనం జరిగినట్లుగా చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని సోలాపూర్-ధులే హైవేపై ఉన్న ధరాశివ్ గ్రామం దగ్గర ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. కెమెరాలో రికార్డైన ఈ దోపిడీ చర్యలో ధారాశివ్ గ్రామంలో పట్టపగలు కదులుతున్న ట్రక్కు నుండి దొంగల గుంపు దొంగతనం చేస్తున్నట్లు చూపిస్తుంది
ITR Filing 2025 Deadline: ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తేదీ గడువును పొడిగించండి, కేంద్రాన్ని కోరుతున్న పలువురు సీఏలు, మరి ఐటీఆర్ ఫైలింగ్ 2025 గడువును కేంద్రం పొడిగిస్తుందా ?
Team Latestlyకేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు తేదీని 2025 తేదీని పొడిగిస్తుందా? లేదా అనే దానిపై క్లారిటీ లేదు.అయితే సెప్టెంబర్ 15 గడువు దగ్గర పడుతున్నందున దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి పొడిగింపును డిమాండ్ చేస్తున్నందున ఈ ప్రశ్న తలెత్తుతుంది.
‘Stay Away From Russian Military’: రష్యా సైన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరవద్దు, మాస్కోలో చిక్కుకున్న భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Team Latestlyభారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) భారతీయ పౌరులను రష్యన్ సైన్యంలో చేరకుండా కఠినంగా హెచ్చరించింది. ఇటీవల మాస్కోకు వెళ్లిన అనేక మంది భారతీయులు ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతాల్లో ఫ్రంట్‌లైన్‌లో సైన్యంతో కలిసి పాల్గొంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.