Information
Ganga,Yamuna Rivers: లాక్‌డౌన్ దెబ్బ, గంగా,యమున నదుల్లోకి స్వచ్ఛమైన నీరు, ప్రజల అవసరాలకు సరిపోయేలా నీటి నాణ్యత, శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
Hazarath Reddyకరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా అందరూ ఇంటికే పరిమితవ్వడంతో ప్రకృతి మరియు వన్యప్రాణులు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మన నదులు (Rivers) కూడా పరి శుభ్రంగా మారుతున్నాయి. నివేదికల ప్రకారం, గంగా,యమునా నది (Ganga,Yamuna Rivers) నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మరియు తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Voluntary Pay Cut: కరోనాపై పోరుకు ఈసీ అండ, ఏడాదిపాటు తమ జీతాల నుంచి స్వ‌చ్ఛంధంగా 30 శాతం కోత, ముందుకొచ్చిన ముగ్గురు ఎన్నికల కమిషనర్లు
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (Coronavirus) మహమ్మారిపై పోరులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission of India) కూడా తన వంతు సహాయం అందించింది. ఇందులో భాగంగా ఏడాదిపాటు త‌మ మూల వేత‌నం నుంచి 30 శాతం చొప్పున‌ స్వ‌చ్ఛంధంగా కోత (voluntary pay cut) విధించుకుంటున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ప్ర‌క‌టించారు.
PM Modi To Adress Nation: లాక్‌డౌన్‌ పొడిగింపుపై వీడనున్న సస్పెన్స్, జాతినుద్దేశించి రేపు ప్రసగించనున్న ప్రధాని మోదీ, ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించిన కొన్ని రాష్ట్రాలు
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్ర మోదీ (India PM Narendra Modi) రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిపై విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) గడువు మంగళవారంతో ముగియనుండటంతో దాని కొనసాగింపుపై (Lockdown Suspense) ప్రధాని స్పష్టతనివ్వనున్నారు. కాగా దేశంలో కోవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.
Dr YSR Telemedicine: కరోనాపై పోరుకు డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌, 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు అందుతాయి
Hazarath Reddyఏపీలో కరోనా వైరస్‌ నియంత్రణ (Coronavirus in AP) చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ (Dr YSR Telemedicine) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan mohan Reddy) ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబరు 14410కు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా టెలిమెడిసిన్‌ (Telemedicine) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం వైయస్ జగన్‌ ఆదేశించారు.
COVID-19 : కరోనా నియంత్రణపై రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు, సముద్రంలో దొరికే నాచుతో కోవిడ్-19కి చెక్, రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడి
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ (coronavirus) మహమ్మారికి మందు రావడానికి ఆరు నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన సంగతి విదితమే.ఈ వైరస్ నియంత్రణకు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇది ప్రపంచ దేశాలను (Global Coronavirus) అల్లకల్లోలం చేస్తోంది. కోవిడ్-19 (COVID-19) దెబ్బకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్ (Lockdown) లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు.
COVID-19 in AP: కర్నూలును కలవరపెడుతున్న కరోనా, ఆ జిల్లాలో 84కి చేరిన కరోనా కేసులు, ఏపీలో 432కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది. నిన్నరాత్రి 09 గంటల నుంచి ఇవాళ ఉదయం 09 గంటల వరకూ కొత్తగా 12 కేసులు (positive coronavirus cases) నమోదైనట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Coronavirus in Dharavi: ముంబై మురికివాడలో కరోనా ఘోష, ధారావిలో 47కు చేరిన కోవిడ్-19 కేసులు, ఐదుకి చేరిన మృతుల సంఖ్య, మహారాష్ట్రలో 1985కి చేరిన కరోనా కేసులు
Hazarath Reddyఆసియాలోనే అతి పెద్ద మురికివాడ (Asia's largest slum) అయిన ధారావి (Dharavi) ఇప్పుడు దేశ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తోంది. అక్కడ రోజు రొజుకు కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నాలుగు కేసులు నమోదు కావడంతో ఇప్పుడు అక్కడ కోవిడ్ 19 (COVID-19 Cases) కేసుల సంఖ్య 47 కి పెరిగింది. ఘోరమైన కరోనావైరస్ (Coronavirus Pandemic) కారణంగా ఈ రోజు ఒక వ్యక్తి కూడా మరణించాడు. తద్వారా ఈ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య ఐదుకి చేరుకుంది.
AP Entrance Exams Postponed: ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా, కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన ఏపీ ఉన్నత విద్యామండలి
Hazarath Reddyఏపీలో కరోనావైరస్ (coronavirus in AP) విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా (AP Entrance Exams Postponed) వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
All Exams Postponed in TS: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌
Hazarath Reddyక‌రోనా (COVID-19) మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎంసెట్ స‌హా రాష్ట్రంలో మే నెల‌లో జ‌రగాల్సిన అన్ని ర‌కాల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా (CETs Exams Postponed) వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
COVID-19 in AP: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు, 5.3 కోట్ల మందికి 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyకరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు (Free Masks) పంపిణీ చేయనుంది. ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని సీఎం జగన్‌ (AP CM YS jagan) ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష (CM Jagan Review Metting) నిర్వహించారు.
COVID-19 in India: కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన, ఆర్థికవ్యవస్థను పరిపుష్టి చేసే దిశగా కేంద్రం అడుగులు, వెల్లడిస్తున్న అధికార వర్గాలు
Hazarath Reddyకరోనావైరస్ దేశ వ్యాప్తంగా (COVID-19 in India) తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీని కట్టడికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (India Lockdown) విధించింది. కాగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా (3 zones) విభజించాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికార వర్గాలు శనివారం తెలిపాయి.
Punjab Horror: లాక్‌డౌన్, కత్తులతో పోలీసులపై దాడి, పంజాబ్‌లో ఏఎస్ఐ చేయి నరికివేసిన నిహంగ్ వర్గీయులు, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyకరోనా లాక్‌డౌన్‌ను (Coronavirus Lockdown) పక్కాగా అమలు చేస్తున్న క్రమంలో పంజాబ్‌లో పోలీసులపై దాడి (Policemen attacked by 'Nihangs') జరిగింది. లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంత మంది దాష్టీకానికి తెగబడ్డారు. ఒక్కసారిగా కత్తులతో దాడి (Punjab horror) చేశారు. ఓ పోలీసు అధికారి చేయి నరికేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Telangana Lockdown: తెలంగాణలో విద్యార్థులకు పరీక్షలు ఉండవు, 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు, 10వ తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం
Hazarath Reddy1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ విధంగానే నిర్ణయం తీసుకున్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 10వ తరగతి పరీక్షల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Telangana Lockdown Extension: ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్, 503కి చేరిన కోవిడ్ 19 కేసులు
Hazarath Reddyతెలంగాణ (Telangana) సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana CM KCR) ప్రకటించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో రాకపోకలు ఉన్నాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ (Telangana Lockdown) కఠినంగా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని చెప్పారు.
Chiranjeevi: ఆ మహిళ మా అమ్మకాదు, సమాజసేవలో మెగాస్టార్ తల్లి కథనంపై వివరణ ఇచ్చిన చిరంజీవి, కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనంటూ పొగడ్తలు
Hazarath Reddyకరోనాపై పోరులో మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనాదేవి త‌న వంతు సాయంగా 700 మాస్క్‌లు తయారు చేసిందని మీడియాలో ప‌లు వార్తలు వ‌చ్చాయి. తన వృద్దాప్యాన్ని కూడా లెక్కచేయకుండా స్నేహితురాళ్లతో కలిసి మాస్క్‌లు కుట్టిందని, అవసరమైన వారికి వాటిని పంచిందన్న‌ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ క‌థ‌నాల‌పై మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.
AP Red Zone Areas: ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు, రెడ్‌ జోన్, హాట్‌ స్పాట్లు ఇకపై పోలీసుల వలయంలో.., ఆంక్షలు ఉల్లంఘిస్తే కేసుల నమోదు
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ (coronavirus in AP) విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ (CM Jagan) ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా (AP Red Zones) రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Global COVID-19 Deaths: ప్రపంచాన ఆగని కరోనా మృత్యుఘోష, లక్షమందికి పైగా మృతి, 17 లక్షల మందికి పైగా కోవిడ్ 19 వైరస్, 364,000 మందికి పైగా రికవరీ
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికాలో కరోనా (US Coronavirus) వైరస్ విజృంభిస్తోంది. ఇక్కడ కరోనా ఎంత తీవ్రంగా ఉందంటే గడిచిన 24గంటల్లో అమెరికాలో 2,100పైగా కరోనా మరణాలు (US Coronavirus Deaths) నమోదయ్యాయి. యూఎస్‌లోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కరోనా ట్రాకర్ ప్రకారం, అమెరికాలో (America) ఇప్పటి వరకు 5లక్షలమందికిపైగా కరోనా సోకింది
JioPOS Lite App: జియో యాప్ అదిరిపోయే ఆఫర్, రీఛార్జ్ చేస్తే 4.16శాతం కమిషన్, జియోపోస్ లైట్ పేరుతో కొత్త యాప్ ప్రారంభించిన రిలయన్స్ జియో
Hazarath Reddyజియో యూజర్లకు రిలయన్స్ జియో (Reliance jio) మరో సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో వినియోగదారులు (jio Users) ఇతరులకు రీచార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందేలా జియోపోస్ లైట్ పేరుతో (JioPOS Lite app) ఒక యాప్ ను కొత్తగా ప్రారంభించింది. ఈ యాప్ (APP) ద్వారా జియో వినియోగదారులు తమకు తెలిసిన ఇతర జియో కస్టమర్లకు ప్రీపెయిడ్ రీచార్జీలను చేయవచ్చు. ఇలా చేసిన ప్రతి రీఛార్జ్ ద్వారా 4.16శాతం కమీషన్ సంపాదించవచ్చు.
PM Modi Video Conference: మాస్క్‌తో ప్రధాని మోదీ, లాక్‌డౌన్ కొనసాగించాలా..వద్దా, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, ఈ రోజు తేలిపోనున్న నిర్ణయం
Hazarath Reddyఅన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Video Conference) వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. కరోనా కేసులు ( Coronavirus) పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో తన కార్యాలయం నుంచి చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ కొనసాగించాలనే అంశంపై వారి సూచనల్ని స్వీకరిస్తున్నారు. ఇక మే 1 వరకు లాక్‌డౌన్‌ను (Lockdown) పొడిగిస్తూ ఒడిశా, పంజాబ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (Telangana CM KCR) కూడా లాక్‌డౌన్‌ను మరో 2 వారాలపాటు పొడిగించాలని ఇప్పటికే ప్రధానిని కోరారు.
Indian Army: పాక్ పిరికిపంద చర్య, ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్, దాడులకు సంబంధించిన వీడియోని విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ
Hazarath Reddyనియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణను ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా భారత దళాలు (Indian Army) సరిహద్దు మీదుగా "టెర్రర్ లాంచ్ ప్యాడ్" (Terror Launch Pads) లపై ఖచ్చితమైన దాడులను ప్రారంభించాయి. కుప్వారా జిల్లాలోని (Kupwara) కేరన్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం దుర్భుద్ధితో కాల్పులు జరిపిన తరువాత తరువాత ఈ ప్రతీకార దాడి జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను నాశనం చేయడం ద్వారా భారత సైన్యం పాక్ పై ప్రతీకారం తీర్చుకుంది.