Information

International Flight Operations: జులై నుంచి విదేశాలకు విమాన సర్వీసులు, జూన్ 30 వరకూ నిషేధం అమల్లోకి, దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Hazarath Reddy

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు (International Flight Operations) తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ (Aviation ministry) వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.

Coronavirus: దేశ రక్షణ శాఖలో కరోనా కలకలం, భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లో పలువురు అధికారులు

Hazarath Reddy

రక్షణ శాఖలో కోవిడ్ 19 కలకలం రేగింది. భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు (Defence secretary Ajay Kumar) కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. అజయ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారని అధికారులు తెలిపారు. రక్షణ శాఖ కార్యదర్శికి కోవిడ్ నిర్ధారణ కావడంతో రైసినా హిల్స్ సౌత్ బ్లాక్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) ప్రధాన కార్యాలయంలో కొంత భాగాన్ని సీజ్ చేశారని తెలుస్తోంది. అందులో పని చేస్తున్న 35 మంది అధికారులను హోం క్వారంటైన్లో ఉచ్చారని సమాచారం.

‘Change India’s Name’: ఇండియా పేరు మార్చలేం, ఇండియా పేరును భార‌త్‌గా మార్చాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా (India) పేరును భార‌త్‌గా మార్చాల‌న్న వేసిన పిటిష‌న్‌ను (Change India’s Name Plea) సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని కావాల‌నుకుంటే ఈ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రానికి అంద‌జేయాల‌ని సూచించింది. వ్యాపార‌వేత్త న‌మ‌హ ఇండియా పేరును భార‌త్ (Bharat) లేదా హిందుస్తాన్‌గా (Hindustan) మార్చాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో గత వారం పిటిష‌న్ దాఖ‌లు చేశారు.‌ఇండియా' అనే పదం గ్రీకు నుంచి ఉద్భ‌వించింద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ పేరు తొల‌గించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్ త‌రాలు గ‌ర్విస్తాయ‌న్నారు.

ZOOM Cloud Meetings: జూమ్ కొత్త వెర్షన్ వాడాలంటే డబ్బులు చెల్లించాలి, ఎఫ్‌‌బీఐ అధికారులతో పనిచేయనున్న జూమ్ సంస్థ, జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ వెల్లడి

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమతమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీడియో కాలింగ్ యాప్ లకు బాగా డిమాండ్ పెరిగింది. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్‌ యాప్‌ (ZOOM Cloud Meetings) లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్‌ (ZOOM) సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్‌ వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేశామని అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్‌ చేసుకోవాలని జూమ్‌ సీఈఓ ఎరిక్‌ యాన్‌ తెలిపారు.

Advertisement

Cyclone Nisarga: తీరాన్ని తాకిన నిసర్గ తుఫాను, తీరం దాటేందుకు మూడు గంటల సమయం, 120 కిలోమీటర్ల వేగంతో గాలులు, అలర్ట్ అయిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Hazarath Reddy

రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద ‘నిసర్గ’ తుపాను (Cyclone Nisarga) తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉండటంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు (Maharashtra, Gujarat) అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF)బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి.

Cyclone Nisarga: నిసర్గ ముప్పు, ముంబై వెళ్లే పలు విమానాలు రద్దు, దేశ ఆర్థిక రాజధానికి వెళ్లేవారు అప్రమత్తం కావాలని కోరిన విమానయాన సంస్థలు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ (Coronavirus) కల్లోలం పోకముందే మరో విపత్తు దూసుకొస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను నిసర్గ తుపాను అల్లకల్లోలం చేయనుంది. నిసర్గ తుపాను (Cyclone Nisarga) పెనువేగంతో ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ (IMD)హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు (IndiGo,Vistara, SpiceJet ) పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని సూచించాయి.

Cyclone Nisarga: పెను తుఫాన్ భయం, వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు, వందేండ్ల తర్వాత తొలిసారిగా ముంబైపై విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్

Hazarath Reddy

నిసర్గ తుఫాను (Cyclone Nisarga) బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. అలీబాగ్‌కు దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని హరిహరేశ్వర్-దామన్ మద్య అలీబాగ్‌కు సమీపంలో నిసర్గ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.

Delhi Covid 19: కరోనా యాప్‌ను ప్రారంభించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 10 మందికి కరోనా వైరస్

Hazarath Reddy

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం కరోనా యాప్ ను (Corona App) ప్రారంభించారు. కరోనా బారిన పడిన వారి చికిత్స, ఆసుపత్రిలోకావాల్సిన సౌకర్యాలపై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఏయే హా‍స్పిటల్‌లో ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో లాంటి వివరాలు లభిస్తాయని ఢిల్లీ సీఎం (CM Arvind Kejriwal) తెలిపారు.కోవిడ్‌-19 (Delhi Covid 19) రోగులకు ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లను ట్రాక్ చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొచ్చామని, ఇది ఢి‍ల్లీ ప్రజలందరికీ ఆసుపత్రి పడకలు, ఇతర అవసరాల లభ్యతమై సమాచారాన్ని అందిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు.

Advertisement

Condoms to Migrant Labourers: వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌లు, అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ ప్రభుత్వం

Hazarath Reddy

లాక్‌డౌన్ సమయంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు బీహార్ ప్రభుత్వం (Bihar government) కీలక నిర్ణయం తీసుకుంది. సొంత రాష్ట్రానికి తరిగొచ్చి 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న బీహార్ వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌ల (Condoms to Migrant Labourers) పంపిణీ చేస్తోంది. ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు వారికి కండోమ్‌లను అందిస్తోంది. వలస కార్మికులకు (Migrant Labourers) 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించేముందు అధికారులు వీరికి కండోమ్‌లను ఉచితంగా అందజేస్తున్నారు.

Lockdown 5.0: ఇకపై హెయిర్‌కట్‌ చేయించుకోవాలంటే ఆధార్ కార్డు,మొబైల్ నంబర్ తప్పనిసరి, చెన్నైలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు విధించిన తమిళనాడు సర్కారు

Hazarath Reddy

ఇకపై చెన్నైలో హెయిర్‌కట్‌‌ చేయించుకోవాలి అనుకునే వారు మాస్క్‌తో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ వెంట తెచ్చుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిపై వివరణ కూడా ఇచ్చింది. సెలూన్ల ద్వారా ఎవరికైనా వైరస్‌ వ్యాప్తి చెందితే ఆ షాపుకు వచ్చిన వారిని గుర్తించడం అధికారులకు సులభం అవుతుందని వివరించింది. ఆధార్‌ వివరాల ద్వారా వ్యక్తులను వెంటనే గుర్తించి.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వ తెలిపింది.

Death of George Floyd: జార్జ్ ఫ్లాయిడ్‌ది నరహత్యే, పోస్టుమార్టం నివేదికలో బహిర్గతం, నిరసనలపై మండిపడిన డొనాల్డ్ ట్రంప్, హత్యను ఖండించిన టెక్ దిగ్గజాలు

Hazarath Reddy

జార్జ్ ఫ్లాయిడ్‌ (46) మరణంపై అమెరికా (America) నిరసనలతో ఆందోళనకరంగా మారిన సమయంలో కీలకమైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని(Minneapolis) హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. యుఎస్ పోలీసులు అదుపులో ఉండగా అతడు గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే (Death of George Floyd) నిర్ధారణ అయింది.

Ramagundam OCP Blast: రామగుండం సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో భారీ ప్రమాదం, నలుగురు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు, విద్యుత్‌ షాక్‌తో సిద్ధిపేటలో మరొకరు మృతి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి దగ్గర గల రామగిరి మండలం ఓపెన్‌ కాస్ట్‌-1లో భారీ పేలుడు (Ramagundam OCP Blast) సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహాలక్ష్మి ఓబీ కంపెనీలో బ్లాస్టింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగింది. గోదావరిఖనిలోని సింగరేణి (Singareni Hospital) ఆసుపత్రికి అధికారులు మృతదేహాలను తరలించారు.

Advertisement

Rajya Sabha Polls: వైసీపీతో పోటీకి సై అంటున్న టీడీపీ, ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు 19న ఎన్నికలు, దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు అదే రోజు పోలింగ్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు (Rajya Sabha Polls) జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (EC) సోమవారం ప్రకటించింది. వీటిలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానాలు 18 ఉండగా.. మిగిలిన ఆరు స్థానాలు తాజాగా ఖాళీ అయ్యాయి. వీటన్నింటికి కలిపి ఎన్నికలు జరుగనున్నాయి. వాస్తవానికి మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. కాగా, 55 స్థానాలకు 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Monsoon 2020: మండే ఎండలకు బై..బై, కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు, దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపిన వాతావారణ శాఖ

Hazarath Reddy

మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు (Monsoon 2020) తాకాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ (India Meteorological Department) వెల్లడించింది. ఈరోజు కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలకు ఎటువంటి ఆటంకాలు లేవని, దీనివల్ల దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను జాతీయ వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహోపాత్ర మీడియాకు వెల్లడించారు.

Cyclone Nisarga: ముంబైకి మరో పెను ముప్పు, కరోనా వేళ విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

భారత ఆర్ధిక రాజధాని ముంబైపై (Mumbai) అల్పపీడనం తీవ్ర ప్రభావం (Cyclone Nisarga) చూపనుందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపాన్‌గా మారనుందని తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ మీదుగా అల్పపీడనం జూన్‌ 3న తీరం తాటుతుందని పేర్కొంది. కాగా, తుపాన్‌ మహారాష్ట్రను దాటే క్రమంలో ముంబై నగరంపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్రా పేర్కొన్నారు. సోమవారం ఉదయం అల్పపీడనం ఉధృతంగా మారినట్లు తెలిపారు.

LPG Cylinder Price Hike: సిలిండర్ ధరలు పెరిగాయి, పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో నిర్ణయం తీసుకున్నామన్న చమురు కంపెనీలు

Hazarath Reddy

దేశంలోని మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర సిలిండర్‌ ధరలు (LPG Cylinder Price Hike) పెరిగాయి. గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్న సిలిండర్‌ ధరలు ఈసారి పెరిగాయి. మెట్రో నగరాల్లో సబ్సిడీయేతర వంట గ్యాస్‌ ధర సిలిండర్‌కు రూ 37 చొప్పున పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధర (LPG Price in India) పెరగడంతో సిలిండర​ ధరలను స్వల్పంగా పెంచామని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) వెల్లడించింది.

Advertisement

Indian Railways: కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, దేశ వ్యాప్తంగా పట్టాలెక్కిన 200 రైళ్లు, తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు, విజయవాడ మీదుగా 14 రైళ్లు, పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే శాఖ

Hazarath Reddy

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ (Lockdown Relaxation) మార్గదర్శకాలు వెలువడిన నేపథ్యంలో నేటి నుంచి రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. ఈ రైళ్ల ద్వారా తొలిరోజున దాదాపు 1.45 లక్షల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 1 నుంచి 30 వ తేదీ వరకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌లో ప్రయాణించేందుకుగాను ఇప్పటికే 26 మంది టిక్కెట్లు బుక్‌ చేసుకొన్నారని వెల్లడించింది. ఇవన్నీ శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు, 30 ప్రత్యేక ఏసీ రైళ్లకు అదనం అని పేర్కొన్నది.

Telugu States Lockdown 5.0: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టనున్న బస్సులు, అంతరాష్ట్ర రాకపోకలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (TS CM KCR) ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో జూన్‌ 7వ తేదీవరకు లాక్‌డౌన్‌ (Lockdown 5.0) అమలులో ఉంటుందని తెలిపారు. రాత్రిపూట రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు.

Cyclone Nisarga: దేశానికి మరో సైక్లోన్‌ ముప్పు, తుఫాన్‌గా మారనున్న నిసర్గ, లక్షద్వీప్‌,కేరళ,కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

సైక్లోన్ అంఫాన్ విధ్వంసం (Cyclone Amphan) మరచిపోకముందే దేశానికి మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ మధ్య ఆదివారం అల్ప పీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా, మరుసటి రోజుకు తుఫాన్‌గాను మారవచ్చని పేర్కొంది. దీనికి ‘నిసర్గ’ (Cyclone Nisarga) అని పేరు పెట్టింది. ఇది ఉత్తర దిశగా కదిలి ఈ నెల 3 నాటికి గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరానికి (Maharashtra Costal) చేరవచ్చని అంచనా వేసింది.

Southwest Monsoon: ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

దేశంలో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) చురుగ్గా కదులుతున్నాయని, జూన్‌9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను (Telugu States) అవి పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాలకు ఈ రుతుపవనాలు విస్తరించాయి. రాగల 48 గంటల్లో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జూన్‌ 1వ తేదీకి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు.. జూన్‌ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement