Information

No Fresh Lockdowns: ఇకపై లాక్‌డౌన్‌ ఉండదు, స్పష్టం చేసిన ప్రధాని మోదీ, అన్‌లాక్‌-2 ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చించాలని సీఎంలకు ప్రధాని సూచన

Hazarath Reddy

కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో సమిష్టి కృషి, నిబద్ధతతోనే విజయం వరిస్తుందని ప్రధాని నరేంద్ర∙మోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతూనే తగిన జాగ్రత్తలతో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా ఆయన బుధవారం 14 రాష్ట్రాల సీఎంలు (chief ministers), కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

India-China Border Violence: ఘర్షణకు ప్రధాన కారణం అదేనా? ఈ నెల 19న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం, అన్ని పార్టీలకు పిలుపు, మీ త్యాగం దేశం ఎన్నడూ మరచిపోదన్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్

Hazarath Reddy

భార‌త‌, చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌తలు (India-China Border Face-off) నెల‌కొన్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో గాల్వ‌న్‌లో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భార‌త‌, చైనా స‌రిహ‌ద్దు విష‌యాన్ని చ‌ర్చించేందుకు ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష స‌మావేశాన్ని (all-party meeting) ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు అఖిల ప‌క్ష భేటీ ఉంటుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (PMO Office) పేర్కొన్న‌ది. ఈ స‌మావేశంలో వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అధ్య‌క్షులు పాల్గొంటార‌ని పీఎంవో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.

International Flights: వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు (coronavirus) పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల (International Flights) నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి (Hardeep Singh Puri) వెల్లడించారు. మంగళవారం మాట్లాడుతూ జులైలో అంతర్జాతీయ విమానాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసున్నామని, కచ్చితమైన తేదీని ప్రకటించలేమని తెలిపారు.

India-China Tensions: సరిహద్దుల్లో దాడులతో బరితెగించిన చైనా, భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మృతి, కొనసాగుతున్న రెండు దేశాల మేజర్ జనరళ్ల మధ్య చర్చలు

Hazarath Reddy

భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు (India-China Tensions) తగ్గుతున్నాయని సంకేతాలు అందుతున్న వేళ ఒక్కసారిగా అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. భారత, చైనా సరిహద్దుల్లోని (India China Border) లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్ణణలో భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు. మరణించిన వారిలో భారత పదాతిదళానికి చెందిన వారున్నారు. ఈ ఘర్షణతో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవనియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు (India China Border Tension) నెలకొన్నాయి.

Advertisement

Earthquake in Gujarat: వరుస భూకంపాలతో వణుకుతున్న గుజరాత్, 24 గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపాలు, భూకంపం తీవ్రత 4.6 మేగ్నిట్యూడ్‌గా నమోదు

Hazarath Reddy

ఉత్తరాది రాష్ట్రాలలో వరుస భూకంపాలు (Serial earthquakes) ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీ, గుర్గావ్, ఎన్సీఆర్, నొయిడా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు వచ్చిన సంగతి విదితమే. ఇక గుజరాత్ కూడా భూకంపంతో (Earthquake in Gujarat) హడలిపోతోంది. ఆ రాష్ట్రాన్ని రెండో సారి భూంకంపం వణికించింది. 24 గంటలు గడవక ముందే రెండోసారి భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Lockdown 6.0 Row: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన కేజ్రీవాల్, హోంమంత్రితో ముగిసిన అఖిలపక్ష సమావేశం, మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉండ‌దన్న గుజరాత్ సీఎం విజయ్ రూపానీ

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని (Lockdown Extension Row) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) అనిల్‌ బైజాల్, ‌కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులతో ఆదివారం సమావేశమైన అమిత్‌ షా (Amit shah) కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు.

Southwest Monsoon: మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు, తెలంగాణ,కర్ణాటక,గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

దక్షిణ మహారాష్ట్రకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ముంబై మరియు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలను కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) (India Meteorological Department (IMD) ప్రకటించింది. శనివారం, శాంటాక్రూజ్ అబ్జర్వేటరీలో 19.7 మి.మీ వర్షం, కొలాబా 11.2 మి.మీ వర్షం నమోదైంది. కాగా ముంబైలో ఆదివారం వర్షపాతం కనిపించలేదు. IMD విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, జూన్ 10 న రుతుపవనాలు (monsoon) రాష్ట్రానికి వచ్చాయి మరియు జూన్ 15 నాటికి మహారాష్ట్ర మొత్తాన్ని కవర్ చేస్తుందని తెలిపింది.

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు, పలు చోట్ల పొంగిపొర్లిన వాగులు, మరో 24 గంటల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ శాఖ

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. జూన్‌ 10న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపనాలు (Southwest Monsoon) ఒక్కరోజులోనే రాష్ట్రం మొత్తం విస్తరించాయి. రుతుపవనాలకుతోడు ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. అల్పపీడనం, రుతుపవనాల విస్తరణతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. గురువారం ఉదయం పెద్దపల్లి, నిజామా బాద్‌ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని, రెండు,మూడు రోజుల్లో ఇవి రాష్ట్రమంతా విస్తరిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది.

Advertisement

National Test Abhyas: ఎలాంటి కోచింగ్ అవసరం లేదు, నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ ఉంటే చాలు, జేఈఈ, నీట్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు, 10 లక్షల డౌన్‌లోడ్‌లు దాటిన ఎన్‌టిఎ యాప్

Hazarath Reddy

నీట్ మరియు జెఇఇ మెయిన్ 2020 తయారీ కోసం ఎన్‌టిఎ ప్రారంభించిన నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్ (National Test Abhyas APP) విజయవంతం అయింది. యాప్ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల ప్రిపరేషన్ కోసం (JEE Main, NEET preparation) కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ విడుదల చేసింది. ఈ యాప (National Test Abhyas) విడుదలయిన కొద్ది రోజుల్లోనే జెఇఇ మెయిన్ నీట్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నారు.

Heavy Rains Alert: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రానున్న రెండు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ విభాగం

Hazarath Reddy

తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు (Rain In Andhra Pradesh) కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (Heavy Rains Alert) వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

Employment to Migrants: వలస కార్మికులకు వెంటనే ఉద్యోగాలు కల్పించండి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

కరోనావైరస్ లాక్‌డౌన్ దెబ్బకు ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వ‌ల‌స కార్మికుల‌ను గుర్తించి వారి నైపుణ్యాల‌కు త‌గిన విధంగా ఉద్యోగాలు (Employment) క‌ల్పించేలా ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేర‌కు దాదాపు కోటిమందికి పైగా వారి స్వ‌గ్రామంలోనే ప‌ని క‌ల్పించేందు (Employment to Migrants) ఓ జాబితా త‌యారుచేయాల‌ని అన్ని రాష్ర్ట ప్ర‌భుత్వాల‌కు సూచించింది.

Upcoming WhatsApp Features: వాట్సాప్‌లోకి 5 కొత్త ఫీచర్లు, త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో మరో ఐదు వినూత్న ఫీచర్లను (Upcoming WhatsApp features) అందుబాటులోకి తీసుకురానుంది.ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను లాంఛ్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ పరిమితిని నలుగురి నుంచి ఎనిమిదికి పెంచి యూజర్లను ఆకట్టుకుంది. మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ (WhatsApp) కసరత్తు ముమ్మరం చేసింది.

Advertisement

Heavy Rainfall Alert: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చ‌రిక‌, మరింత చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు (Mansoon) రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కోస్తాంధ్ర‌లో (Coastal Andhra) భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని విశాఖ వాతావరణ కేంద్రం (Visakha IMD) వెల్ల‌డించింది. ఈ రోజు తూర్పు మధ్య‌ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవ‌కాశముంద‌ని తెలిపింది. ఇది ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ప‌య‌నిస్తూ మ‌రింత‌ బ‌ల‌ప‌డ‌నుంద‌ని.. దీని వ‌ల్ల‌ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని తెలిపింది. అల్ప పీడ‌న ప్ర‌భావంతో రేపు కోస్తాంధ్ర అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు ప‌డ‌తాయ‌న్నారు. మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

TTD Darshan Tickets: జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనం టికెట్లు బుకింగ్, ఈ నెల11 నుంచి భక్తులకు దర్శనం, ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపిన ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

Hazarath Reddy

లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2 నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తిరిగి పునఃప్రారంభిస్తోంది. ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు.

Airtel on Amazon Deal Report: అమెజాన్ పెట్టుబడులు ఒట్టి పుకారు, ఇలాంటి వార్తలు అనవసర పరిణామాలకు దారి తీస్తాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్‌

Hazarath Reddy

దేశీయ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో (Bharti Airtel) దాదాపు 2 బిలియన్‌ డాలర్ల (రూ.15 వేల కోట్ల) విలువైన వాటాను కొనుగోలుచేసేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) చర్చలు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలపై భారతి ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఎయిర్‌టెల్‌ ఈ రూమర్లను (Airtel on Amazon deal report) కొట్టి పారేసింది. ఇటువంటి ఊహాగానాలు అనవసరమైన పరిణామాలకు దారి తీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమైన అంశాలపై కంపెనీల స్పష్టమైన వివరణ లేకుండానే ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరమని వ్యాఖ్యానించింది.

VRO Posts in AP: వీఆర్వో పోస్టులను త్వరలో భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం, అర్హులైన వీఆర్‌ఏలను ఈ పోస్టులకు ఎంపిక చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 3,795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO) గ్రేడ్‌ –2 పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్‌వో (Grade-2) పోస్టులను భర్తీ చేసిన విషయం విదితమే. ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్‌టైమ్‌) ప్రాతిపదికన వీఆర్‌వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేశాయి.

Advertisement

Weather Forecast: ఒడిశాను మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు, జూన్‌ 10 నుంచి ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, వెల్లడించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

వచ్చే 24 గంటల్లో తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం అంచనా వేసింది. కాగా ఒడిశాలో (Odisha) మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) (India Meteorological Department (IMD) గురువారం ప్రకటించింది. ఇప్పటికే అంఫాన్‌ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలను చవిచూసిన ఒడిశాను ఇప్పుడు మరో తుఫాను ముంచెత్తే అవకాశం ఉన్నదని ఐఎండీ వెల్లడించింది.

International Flight Operations: జులై నుంచి విదేశాలకు విమాన సర్వీసులు, జూన్ 30 వరకూ నిషేధం అమల్లోకి, దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Hazarath Reddy

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు (International Flight Operations) తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ (Aviation ministry) వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.

Coronavirus: దేశ రక్షణ శాఖలో కరోనా కలకలం, భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లో పలువురు అధికారులు

Hazarath Reddy

రక్షణ శాఖలో కోవిడ్ 19 కలకలం రేగింది. భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు (Defence secretary Ajay Kumar) కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. అజయ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారని అధికారులు తెలిపారు. రక్షణ శాఖ కార్యదర్శికి కోవిడ్ నిర్ధారణ కావడంతో రైసినా హిల్స్ సౌత్ బ్లాక్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) ప్రధాన కార్యాలయంలో కొంత భాగాన్ని సీజ్ చేశారని తెలుస్తోంది. అందులో పని చేస్తున్న 35 మంది అధికారులను హోం క్వారంటైన్లో ఉచ్చారని సమాచారం.

‘Change India’s Name’: ఇండియా పేరు మార్చలేం, ఇండియా పేరును భార‌త్‌గా మార్చాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా (India) పేరును భార‌త్‌గా మార్చాల‌న్న వేసిన పిటిష‌న్‌ను (Change India’s Name Plea) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని కావాల‌నుకుంటే ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రానికి అంద‌జేయాల‌ని సూచించింది. వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా పేరును భార‌త్ (Bharat) లేదా హిందుస్తాన్‌గా (Hindustan) మార్చాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో గత వారం పిటిష‌న్ దాఖ‌లు చేశారు.‌ఇండియా' అనే పదం గ్రీకు నుంచి ఉద్భ‌వించింద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ పేరు తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్ త‌రాలు గ‌ర్విస్తాయ‌న్నారు.

Advertisement
Advertisement