India

V.C. Sajjanar: టీజీఎస్ఆర్టీసీ ఎండీగా చివరి రోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్, బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉందంటూ భావోద్వేగం, హైదరాబాద్ సీపీగా తదుపరి బాధ్యతలు

Team Latestly

నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ ఈ రోజు బాధ్యతల నుంచి తప్పుకుని కొత్త బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు

Hyderabad Fire: వీడియో ఇదిగో, ఎస్సార్‌నగర్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, ప్రయాణికులు సేఫ్, మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధం

Team Latestly

హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌ నగర్‌ చౌరస్తా వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమౌన డ్రైవర్‌ రోడ్డుపై బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

Bengaluru: బెంగుళూరులో దారుణం, చీరలు చీరలు దొంగిలించిందని మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టిన షాపు యజమాని, మహిళతో పాటు యజమానికి కూడా అరెస్ట్

Team Latestly

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాప్‌లో చీరలు దొంగిలించిందని ఆరోపణతో ఒక మహిళపై అమానుష దాడి జరిగింది. మాయా సిల్క్స్‌ శారీస్ అనే దుకాణంలో ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు రూ.91,500 విలువైన 61 చీరలను దొంగిలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, వేడి పాలగిన్నెలో పడిన చిన్నారి మృతి, అనంతపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన

Team Latestly

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి లక్షిత స్కూల్ వంటగదిలో వేడి పాల గిన్నెలో పడి తీవ్ర గాయపడి మరణించింది. ఈ ఘటన గురుకుల సీసీటీవీ ఫుటేజీ బయటపడిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Kidney Health Alert: మీ కిడ్నీ ప్రమాదంలో పడిందంటే కారణం ఈ ఆహార పదార్థాలే, వెంటనే మీ మెనూ నుండి వీటిని తీసేయపోతే అనారోగ్యంతో విలవిలలాడిపోతారు..

Team Latestly

కిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలుగా పనిచేస్తాయి. అవి రక్తాన్ని శుభ్రం చేయడం, ద్రవాలను సమతుల్యం చేయడం, ఉప్పు, ఖనిజాలు, వ్యర్థాలను బయటకి పంపడం వంటి ప్రాథమిక పనులను నిర్వహిస్తాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యంగా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Rain Alert: మరో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు, ఇంటి దగ్గర నుండే పని చేయండి, నగర ఉద్యోగులకు పోలీసులు ఆదేశాలు, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌

Team Latestly

హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు నగర జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చాయి. రహదారులు జలమయమవగా, ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి. వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.

Kidnapping Caught on Camera: వీడియో ఇదిగో.. పట్టపగలే చిన్నారి కిడ్నాప్,తమిళనాడులోని వెల్లూరులో సంఘటన, మొత్తం దృశ్యం CCTVలో రికార్ట్

Team Latestly

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని గుడియాతం ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 ఏళ్ల బాలుడిని ఇంటి బయట నుంచి అపహరించారు. ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది, ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వీడియో ఫుటేజ్ ప్రకారం, కర్ణాటక లైసెన్స్ ప్లేట్ ఉన్న కారు నుండి హెల్మెట్ ధరించిన యువకుడు దిగాడు.

OG Fans Chaos: పవన్ ఫ్యాన్స్ రచ్చ.. ‘OG' సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు, బెంగళూరులో KR పురంలో ఘటన , షో నిలిపివేత

Team Latestly

బెంగళూరులోని KR పురం థియేటర్లో ‘OG’ సినిమా ప్రీమియర్ షోలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో షో చూడటానికి వచ్చారు. అయితే షో ప్రారంభానికి ముందు కొంత మంది అభిమానులు తగిన నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించారు. కొంతమంది కత్తులతో స్క్రీన్‌ను చింపేయడంతో థియేటర్ యాజమాన్యం షోను నిలిపివేయవలసి వచ్చింది.

Advertisement

Agni-Prime Missile: అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్, రైలు నుంచే శత్రు దేశాలపై గురి పెట్టి ముచ్చెమటలు పట్టించనున్న మిస్సైల్, వీడియో ఇదిగో..

Team Latestly

భారత రక్షణ రంగంలో మరో మిస్సైల్ చేరింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ మధ్యంతర శ్రేణి క్షిపణిని రక్షణ రంగం విజయవంతంగా పరీక్షించింది. ఈ చారిత్రక ప్రయోగం విజయంతో.. ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల సరసన ఇండియా సగర్వంగా నిలిచింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు.

Backward Walking: రోజూ 10 నిమిషాలు వెనుకకు నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవిగో, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి అన్నీ మాయమయిపోతాయి..

Team Latestly

మన ఇంట్లో పెద్దలు భోజనం చేసిన తర్వాత కాస్త నడవమని ఎప్పుడూ చెబుతుంటారు. అలాగే ఆరోగ్య నిపుణులు కూడా అదే సలహా ఇస్తారు. ఎందుకంటే భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్‌కి చేరిన భారత్, బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం, నేడు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మధ్య రసవత్తర పోరు..గెలిచిన టీం ఫైనల్‌కు

Team Latestly

ఆసియా కప్ 2025లో భారత జట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌, స్పిన్నర్ల మాయాజాలం తోడవడంతో మంగళవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

OG Ticket Price Hike Suspension: విడుదలకు ముందే ఓజీ మూవీకి బిగ్ షాక్, టికెట్ ధరల పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు

Team Latestly

తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు నిర్వహించడం, టికెట్ ధరలను తాత్కాలికంగా పెంచడం కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వం ఆదేశాలను నిలిపివేసింది. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సస్పెండ్ చేశారు.

Advertisement

Telangana Rains Update: తెలంగాణలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు, ఈ నెల 30 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక

Team Latestly

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rajya Sabha By-Election 2025: మోగిన రాజ్యసభ ఉప ఎన్నికల నగారా, జమ్మూకాశ్మీర్‌లో 4 రాజ్యసభ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు, పంజాబ్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక, అక్టోబర్ 24న పోలింగ్

Team Latestly

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తాజాగా రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది, జమ్ముకశ్మీర్‌లో (Jammu and Kashmir) చాలా కాలంగా ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు త్వరలో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ స్థానాలు దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్నాయి.

Ramleela Shock: వీడియో ఇదిగో..రామ్‌లీలా నాట‌కం వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన దశరథుడి పాత్రధారి, అక్కడికక్కడే మృతి

Team Latestly

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని చంబా జిల్లాలో శనివారం రాత్రి రామ్‌లీలా నాట‌కం సమయంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాటకంలో దశరథుడి పాత్ర పోషిస్తున్న సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ అమ్రిశ్ కుమార్ స్టేజ్‌పైనే అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు.

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, ఉపాధ్యాయురాలిపై హెడ్‌మాస్టర్‌ లైంగిక వేధింపులు..అడిగినందుకు విద్యాధికారిపై బెల్ట్‌తో దాడి, నిందితుడు అరెస్ట్

Team Latestly

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సీతాపూర్‌ జిల్లాలోని మహమ్మదాబాద్‌ బ్లాక్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బ్రిజేంద్ర కుమార్ వర్మ చేసిన దారుణ సంఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంఘటన ప్రకారం అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలి పై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Advertisement

Dickie Bird Dies: దిగ్గజ క్రికెట్‌ అంపైర్‌ డికీ బర్డ్‌ కన్నుమూత, 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ వైపు..హస్యంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసిన లెజెండ్

Team Latestly

ప్రఖ్యాత క్రికెట్‌ అంపైర్‌ హెరాల్డ్‌ డెనిస్‌ డికీ బర్డ్‌ (92) మంగళవారం లండన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని యార్క్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. 2014లో ఆయన ఆ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1933 ఏప్రిల్‌ 19న యార్క్‌షైర్‌లో జన్మించిన డికీ బర్డ్‌ చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నారు.

Navratri Fasting Guide: దేవీ నవరాత్రులు.. ఉపవాస సమయంలో ఈ పదార్థాలను తినకండి..ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి

Team Latestly

ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రులు భక్తులకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులలో దుర్గమ్మను వివిధ రూపాల్లో పూజిస్తూ, ఉపవాసం పాటించడం ద్వారా శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత కలుగుతాయని నమ్మకం. అయితే ఉపవాస సమయంలో కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

Rain Alert: ఏపీకి బిగ్ అలర్ట్..వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజె అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Do Vaccines Cause Autism? టీకాల వల్ల ఆటిజం రావడం అనేది అబద్దం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Team Latestly

మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఆరోపణలకు ఆధారాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అదేకాక, మనిషి ప్రాణాలు రక్షించే టీకాల విలువపై ప్రజల్లో అనుమానం కలిగేలా మాట్లాడొద్దని హెచ్చరించారు.

Advertisement
Advertisement