సమాచారం
BJP MLA Subhash Sudha: బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ, కొన్ని రోజులుగా జ్వరంతో బాధ‌ప‌డుతున్న హర్యానా రాష్ట్రంలోని థానేస‌ర్ ఎమ్మెల్యే సుభాష్ సుధా
Hazarath Reddyహర్యానా రాష్ట్రంలో కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరించుకుంటూ పోతోంది. అక్కడ తాజాగా హ‌ర్యానా బీజేపీ ఎమ్మెల్యేకు (BJP MLA Subhash Sudha) కూడా క‌రోనా సోకింది. కురుక్షేత్ర జిల్లాలోని థానేస‌ర్ నియోజ‌వ‌ర్గ శాస‌న స‌భ్యుడు (Thanesar in Kurukshetra) సుభాష్ సుధా గ‌త కొన్ని రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గురుగ్రావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆయ‌న వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు అరుణ్ గులాటి మీడియాకు వెల్ల‌డించారు.
Maharashtra Cops: మహారాష్ట్రలో 1,030మంది పోలీసులకు కరోనా, కోవిడ్-19 కల్లోలానికి అక్కడ 59మంది పోలీసులు మృతి, ముంబైలో అత్య‌ధిక కేసులు నమోదు
Hazarath Reddyమ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ కల్లోలాన్ని రేపుతోంది. ఈ వైర‌స్ ధాటికి మ‌హారాష్ర్ట ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రో 77 మంది పోలీసుల‌కు (police personnel) క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇద్ద‌రు పోలీసులు క‌రోనాతో (two others died) చ‌నిపోయారు. మ‌హారాష్ర్ట పోలీసు విభాగంలో (Maharashtra Cops) క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,030కి చేరుకోగా, మృతుల సంఖ్య 59కి చేరింది. క‌రోనా విజృంభ‌ణ‌తో పోలీసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.
Maharashtra Lockdown Extension: జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కారు, ముంబైని వణికిస్తున్న కరోనావైరస్
Hazarath Reddy‌మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు వేగంగా పెరిగిపోతున్న‌ాయి. అక్క‌డ క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌డం కోసం గ‌త నాలుగు నెల‌లుగా ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Maharashtra Lockdown) జూలై 31 వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు మ‌హా స‌ర్కారు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది.
Fuel Prices Today: దేశంలో ఆగని పెట్రోమంటలు, వరుసగా 20 వరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు, నేడు పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెంపు
Hazarath Reddyదేశంలో పెట్రో మంటలు (Petro Price Fire) కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు ( Fuel Prices Today), డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 82.96 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర (Diesel price in Delhi) లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది.
Remdesivir Update: కరోనాకు మందు వచ్చేసింది, మొదటి విడతగా 5 రాష్ట్రాలకు 20 వేల రెమ్డీస్వీర్‌‌ ఇంజక్షన్లను సరఫరా చేసిన హెటిరో సంస్థ, 3,4 వారాల్లో లక్ష ఇంజక్షన్లు అందుబాటులోకి
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (Coronavirus) కల్లోలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఇది రోజు రొజుకు విశ్వరూపం చూపిస్తోంది. దీని విరుగుడుకు మందు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా సంస్థ హెటిరో దీని నియంత్రణకు మందును (Hetero's Antiviral Drug) తయారుచేసినట్లు తెలిపింది. రెమ్డీస్వీర్‌ పేరుతో (Remdesivir Update) ఇంజక్షన్‌ రూపంలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది.కాగా కరోనా ఇంజక్షన్‌ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది.
PAN-Aadhaar Card Linking: గుడ్ న్యూస్, ఆధార్-పాన్ లింక్ గడువు 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు, ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది.
Patanjali Covid-19 Drug: దగ్గు మందు పేరుతో కరోనా మందును తీసుకువచ్చారు, పతంజలి కరోనిల్ వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Cornavirus) ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో దాని విరుగుడు కోసం మందును తీసుకువచ్చేందుకు ఫార్మా కంపెనీలు, సైంటిస్టులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా ఇండియాకు చెందిన పతంజలి సంస్థ (Patanjali Ayurved Ltd) కరోనాకు మందును తీసుకువచ్చామంటూ అందరికీ షాక్ ఇచ్చింది. కరోనిల్, స్వాసరి పేర్లతో మందులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి తీసుకుంటే వారం రోజుల్లోనే కరోనా నయమవుతుందని తెలిపింది. అయితే దీనిపై ఇప్పుడు వివాదం రాజుకుంది. దగ్గు మందు పేరుతో లైసెన్స్ తీసుకుని కరోనా మందును తీసుకువచ్చారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand government) పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేసింది.
ATM Usage Charges: రూ.5 వేలు కన్నా ఎక్కువ డ్రా చేస్తే ఛార్జీల మోత తప్పదా? పలు రకాల ఛార్జీలు పెంచుతూ నివేదికను తయారుచేసిన ఆర్బీఐ కమిటీ, నిశితంగా పరిశీలిస్తున్న అత్యున్నత అధికారులు
Hazarath Reddyకోవిడ్-19 కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్న రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎం ఛార్జీలను (ATM Usage Charges) మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్‌లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Patanjali COVID-19 Medicine: కరోనాకు చెక్ పెట్టేందుకు కోరోనిల్, 150కి పైగా ఔషద మొక్కల నుంచి మందును తయారుచేసినట్లు వెల్లడించిన పతంజలి సంస్థ, మార్కెట్లోకి విడుదల చేసిన రాందేవ్ బాబా
Hazarath Reddy: కరోనా వైరస్ నుంచి విముక్తి కల్పించే మందును బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థ తయారుచేసి విడుదల (Patanjali Launches Ayurvedic COVID-19 Medicine) చేసింది. తాము తయారు చేసిన కోరోనిల్ (Coronil) వాడితే రెండు వారాల్లో కరోనానుంచి పూర్తి స్థాయిలో కోలుకుంటారని రాందేవ్ బాబా తెలిపారు. 150కి పైగా ఔషద మొక్కలను వాడినట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. రాజస్థాన్ జైపూర్ నిమ్స్ వైద్యులతో పాటు పలువురు శాస్త్త్రవేత్తల సహకారంతో దీన్ని రూపొందించామని రాందేవ్ చెప్పారు. క్లినికల్ కంట్రోల్ స్టడీ, క్లినికల్ కంట్రోల్ ట్రయల్ చేశాకే తాము కరోనిల్ మందును మార్కెట్లో విడుదల చేశామని చెప్పారు. తమ మందు వాడిన రోగులు అందరూ వంద శాతం కోలుకున్నారని రాందేవ్ చెప్పారు.
Telangana DOST Notification 2020: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి విడుదలైన నోటిఫికేషన్, జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం, పూర్తి సమాచారం మీ కోసం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్‌ (Telangana DOST Notification 2020) జారీ చేసింది. వివిధ వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకొనే విద్యార్థులు జూలై 1 నుంచి 14 వరకు రూ. 200 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో( https:// dost.cgg.gov.in) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబర్‌తో లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన దోస్త్‌ కమిటీ సమావేశంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి నోటిఫికేషన్‌ జారీ చేశారు.
Prepaid Meters Policy: ఏపీలో రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్, త్వరలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు తీసుకువచ్చే ప్రయత్నాలు, ఏపీ విద్యుత్ శాఖ కొత్త వ్యూహం
Hazarath Reddyఏపీలో ప్రతి నెలా కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్‌ శాఖకు (AP Electricity Department) తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ (EPDCL) కొత్త వ్యూహాలను అన్వేషిస్తోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే నెలరోజుల్లో ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్‌ మీటర్లు (Prepaid Meters Policy) అమర్చడానికి ఏపీ విద్యుత్ శాఖ రెడీ అవుతోంది. భుత్వ శాఖలు, ప్రైవేటు సెక్టార్‌కు సంబంధించి బకాయిలు కోట్లలో పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా బకాయిలకు తావులేకుండా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Maharashtra Police: మహారాష్ట్రలో 4,103 మంది పోలీసులకు కరోనా, 24 గంటల్లో 55 మంది పోలీసులకు కోవిడ్-19 పాజిటివ్, మొత్తం 48 మంది కరోనాతో మృతి
Hazarath Reddyమహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు(2020 Coronavirus Pandemic in India) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ అక్కడ పోలీసుల్ని (Maharashtra Police) హడలెత్తిస్తోంది. గడిచిని 24 గంటల్లో 55 మందికి (New COVID-19 Cases) కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్‌-19తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4,103కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 48 మంది పోలీసులు చనిపోయారు.
Coronavirus in Goa: గోవాలో తొలి కరోనా మరణం నమోదు, రాష్ట్రంలో 818కి చేరిన మొత్లం కోవిడ్-19 కేసుల సంఖ్య, జలపాతాలకు వెళ్లే మార్గాలను మూసివేసిన అధికారులు
Hazarath Reddyగోవాలొ కరోనా (Coronavirus in Goa) చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. తాజాగా గోవాలో తొలి కరోనా మరణం (Goa Records First Covid-19 Death) నమోదైంది. మోర్లెమ్‌కు చెందిన 85 ఏండ్ల మహిళకు కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం చనిపోయినట్లు (85-Year-Old Woman Passes Away) గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు. రాష్ట్ర ప్రజలను కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా, కరోనావైరస్ రహితంగా పేర్కొన్న గోవాలో గత నెల నుంచి వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
Earthquakes in Mizoram: ఈశాన్య భారతంలో వరుస భూకంపాలు, మిజోరంలో 12 గంటల వ్యవధిలో రెండుసార్లు కంపించిన భూమి, రిక్టర్ స్కేలుపై 5.5 గా న‌మోదు
Hazarath Reddyఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు(Earthquakes in Mizoram) హడలెత్తిస్తున్నాయి. మిజోరంలో 12 గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి (Earthquakes in Mizoram) కంపించింది. సోమ‌వారం తెల్ల‌వారుజామున 4:10 గంటలకు మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 5.5 గా న‌మోదైన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( (NCS )పేర్కొంది. దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఛంపాయ్ జిల్లాలో న‌మోదైంద‌ని దాదాపు 27 కిలోమీట‌ర్ల లోతు వ‌ర‌కు భూమి కంపించిన‌ట్లు తెలిపింది.
COVIFOR Injection: కరోనా పని ఖతం అయినట్లేనా, కోవిఫర్ ఇంజక్షన్‌కు డిసిజిఐ అనుమతి, 100 మిల్లీగ్రాముల ఇంజెక్ష‌న్‌ ఖరీదు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండే అవకాశం
Hazarath Reddyకరోనా వైరస్‌కు డ్రగ్ (Coronavirus Drug) కనిపెట్టామని హైదరాబాద్ హెటిరో యాజమాన్యం (hetero pharma) తెలిపింది. ‘కోవిఫర్’ (COVIFOR) పేరుతో జనరిక్ మందు అమ్మకానికి డిసిజిఐ అనుమతి (DCGI Approval) ఇచ్చిందని హెటిరో వెల్లడించింది. వెంటనే ‘కోవిఫర్’ మెడిసన్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కోవిడ్ అనుమానితులు, పాజిటివ్ రోగులు గుర్తించ‌బ‌డిన చిన్నారులు, యువత కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రి పాలైన వారి కోసం కోవిఫ‌ర్ అనే మెడిసిన్ సిద్ధమైందని హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ డాక్ట‌ర్ బి.పార్థ‌సార‌థి రెడ్డి తెలిపారు.
High Rain Alert: రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఆదివారం తడిసి ముద్దయిన విజయవాడ
Hazarath Reddyఏపీలో (Andhra Pradesh) రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు (Special rain alert) కురవనున్నాయి. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమ, మంగళ బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (High Rain Alert) కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు (Vizag IMD) వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అయితే కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది.
Solar Eclipse 2020: సూర్యగ్రహణం నేడే, ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఆకాశంలో అద్భుతం, పలు ప్రత్యేకతలతో ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం
Hazarath Reddyఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse 2020) ఈ రోజు ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం (Surya Grahan 2020) తెలంగాణలో ఉదయం 10:15 గంటల నుండి మధ్యాహ్నం 1:44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ఏపీలో ఉదయం 10:21 గంటల నుండి మధ్యాహ్నం 1:49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. ఇక విశ్వవ్యాప్తంగా ఉదయం 9:15:58 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు సూర్యగ్రహణం ఉంటుంది.
Happy Father's Day 2020: పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం
Hazarath Reddyఅంతర్జాతీయ పితృ దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని (Happy Father's Day 2020) పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం (Happy Mother's Day) ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది.
Happy Summer 2020: ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్
Hazarath Reddyనాలుగు సమశీతోష్ణ సీజన్లలో వేసవి అనేది చాలా హాటెస్ట్ సీజన్ గా (Happy Summer 2020) చెప్పవచ్చు. ఇది (Summer Season) వసంత రుతువు తరువాత అలాగే శరదృతువు ముందు వస్తుంది. ఈ వేసవికాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలో పలు మార్పులు సంభవిస్తాయి. రోజులు చాలా ఎక్కువ అనిపిస్తాయి. రాత్రులు తక్కువగానూ పగలు ఎక్కువగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది పగలు తగ్గిపోయి రాత్రి ఎక్కువ అవుతుంది. కాగా వేసవి ప్రారంభ తేదీ (Happy Summer 2020 Dates) వాతావరణం, సంప్రదాయం మరియు సంస్కృతి ప్రకారం మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు, ఇది దక్షిణ అర్ధగోళంలో శీతాకాలంతో విరుద్ధంగా ఉంటుంది. ఈ సీజ్ జూన్ 21న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది.
Reliance Net Debt-Free: జియో ముఖేష్ అంబానీ మ్యాజిక్, రిల్‌లోకి 58 రోజుల్లో రూ.1,68,818 కోట్ల పెట్టుబడులు, రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో ఉందన్న జియో అధినేత
Hazarath Reddyరిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అనుకున్నది సాధించాడు. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ ను అప్పులు లేని సంస్థగా (Reliance Net Debt-Free) మార్చివేశాడు. కాగా 2021 మార్చి నాటికి ఆర్ఐఎల్ (Reliance) సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని ముందే నెరవేర్చామని ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందుగానే సాధించాం. "రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో" (Reliance In Golden Decade) ఉందని బిలియనీర్ అంబానీ ప్రకటించారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 58 రోజుల్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,68,818 కోట్లు సేకరించింది.