విద్య
NEET PG Result 2022 Declared: నీట్ పీజీ ఫలితాలు విడుదల, ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోండి
Hazarath Reddyనేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్ నీట్ పీజీ ఫలితాలను విడుదల చేసింది. కేవలం 10 రోజుల్లోనే విడుదల చేశామని మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. మెడికల్ ఎగ్జామ్ మే 21న నిర్వహించారు. మెడికల్ ఎగ్జామ్ రాసిన వారు కింద ఇచ్చిన లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. nbe.edu.in and natboard.edu.in. వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
UPSC Result 2021 Declared: సివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు విడుదల, 685 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ బోర్డు, ఈ సారి నలుగురు టాపర్లు అమ్మాయిలే
Hazarath Reddyసివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్‌ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా (UPSC Result 2021 Declared) చాటారు.
TS Inter Academic Calendar 2023: జూన్ 15 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ సెకండ్ ఇయర్ త‌ర‌గ‌తులు, జూలై 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ క్లాసులు, అక‌డ‌మిక్ షెడ్యూల్‌ విడుదల చేసిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు
Hazarath Reddyతెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ఇంట‌ర్ బోర్డు సోమ‌వారం 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ షెడ్యూల్‌ను విడుద‌ల (TS Inter Academic Calendar 2023) చేసింది
NEET PG Exam 2022: నీట్‌ పీజీ 2022 వాయిదాకు నిరాకరించిన సుప్రీంకోర్టు, విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్న అత్యున్నత దర్మాసనం, మే 21న నీట్ పీజీ పరీక్ష
Hazarath Reddyజాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ పీజీ 2022 వాయిదాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్‌ పీజీ- 2022 పరీక్షలను (NEET PG Exam 2022) వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం (Supreme Court) పేర్కొంది.
Andhra Pradesh: అసని తుఫాను కారణంగా నేడు జరగనున్న ప‌రీక్ష వాయిదా, తిరిగి మే 25, 2022న నిర్వ‌హిస్తామ‌ని ప్రకటించిన బోర్డు
Hazarath Reddyబంగాళఖాతం నుంచి పొంచిఉన్న తీవ్ర తుఫాను అసని కారణంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో బుధవారం జరగనున్న పలు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు.
AP SSC Exam 2022: పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను నో ఫోన్‌ జోన్లుగా ప్రకటించిన విద్యాశాఖ, పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ఆదేశాలు
Hazarath Reddyరాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ‘నో ఫోన్‌’ జోన్లుగా (All examination centres declared 'No-phone Zones) ప్రకటించింది. దీంతో పాటు టెన్త్‌ పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ( DEO) ఆదేశాలు జారీచేసింది.
TS Police Recruitment 2022: నేటి నుంచి తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు దరఖాస్తు ప్రక్రియ, మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రాసెస్ మీకోసం
Hazarath Reddyతెలంగాణ‌లో జాబ్‌ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ( TS Govt)గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది.
Andhra Pradesh: ఏపీలో మే 9 నుంచి వేసవి సెలవులు, వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి ప్రారంభం, ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ
Hazarath Reddyఏపీలో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జూలై 4 నుంచి మొద‌లు కానుంది. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ విద్యా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు (AP School Summer Holidays 2022) మొద‌లు కానున్నాయి.
Telangana: నిరుద్యోగులకు శుభవార్త, 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపిన తెలంగాణ సర్కారు, విడివిడిగా జీవోలు జారీ చేసిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు
Hazarath Reddyతొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ.. తాజాగా బుధవారం మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు
TS SSC Exams: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ
Hazarath Reddyతెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం (time was extended to 30 minutes) పొడిగించారు.
TS EDCET-2022: టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల, రెండేండ్ల బీఎడ్ కోర్సుకు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు
Hazarath Reddyతెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు (TS EDCET-2022) సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ రామ‌కృష్ణ‌, ఎడ్‌సెట్ కో క‌న్వీన‌ర్ శంక‌ర్ విడుద‌ల చేశారు.
TS ICET 2022: టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ విడుదల, ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు, జులై 27, 28 తేదీల్లో ఐసెట్ ప‌రీక్ష
Hazarath Reddyతెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ను కాక‌తీయ విశ్వవిద్యాల‌యం బుధ‌వారం విడుద‌ల (TS ICET 2022) చేసింది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.
TS EAMCET 2022: టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుదల, ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు
Hazarath Reddyటీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను (TS EAMCET 2022) స్వీక‌రిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు.
AP EAPCET 2022: ఏపీ ఈఏపీ సెట్‌ షెడ్యూల్ విడుదల, జూలై 24 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ విభాగపు పరీక్షలు, ఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపిన మంత్రి సురేష్
Hazarath Reddyఏపీ ఈఏపీ సెట్‌(EAPCET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు.
TS EAMCET 2022: తెలంగాణలో జూలై 14 నుంచి ఎంసెట్, జూలై 13న ఈసెట్, జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు, జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు
Hazarath Reddyతెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. జూలై 13న ఈసెట్ జరగనుండగా, జులై 14 నుంచి ఎంసెట్ (TS EAMCET 2022) షురూ కానుంది. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరపనున్నారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
TS Inter Exams 2022: తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, పూర్తి వివరాలు కథనంలో..
Hazarath Reddyతెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది.
Half-Day Schools in TS: తెలంగాణ‌లో రేప‌ట్నుంచి ఒంటిపూట బ‌డులు, ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్న స్కూల్స్
Hazarath Reddyతెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు (Half-Day Schools in TS) నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.
Andhra Pradesh: ఏపీలో మే 2 నుంచి ఓపెన్ స్కూల్స్‌ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలు, వృత్తి విద్యా కోర్సులకు మే 13 వ తేదీ నుండి 17వ తేదీ వరకూ ప్రాక్టికల్‌ పరీక్షలు
Hazarath Reddyఏపీలో ఓపెన్ స్కూల్స్‌ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల (SSC and inter exam schedule released) చేశారు. మే నెల 2వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తెలుగు పరీక్ష ఉంటుందన్నారు.
AP Inter Exam 2022 Postponed: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..
Hazarath Reddyఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసి.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగనున్నాయి. విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది.
JEE Main 2022 Exam Dates: జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల, మార్చి ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, రెండు విడతల్లోనే పరీక్షలు
Hazarath Reddyదేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను (JEE Main 2022 schedule released) విడుదల చేసింది.