విద్య

NEET Admit Card 2020 Released: నీట్ అడ్మిట్ 2020 కార్డు విడుదల, సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు, సెప్టెంబరు 13న నీట్ 2020 పరీక్ష‌

Hazarath Reddy

ప్రతిపక్ష పార్టీల వ్యతిరకేత నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌ 2020)కి సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం మధ్యాహ్నం అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల (NEET Admit Card 2020 Released) చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ 2020 కి సంబంధించిన అడ్మిట్‌కార్డులను (NEET UG Admit Card 2020 Released) కూడా ఎన్‌టీఏ విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్ 2020 పరీక్ష‌ సెప్టెంబరు 13న నిర్వహించనుంది.

World’s Fastest Human Calculator: హైదరాబాదీ యువకుడి ఘనత, ప్రపంచంలోనే వేగవంతమైన హ్యూమన్ క్యాలెక్యులెటర్‌గా అవతరణ, లండన్ మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్ నుంచి బంగారు పతకం గెలుపు

Team Latestly

యింట్ స్టీఫెన్స్ కాలేజీలో మేథమేటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న భానుప్రకాష్ తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే SIP అబాకస్ ప్రోగ్రామ్ లో చేరి అందులోనే 9 లెవెల్స్ విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్....

Education Row in TS: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్, ఆన్‌లైన్ ద్వారా విద్యాభోదన, అధ్యాప‌కులు,ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచే హాజరుకావాలని ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణలో సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి ఇంటర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు (Online classes) ప్రారంభం అవుతాయ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థుల‌కు కూడా అదే రోజు నుంచి ఆన్‌లైన్ బోధ‌న ప్రారంభం అవుతుంద‌ని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా డిజిట‌ల్ బోధ‌న ఉంటుంద‌ని తెలిపారు. దీని కోసం అధ్యాప‌కులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ పూర్తి చేశామ‌ని తెలిపారు. కాగా అధ్యాప‌కులు ఈ నెల‌ 27 నుంచే కళాశాలల‌కు వెళ్ళాల‌ని విద్యా శాఖ మంత్రి (TS Educatuonal Minister) ఆదేశాలు జారీ చేశారు.

AP Entrance Exams New Dates: ఏపీలో సెట్స్‌ నిర్వహణ తేదీలు ఖరారు, సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, అన్ని పరీక్షల తేదీల వివరాలు లోపల కథనంలో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ‍క సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది.

Advertisement

AP SSC Result 2020 Declared: ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల, పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ పాస్, మార్కుల వివరాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏపీ 10 వ తరగతి పరీక్షల ఫలితాలను (AP SSC 10th Result Declared) ఆంధ్రప్రదేశ్ బోర్డు (సెకండరీ ఎడ్యుకేషన్) విడుదల చేసింది.10 వ తరగతి పరీక్షలకు హాజరైన 6.39 లక్షల మంది విద్యార్థులు వెబ్‌సైట్- bse.ap.gov.in మరియు manabadi.com ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం, COVID-19 మహమ్మారి పరిస్థితుల కారణంగా పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులందరికీ పదోన్నతి లభించింది. ఈ ఏడాది ఎస్‌ఎస్‌సి పరీక్షకు హాజరైన 6.39 లక్షల మంది విద్యార్థులకు పదోన్నతి లభించింది.

AP Inter Reverification Results 2020 Declared: ఏపీ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల సమాచారం

Hazarath Reddy

AP ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు 2020 (AP Inter Reverificaiton Results 2020 Declared) వెలువడ్డాయి. BIEAP 2 వ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం AP ఇంటర్ రివెరిఫికేషన్ ఫలితాలను ( Re-verification Results) 2020 అధికారికంగా ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం, BIEAP ఇంటర్ రివెరిఫికేషన్ ఫలితాలు 2020 మరియు AP ఇంటర్ రీకౌంటింగ్ ఫలితాలు 2020 ఈ రోజు ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ప్రచురించబడ్డాయి. AP ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితం 2020 కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ్వడం ద్వారా వారి వివరణాత్మక ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

National Education Policy 2020: కేంద్రానికి తమిళనాడు షాక్, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయమని తెలిపిన సీఎం పళని స్వామి, పునరాలోచించాలని ప్రధానికి విజ్ఞప్తి

Hazarath Reddy

కేంద్ర సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన నూతన జాతీయ విధానం(NPE)పై తమిళనాడు సర్కారు (Taminadu Govt) అసహనం వ్యక్తంచేసింది. కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానంలోని ‘త్రి భాషా సూత్రా’న్ని (3 Language Formula) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి పళని స్వామి (Edappadi Karuppa Palaniswami) ప్రకటించారు. ఈ విధానం తమకు అత్యంత బాధా, విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విధానాన్ని ఎంత మాత్రమూ అమలు చేయమని స్పష్టం చేశారు.

English Medium Row: ఇంగ్లీష్ మీడియానికే కట్టుబడి ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ,యూకేజీ విద్య అమలు, మీడియాతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్

Hazarath Reddy

ఇప్పటికీ ఇంగ్లీషు మీడియం స్కూళ్లకే కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Education Minister Adimulapu Suresh) స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై (National Education Policy (NEP) ఆయన స్పందించారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకొనే తాము విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 97శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం (English Medium) కావాలన్నాన్నారు.

Advertisement

MHRD Renamed as Ministry of Education: హెచ్‌ఆర్డీ ఇకపై విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు, ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర కేబినెట్‌, జాతీయ విద్యా విధానానికీ కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Hazarath Reddy

కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ‌ ‌శాఖ (Ministry of Human Resource and Development ) పేరులో మార్పు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు దాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ‌ శాఖ (Ministry of Education) గా మార్చనుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.

AP Schools Reopen Date: సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం, మీడియాతో మాట్లాడిన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీలో కొవిడ్‌–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని (AP Schools Reopen Date) నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)పై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి (Education Minister Adimulapu Suresh) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

UG,PG Exams in AP: ఏపీలో సెప్టెంబర్ లోపు పీజీ,యూజీ పరీక్షల నిర్వహణ, మీడియాకు వెల్లడించిన ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి

Hazarath Reddy

యూజీసీ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 యూనివర్సిటీల పరిధిలో పీజీ, యూజీ పరీక్షలను (Andhra Pradesh pg-and-ug-exams) సెప్టెంబర్‌లోపు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రోఫెసర్‌ హేమచంద్రారెడ్డి (Professor Hemachandra Reddy) తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఎడ్యూకేషన్‌తో పాటు రెగ్యూలర్‌ ఎడ్యుకేషన్‌ రెండు అవసరమేనని గవర్నర్‌ సూచించారని తెలిపారు. కోవిడ్‌ కారణంగా అకడమిక్‌ కరిక్యులమ్‌ రీ డిజైన్‌ చేస్తున్నామని ఆయన అన్నారు.

CBSE 10th Result Declared: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, ఫలితాలను విద్యార్థులు results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాలు (CBSE Class 10 Exam Result 2020) విడుదల అయ్యాయి. ముందుగా చెప్పినట్లుగానే టెన్త్ ఫలితాలను బుధవారం నాడు సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. రెండు రోజుల క్రితం 12వ తరగతి రిజల్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టెన్త్ రిజల్ట్స్‌పై ఉత్కంఠ పెరిగింది. సుమారు 18 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

CBSE 12th Result 2020 Declared: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, పదో తరగతి ఫలితాలు కూడా త్వరలో విడుదల, ఫలితాలను http://results.nic.in/ లేదా http://cbse.nic.in/ లేదా http://cbseresults.nic.in/ ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

సీబీఎస్ఈకి చెందిన 12వ తరగతి పరీక్ష ఫలితాలు (CBSE 12th Result 2020 Declared) విడుదలయ్యాయి. ఈ మేరకు జులై 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRD) శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ రోజు ఫలితాలు (CBSE 12th Result 2020) విడుదలయ్యాయి.

TS Inter Supplementary Exams: తెలంగాణా ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా ఇంటర్ బోర్డ్

Hazarath Reddy

తెలంగాణా ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు (Inter Supplementary Exams Cancelled)చేస్తూ తెలంగాణా ఇంటర్ బోర్డ్ (TS Inter Board) నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరిని పాస్‌ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 1.47 లక్షల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని ఆమె చెప్పారు.

UGC New Announcement: డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయడం కుదరదు, తప్పనిసరిగా పరీక్షల నిర్వహించాల్సిందే, స్పష్టం చేసిన యూజీసీ సెక్రటరీ రజనీష్ జైన్

Hazarath Reddy

యూజీ, పీజీ కోర్సులతోపాటు ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు (Final Year Exams 2020) సంబంధించి మరోమారు యూజీసీ సెక్రటరీ కీలక ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాలు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని యూజీసీ (University Grant Commission) సెక్రటరీ తాజాగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశామని చెప్పారు. యూనివర్సిటీలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ (Rajnish Jain) తెలిపారు.కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ( Health Ministry) మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.

CBSE Syllabus Reduction: సీబీఎస్ఈ సిలబస్ 30 శాతం తగ్గింపు, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన హెచ్‌ఆర్‌డి మంత్రి, కరోనా సమయంలో కోల్పోయిన సమయాన్ని తిరిగి భర్తీ చేసేలా నిర్ణయం

Hazarath Reddy

సిబిఎస్‌ఇ వచ్చే విద్యా సంవత్సరానికి 10 మరియు 12 తరగతుల సిలబస్‌ను మూడింట ఒక వంతు (CBSE Syllabus Reduction) తగ్గించింది. ప్రధాన అంశాలను నిలుపుకోవడం ద్వారా సిబిఎస్‌ఇ సిలబస్‌ను 30 శాతం వరకు (CBSE Cuts Syllabus by 30%) హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (Ramesh Pokhriyal) అన్నారు. దేశంలో మరియు ప్రపంచంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను పరిశీలిస్తే, సిబిఎస్‌ఇ పాఠ్యాంశాలను సవరించాలని, 9 వ తరగతి నుండి 12 వ తరగతి విద్యార్థులకు కోర్సు భారాన్ని మరింతగా తగ్గించాలని సూచించారు. విద్యార్థుల కోసం సిలబస్‌ను తగ్గించడంపై ఒక నిర్ణయానికి రావడానికి అన్ని విద్యావేత్తల సలహాలను మంత్రి ఆహ్వానించారు. కాగా 1500 కి పైగా సూచనలు వచ్చాయని చెప్పారు.

Advertisement

NEET, JEE Exams 2020: నీట్, జేఈఈ 2020 పరీక్షలు సెప్టెంబర్ వరకు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్

Team Latestly

కొత్త తేదీల ప్రకారం, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జెఇఇ మెయిన్ - ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 1 నుండి 6 వరకు జరగనున్నాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరుగుతుంది...

All Entrance Exams Postponed in TS: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా, హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం, ఎంట్రెన్స్‌ టెస్టులను రద్దు చేయాలని హైకోర్టులో పిల్‌ వేసిన స్టూడెంట్‌ యూనియన్‌ నేతలు

Hazarath Reddy

కరోనావైరస్ కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా (All Entrance Exams Postponed in TS) పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం (Telangana government) నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Karnataka Schools: స్కూళ్లు తెరవడంపై జూలై 5 తర్వాత నిర్ణయం, వెల్లడించిన కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎస్‌ సురేశ్ కుమార్‌, కర్ణాటకలో ప్రణాళిక ప్రకారం పదో తరగతి పరీక్షల నిర్వహణ

Hazarath Reddy

కర్ణాటకలో స్కూళ్లు (Karnataka Schools) తెరవడంపై జూలై 5 తర్వాత నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎస్‌ సురేశ్ కుమార్‌ (State Education Minister) తెలిపారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణను సోమవారం విద్యాశాఖా మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి సురేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కర్ణాటకలో స్కూళ్లను పునరుద్ధరించే అంశంపై (Govt to Reopen Schools) ఆయన మాట్లాడారు. ఒకటి నుంచి పదో తరగతి తరగతుల నిర్వహణకు కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో స్కూళ్లు ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.

Delhi Schools to Remain Closed: జూలై 31 వరకు స్కూళ్లు మూసివేత, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కారు, ఆన్‌లైన్‌ క్లాసెస్‌ నిర్వహించుకునేందుకు పర్మిషన్

Hazarath Reddy

దేశ రాజధానిలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలను జూలై 31 వరకు తెరవకూడదని (Delhi Schools to Remain Closed) ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ‘జూలై 31 వరకు పాఠశాలల మూసివేత కొనసాగుతుంది. అయితే, ఈ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసెస్‌ను (Online classes) నిర్వహించుకోవచ్చు’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) శుక్రవారం తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభంపై అధికారులతో చర్చించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

Advertisement
Advertisement