సమాచారం

Fuel Price in India: వాహనదారులకు మళ్లీ షాక్, మరోసారి పెరిగిన చమురు ధరలు, పెట్రోల్‌పై లీటర్‌కు 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 33 పైసలు పెంచిన చమురు కంపెనీలు

Hazarath Reddy

వాహనదారులకు చమురు కంపెనీలు మళ్లీ షాక్‌ ఇచ్చాయి. రెండు రోజుల తర్వాత సోమవారం మరోసారి చమురు ధరలను (Petrol and Diesel Prices in India) పెంచాయి. పెట్రోల్‌పై లీటర్‌కు 26 పైసలు, డీజిల్ లీటర్‌కు 33 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.53కు చేరుకుంది. డీజిల్‌ లీటర్‌కు రూ.82.06కు చేరింది.

Bank Alert: మూడు ప్రధాన బ్యాంకుల అలర్ట్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దని తెలిపిన ఎస్బిఐ, ఫోన్‌ కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లకు దూరంగా ఉండాలని కోరిన PNB, ఫ్రాడ్ లింక్ క్లిక్ చేయవద్దని తెలిపిన ఐసిఐసిఐ

Hazarath Reddy

కొన్నిసార్లు సహాయం పేరిట, కొన్నిసార్లు చికిత్స పేరిట మరియు కొన్నిసార్లు సహాయం అందించే పేరిట వివిధ రకాలుగా కస్టమర్లను మోసగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ కస్టమర్లను ఉచ్చులో పడకుండా కాపాడటానికి దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు హెచ్చరికలు (SBI, PNB and ICICI have special warning for customers) జారీ చేశాయి.

Oxygen Crisis in India: దేశంలో ఆక్సిజన్ కొరత, జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, వారం రోజుల్లోగా టాస్క్‌ఫోర్స్‌ బృందం సేవలు అందుబాటులోకి

Hazarath Reddy

కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు (Supreme Court Sets Up National Task Force) చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

2-DG: కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం లేని మెడిసిన్, 2-డీజీ ఔషధాన్ని తీసుకువచ్చిన డీఆర్డీవో, డీఆక్సీ డి గ్లూకోజ్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం ఓ సరికొత్త ఔషధాన్ని తీసుకువచ్చింది. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్... సంక్షిప్తంగా 2-డీజీ (2-DG) అంటారు. 2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు (DCGI Approves Anti-COVID-19 Oral Drug) చేసింది.

Advertisement

Covid Lockdown: పెను ముప్పుగా మారిన సెకండ్ వేవ్‌, 14 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, మిగతా రాష్ట్రాల్లో నైట్, డే కర్ఫ్యూలు, నిన్న కొత్తగా నాలుగు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 4,187 మంది కరోనా కారణంగా మృతి

Hazarath Reddy

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ (COVID-19 lockdown) విధించాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని చాలా రాష్ట్రాలు అనుకోవడం..మరికొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బ తింటామనే ఉద్దేశంతో పాక్షిక లాక్ డౌన్ (imposed strict Coronavirus curbs, curfews) అమల్లోకి తీసుకువచ్చాయి.

Mucormycosis: కరోనా మాటున మరో పెను ముప్పు, కోలుకున్నవారిపై బ్లాక్‌‌ ఫంగస్‌ దాడి, మ్యుకోర్‌‌మైకోసిస్‌ సోకి చూపును కోల్పోతున్న పేషెంట్లు, ఈ వ్యాధి ఎలా సోకుతుంది, బ్లాక్‌‌ ఫంగస్‌ లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనావైరస్ నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్‌‌ ఫంగస్‌‌ (మ్యుకోర్‌‌మైకోసిస్‌‌) ఇన్ఫెక్షన్‌‌ (Black Fungus) భయపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్‌‌ ఫంగస్‌‌ (మ్యుకోర్‌‌మైకోసిస్‌‌) ఇన్ఫెక్షన్‌ (Mucormycosis)‌ భయపెడుతోంది.

Curfew in Andhra Pradesh: తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్, వస్తే మధ్యాహ్నం 12 గంటల్లోపే గమ్యం చేరాలి, నేటి నుంచి ఏపీలో 18 గంట‌ల కర్ఫ్యూ అమల్లోకి, కర్ప్యూ నుంచి మినహాయింపు పొందేవి ఏవో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

నేటి నుంచి ప‌గ‌టిపూట క‌ర్ఫ్యూ (Curfew in Andhra Pradesh) కూడా అమ‌ల‌ు చేస్తోంది. నేటి నుంచి రాష్ట్రంలో ప్ర‌తిరోజూ 18 గంట‌ల చొప్పున క‌ర్ఫ్యూ (18-hour curfew from today in Anadhra Pradesh) అమ‌లు కానుంది. ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ (Day Time Curfew) అమ‌ల్లో ఉంటుంది.

JEE (Main) May 2021 Session Postponed: జేఈఈ మెయిన్స్‌ వాయిదా, అప్‌డేట్స్‌ కోసం సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌

Hazarath Reddy

పెరుగుతున్న కోవిడ్‌ కేసుల దృష్టా కేం‍ద్రం ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్స్‌ వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ మంగళవారం ప్రకటన చేశారు.

Advertisement

Fuel Price Hike: మళ్లీ పెట్రో బాదుడు బాదుడు మొదలైంది, దేశంలో 18 రోజుల తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు, దేశ రాజధానిలో పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు పెంపు

Hazarath Reddy

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను (Fuel Price Hike) పెంచేశాయి. 18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు (Petrol and Diesel Prices in India on May 4, 2021) ప్రకటన వెలువడింది.

Lockdown in India: భారత్‌లో సెకండ్ వేవ్‌ లాక్‌డౌన్, పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన అత్యున్నత న్యాయస్థానం, ఆక్సిజన్‌ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్ మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్‌ (Lockdown in India) విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు (Supreme Court to Centre, States) సూచించింది.

South Central Railway: అలర్ట్..ప్రయాణికులు లేక 25 రైళ్లు రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే, 35కు చేరుకున్న రద్దయిన మొత్తం రైళ్ల సంఖ్య, తాజాగా రద్దయిన రైళ్ల వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

దేశంలో కరోనా కల్లోలం రైళ్లపై పడింది. జనాలు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చే సాహసం చేయకపోవడం..ప్రయాణాలు లాంటివి పెట్టుకోకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే 23 రైళ్లను తాత్కాలికంగా రద్దు (South Central Railway cancels 25 trains) చేయగా, మరో రెండింటిని పాక్షికంగా రద్దు చేసింది

Covid-19 Vaccine Registration: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్ చాలా ఈజీ, ఈ పద్ధతిలో మీరు తేలిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

18 ఏండ్లు పైబ‌డిన వారికి టీకాల కోసం నేటి సాయంత్రం 4 గంట‌ల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మయ్యాయి. కొవిన్, ఆరోగ్య‌సేతు, ఉమాంగ్ యాప్‌ల‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభ‌మ‌య్యాయి. మొబైల్ నంబ‌ర్ ద్వారా రిజిస్ర్టేష‌న్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

Advertisement

Moderate Rains: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి, బలహీన పడిన ఉపరితల ఆవర్తనం, హైదరాబాద్‌లో భానుడి భగభగలు

Hazarath Reddy

గ్రేటర్‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు. నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రోజుకు సగటున 38 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి. మళ్లీ ఆరు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Coronavirus Scare: జాగ్రత్తగా ఉండండి..ఒక్కడి నుంచి 406 మందికి కరోనా, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించకుంటే జరిగేది అదే, కరోనాను నిరోధించేందుకు నిబంధనలు పాటించాలని కోరిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కరోనా సోకిన వ్యక్తి సామాజిక దూరం నిబంధనను పాటించని పక్షంలో అతని వల్ల 30 రోజుల్లో 406 మంది ఈ మహమ్మారి బారిన పడతారని (one Covid-19 patient can infect 406 people in 30 days) కేంద్రం సోమవారం నాడు హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని మరోసారి స్పష్టం చేసింది.

'SC Cannot Sit Quietly': దేశంలో కోవిడ్ సంక్షోభం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని తెలిపిన అత్యున్నత ధర్మాసనం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు

Hazarath Reddy

యావత్ దేశం కోవిడ్ సంక్షోభం ఎదుర్కుంటున్న వేళ ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని (SC on Covid crisis) భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Delhi Lockdown: మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు, తీవ్రమవుతున్న ఆక్సిజన్ కొరత, ఢిల్లీలో కొత్తగా వచ్చే పేషెంట్లను చేర్చుకోలేమంటూ ప్రముఖ ఆస్పత్రిలో బోర్డు

Hazarath Reddy

దేశ రాజధానిలో కరోనా కేసులు పెరగడంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ (Delhi Lockdown) పొడిగించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ ( lockdown in Delhi) అమల్లో ఉంటుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు.

Advertisement

SII Covid Vaccine Price Row: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై విమర్శలు, స్పందించిన సీరం ఇన్‌‌స్టిట్యూట్, భారత్‌లోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం సరికాదని సూచన

Hazarath Reddy

భారత దేశంలోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం (SII Covid Vaccine Price Row) సరికాదని సీరం తెలిపింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై వస్తున్న విమర్శలపై సీరం ఇన్‌‌స్టిట్యూట్ శనివారం స్పందించింది. కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీ కోసం ముందుగానే నిధులు సమకూర్చినందువల్ల ఆ దేశాల్లో వ్యాక్సిన్ ధర తక్కువగా ఉందని వివరించింది.

COVID-19 Vaccination in MP: 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్, సంచలన నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మే 1 నుండి అమల్లోకి..

Hazarath Reddy

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ప్రకటించారు.

COVID-19 Vaccine Price: కోవిషీల్డ్‌ టీకా కావాలంటే రూ. 600 చెల్లించాల్సిందే, కోవిషీల్డ్‌ టీకా ధరలను ప్రకటించిన సీరం, నాలుగైదు నెలల్లో రిటైల్‌ స్టోర్లలోనూ అందుబాటులోకి..

Hazarath Reddy

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో టీకా కొరతను తీర్చేందుకు కేంద్ర ‍ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా ప్రైవేటు మార్కెట్లో కోవిషీల్డ్‌ టీకా ధరలను (COVID-19 Vaccine Price) సీరమ్‌ సంస్థ బుధవారం ప్రకటించింది.

Coronavirus Scare: స్వీయ నిర్భంధంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కరోనా బారీన పడిన పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ ప్రధానులు, ​ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారీన పడి చికిత్స పొందుతున్నారు. అలాగే కోవిడ్ బారీన పడి చాలామంది ముఖ్యమంత్రులు కోలుకున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కరోనా కోరల్లో చిక్కుకున్నారు. కొంతమంది కరోనాకి తోడుగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisement
Advertisement