సమాచారం
Puri Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే, కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాత్రతో పాటు ఇతర రథయాత్రలు నిర్వహించకూడదని ఒడిశా ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyజూన్‌ 23న ప్రారంభం కానున్న చారిత్రక పూరి జగన్నాథ్‌ రథయాత్ర (Jagannath Rath Yatra in Puri 2020), దాని అనుబంధ కార్యకలాపాలను కోవిడ్‌ కారణంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేయాలని పేర్కొంది. ప్రజారోగ్యం, పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పూరీలోని జగన్నాథస్వామి రథయాత్రకు (Puri Rath Yatra) అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం (Supreme Court stays) చేసింది.
Rajya Sabha Elections 2020: పెద్దల సభకు వెళ్లే పెద్దలు ఎవరు? రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం, దేశ వ్యాప్తంగా 19 సీట్లకు నేడు ఎన్నికలు, ఏపీలో నాలుగు స్థానాలకు పోలింగ్
Hazarath Reddyరాజ్యసభ ఎన్నికలకు (2020 Indian Rajya Sabha elections) సర్వం సిద్ధమైంది. 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, గుజరాత్‌లో నాలుగు, జార్ఖండ్‌లో 2, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్‌లో 3, మణిపూర్, మేఘాలయలో ఒక్కో సీటుకు ఎన్నికలు జరగున్నాయి. మొత్తం 19 సీట్లకు ఈ రోజు ఎన్నికలు (Rajya Sabha Election 2020) జరగనున్నాయి.
Coronavirus In India: ఫ్యామిలీ సభ్యుల మధ్య వేగంగా కరోనా వ్యాప్తి, రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో 13,586 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 3 లక్షల 80 వేలకు చేరిన కరోనా కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus In India) రోజూ 10వేలకు పైనే నమోదవుతున్నాయి. భారత్‌లో గడచిన 24 గంటల్లో 13,586 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 336 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 3,80,532కు చేరింది. ప్రస్తుతం 1,63,248 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా ( India Coronavirus) నుంచి కోలుకొని 2,04,711 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య (Coronavirus deaths) 12,573కు పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా ఉధ్దృతి కొనసాగుతోంది. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది.
Chinese Firm’s Contract Cancelled: చైనాకు రైల్వే డీఎఫ్‌సీసీఐఎల్‌ భారీ షాక్, రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వెల్లడి, చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం
Hazarath Reddyసరిహద్దుల్లో భారత సైనికుల మరణానికి కారణమైన చైనాపై ఇండియా అన్నివైపుల నుంచి ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా రైల్వే శాఖకు (Indian Railways) చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(DFCCIL) చైనాకు గట్టి షాకిచ్చింది. చైనా సంస్థ యొక్క రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Range Rover Fifty Limited-Edition: 50 వసంతాల రేంజ్ రోవర్, ప్రత్యేకంగా ఫిప్టి లిమిటెడ్ ఎడిషన్ మార్కెట్లోకి, ధర 1 131,595 డాలర్లు కంటే ఎక్కువ ఉండే అవకాశం
Hazarath Reddyజాగ్వార్‌ లాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఎస్‌యూవీ రేంజ్‌రోవర్‌ మోడల్‌ విడుదలైన 50 సంవత్సరాలను (Range Rover Fifty Limited-Edition) పురస్కరించుకుని లిమిటెడ్‌ ఎడిషన్‌ రేంజ్‌రోవర్‌ను (ROVER LIMITED EDITION) మార్కెట్‌లోకి తెచ్చింది. 1970 జూన్‌ 17న మార్కెట్‌లోకి తొలిసారి ప్రవేశించింది. స్టాండర్డ్‌, లాంగ్‌ వీల్‌బేస్తో నాలుగు రంగుల్లో కొత్తగా విడుదల చేసిన రేంజిరోవర్‌ 1970 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని జేఎల్‌ఆర్‌ తెలిపింది. ప్రారంభం నుంచి ఇది ఎప్పటికప్పుడు కొత్త ప్రత్యేకతలు సంతరించుకుంటూనే ఉంది. ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ సదుపాయం గల తొలి ఎస్‌యూవీగా (SUV) గుర్తింపు పొందింది.
Atmanirbhar Bharat: చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న ఇండియా, 4జీ అప్‌గ్రేడ్‌‌లో చైనా పరికరాల వినియోగం బంద్, బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికం సంస్థలకు త్వరలో డాట్ ఆదేశాలు
Hazarath Reddyభారత్ - చైనా సరిహద్దులోని గాల్వార్ లోయ దగ్గర జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు (China) తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. కేవలం సైనిక చర్యల ద్వారా మాత్రమే కాకుండా వాణిజ్యపరంగానూ తగిన సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించారు. భద్రత కారణాల వల్ల చైనా పరికరాలను పక్కనబెట్టాలని టెలికం శాఖ (Department of Telecom) నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి రీ-టెండరింగ్‌ కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి.
No Fresh Lockdowns: ఇకపై లాక్‌డౌన్‌ ఉండదు, స్పష్టం చేసిన ప్రధాని మోదీ, అన్‌లాక్‌-2 ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చించాలని సీఎంలకు ప్రధాని సూచన
Hazarath Reddyకోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో సమిష్టి కృషి, నిబద్ధతతోనే విజయం వరిస్తుందని ప్రధాని నరేంద్ర∙మోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతూనే తగిన జాగ్రత్తలతో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా ఆయన బుధవారం 14 రాష్ట్రాల సీఎంలు (chief ministers), కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.
India-China Border Violence: ఘర్షణకు ప్రధాన కారణం అదేనా? ఈ నెల 19న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం, అన్ని పార్టీలకు పిలుపు, మీ త్యాగం దేశం ఎన్నడూ మరచిపోదన్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
Hazarath Reddyభార‌త‌, చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌తలు (India-China Border Face-off) నెల‌కొన్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో గాల్వ‌న్‌లో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భార‌త‌, చైనా స‌రిహ‌ద్దు విష‌యాన్ని చ‌ర్చించేందుకు ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష స‌మావేశాన్ని (all-party meeting) ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు అఖిల ప‌క్ష భేటీ ఉంటుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (PMO Office) పేర్కొన్న‌ది. ఈ స‌మావేశంలో వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అధ్య‌క్షులు పాల్గొంటార‌ని పీఎంవో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.
International Flights: వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి
Hazarath Reddyదేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు (coronavirus) పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల (International Flights) నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి (Hardeep Singh Puri) వెల్లడించారు. మంగళవారం మాట్లాడుతూ జులైలో అంతర్జాతీయ విమానాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసున్నామని, కచ్చితమైన తేదీని ప్రకటించలేమని తెలిపారు.
India-China Tensions: సరిహద్దుల్లో దాడులతో బరితెగించిన చైనా, భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మృతి, కొనసాగుతున్న రెండు దేశాల మేజర్ జనరళ్ల మధ్య చర్చలు
Hazarath Reddyభారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు (India-China Tensions) తగ్గుతున్నాయని సంకేతాలు అందుతున్న వేళ ఒక్కసారిగా అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. భారత, చైనా సరిహద్దుల్లోని (India China Border) లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్ణణలో భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు. మరణించిన వారిలో భారత పదాతిదళానికి చెందిన వారున్నారు. ఈ ఘర్షణతో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవనియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు (India China Border Tension) నెలకొన్నాయి.
Earthquake in Gujarat: వరుస భూకంపాలతో వణుకుతున్న గుజరాత్, 24 గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపాలు, భూకంపం తీవ్రత 4.6 మేగ్నిట్యూడ్‌గా నమోదు
Hazarath Reddyఉత్తరాది రాష్ట్రాలలో వరుస భూకంపాలు (Serial earthquakes) ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీ, గుర్గావ్, ఎన్సీఆర్, నొయిడా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు వచ్చిన సంగతి విదితమే. ఇక గుజరాత్ కూడా భూకంపంతో (Earthquake in Gujarat) హడలిపోతోంది. ఆ రాష్ట్రాన్ని రెండో సారి భూంకంపం వణికించింది. 24 గంటలు గడవక ముందే రెండోసారి భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Lockdown 6.0 Row: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన కేజ్రీవాల్, హోంమంత్రితో ముగిసిన అఖిలపక్ష సమావేశం, మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉండ‌దన్న గుజరాత్ సీఎం విజయ్ రూపానీ
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని (Lockdown Extension Row) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజాల్, ‌కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులతో ఆదివారం సమావేశమైన అమిత్‌ షా (Amit shah) కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు.
Southwest Monsoon: మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు, తెలంగాణ,కర్ణాటక,గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyదక్షిణ మహారాష్ట్రకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ముంబై మరియు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలను కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) (India Meteorological Department (IMD) ప్రకటించింది. శనివారం, శాంటాక్రూజ్ అబ్జర్వేటరీలో 19.7 మి.మీ వర్షం, కొలాబా 11.2 మి.మీ వర్షం నమోదైంది. కాగా ముంబైలో ఆదివారం వర్షపాతం కనిపించలేదు. IMD విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, జూన్ 10 న రుతుపవనాలు (monsoon) రాష్ట్రానికి వచ్చాయి మరియు జూన్ 15 నాటికి మహారాష్ట్ర మొత్తాన్ని కవర్ చేస్తుందని తెలిపింది.
Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు, పలు చోట్ల పొంగిపొర్లిన వాగులు, మరో 24 గంటల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ శాఖ
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. జూన్‌ 10న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపనాలు (Southwest Monsoon) ఒక్కరోజులోనే రాష్ట్రం మొత్తం విస్తరించాయి. రుతుపవనాలకుతోడు ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. అల్పపీడనం, రుతుపవనాల విస్తరణతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్‌ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది.
National Test Abhyas: ఎలాంటి కోచింగ్ అవసరం లేదు, నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ ఉంటే చాలు, జేఈఈ, నీట్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు, 10 లక్షల డౌన్‌లోడ్‌లు దాటిన ఎన్‌టిఎ యాప్
Hazarath Reddyనీట్ మరియు జెఇఇ మెయిన్ 2020 తయారీ కోసం ఎన్‌టిఎ ప్రారంభించిన నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ (National Test Abhyas APP) విజయవంతం అయింది. యాప్ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల ప్రిపరేషన్ కోసం (JEE Main, NEET preparation) కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ విడుదల చేసింది. ఈ యాప (National Test Abhyas) విడుదలయిన కొద్ది రోజుల్లోనే జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు.
Heavy Rains Alert: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రానున్న రెండు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ విభాగం
Hazarath Reddyతూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు (Rain In Andhra Pradesh) కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (Heavy Rains Alert) వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Employment to Migrants: వలస కార్మికులకు వెంటనే ఉద్యోగాలు కల్పించండి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyకరోనావైరస్ లాక్‌డౌన్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వ‌ల‌స కార్మికుల‌ను గుర్తించి వారి నైపుణ్యాల‌కు త‌గిన విధంగా ఉద్యోగాలు (Employment) క‌ల్పించేలా ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు దాదాపు కోటిమందికి పైగా వారి స్వ‌గ్రామంలోనే ప‌ని క‌ల్పించేందు (Employment to Migrants) ఓ జాబితా త‌యారుచేయాల‌ని అన్ని రాష్ర్ట ప్ర‌భుత్వాల‌కు సూచించింది.
Upcoming WhatsApp Features: వాట్సాప్‌లోకి 5 కొత్త ఫీచర్లు, త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి
Hazarath Reddyప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో మరో ఐదు వినూత్న ఫీచర్లను (Upcoming WhatsApp features) అందుబాటులోకి తీసుకురానుంది.ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను లాంఛ్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ పరిమితిని నలుగురి నుంచి ఎనిమిదికి పెంచి యూజర్లను ఆకట్టుకుంది. మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ (WhatsApp) కసరత్తు ముమ్మరం చేసింది.
Heavy Rainfall Alert: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చ‌రిక‌, మరింత చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు (Mansoon) రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కోస్తాంధ్ర‌లో (Coastal Andhra) భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని విశాఖ వాతావరణ కేంద్రం (Visakha IMD) వెల్ల‌డించింది. ఈ రోజు తూర్పు మధ్య‌ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవ‌కాశముంద‌ని తెలిపింది. ఇది ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ప‌య‌నిస్తూ మ‌రింత‌ బ‌ల‌ప‌డ‌నుంద‌ని.. దీని వ‌ల్ల‌ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని తెలిపింది. అల్ప పీడ‌న ప్ర‌భావంతో రేపు కోస్తాంధ్ర అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు ప‌డ‌తాయ‌న్నారు. మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.
TTD Darshan Tickets: జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్, ఈ నెల11 నుంచి భక్తులకు దర్శనం, ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపిన ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌
Hazarath Reddyలాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2 నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరిగి పునఃప్రారంభిస్తోంది. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.