Information

Whatsapp Disappear: గూగుల్ ప్లే స్టోర్ నుంచి సడన్‌గా వాట్సప్ మాయం, కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకునే వారికి కనపడని యాప్, అందుబాటులో వాట్సప్ ఫర్‌ బిజినెస్‌

Hazarath Reddy

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న మెసేజింగ్ దిగ్గజం యూజర్లకు ఒక్కసారిగా షాకిచ్చింది. కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్లకి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ ఎంత వెతికినా కనపడలేదు.

Save Water: ఈ మూగ జీవాలను చూసి చాలా నేర్చుకోవాలి, నీటి విలువ వీటికి తెలిసినట్లు మనుషులకు కూడా తెలీదేమో..! అందర్నీ తట్టిలేపుతున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. నీటి ముప్పు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ నీటిని పొదుపు చేయకపోతే ముందు ముందు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ నీటిని పొదుపుచేస్తున్నారా అంటే చాలా చోట్ల పొదుపు కాదు కదా..లీకయిన నీటిని కూడా అరికట్టలేకపోతున్నారు.

PM Modi Swachh Bharat: సాగరతీరంలో మోడీ స్వచ్ఛభారత్, మామల్లపురంలో బీచ్‌లో చెత్తను తొలగించిన భారత ప్రధాని, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కదిలిరావాలని పిలుపు

Hazarath Reddy

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమానికి 2014లో గాంధీ జయంతి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

Jio Good News: జియో యూజర్లకు ఊరట, మీ ప్లాన్ ముగిసే దాకా ఎటువంటి ఛార్జీలు ఉండవు, ఆ తర్వాత ఖచ్చింతగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే, ట్విట్టర్ ద్వారా తెలిపిన జియో

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇంటర్‌కనెక్ట్ యూజ్ చార్జీల పేరుతో యూజర్ల దగ్గర నుంచి బాదుడు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌లకు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ వర్షాల ముప్పు, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, హెచ్చరించిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ ని వర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు. మొన్నటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన ఏపీకి మళ్లీ ఇప్పుడు వర్షపు గండం ముంచుకొస్తోంది. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Happy Birthday Amitabh: నువ్వేమి హీరో అవుతావు పో అన్న చోటే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, చావును జయించి వచ్చిన నటశిఖరం, అమితాబ్ జీవితంలో చీకటి కోణాలు, బెస్ట్ అనిపించే సినిమాలు మీకోసం

Hazarath Reddy

వయసుతో పనిలేకుండా లెజెండ్స్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ హీరోలుగానే ఉంటారు. నేటి సినిమా హీరోల్లో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన పర్సనాలిటీస్ లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ని ఒకరుగా చెప్పుకోవచ్చు.

Jio Charge For Calls: ఇకపై జియోలో ఉచిత కాల్స్ ఉండవు, ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్, కొత్త టాపప్ వోచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

ఇతర నెట్ వర్క్స్ కారణంగా ట్రాయ్ (TRAI) నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో నెట్ వర్క్ ఒక ప్రకటనలో తెలిపింది. IUC ఛార్జీలకు బదులుగా వసూలు చేసిన మొత్తానికి డేటాను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. గత మూడేళ్లలో IUC ఛార్జీల కింద ఎయిర్ టెల్, వోడాఫోన్ మరియు ఐడియా లాంటి...

EMI Offers On Debit Card: మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?, లిమిట్ వివరాలు తెలుసుకోవడం ఎలా?, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

బ్యాకింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) (state bank of india)తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడే వినియోగదారుల ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.

Advertisement

HYD Heavy Rains: అనుకోకుండా నగరాన్ని ముంచెత్తిన వర్షాలు, పట్టపగలే చీకటి కమ్ముకున్న వైనం, దసరా పండుగ వేళ ప్రజలకు తప్పని ఇబ్బందులు, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన జీహెచ్ఎంసీ, మరో రెండు రోజులు భారీ వర్షాలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అనుకోకుంగానే కుండపోత వాన కురిసింది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి.

Air Force Day 2019: అభినందన్ పైనే అందరి కళ్లు, కన్నులపండువగా భారత వాయుసేన 87వ వార్షికోత్సవం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, హోమంత్రి రాజనాథ్ సింగ్, వైమానిక విన్యాసాలతో దుమ్మురేపిన భారత వైమానిక దళం

Hazarath Reddy

భారత వాయుసేన 87వ వార్షికోత్సవం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో ఎంతో ఉత్సాహంగా, కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సైనిక విన్యాసాలు అందర్నీ అకట్టుకున్నాయి.

HYD CP Anjani Kumar: కేసు నమోదు చేయని పోలీసులపై హైదరాబాద్ కమిషనర్ ఆగ్రహం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెన్సన్ వేటు, బీకేర్‌పుల్ అంటున్న సీపీ అంజనీ కుమార్

Hazarath Reddy

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ డ్యూటీలో స్ట్రిక్ అని అందరికీ తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడరు.

Devaragattu Bunny Festival: కర్రల సమరానికి సర్వం సిద్ధం, రక్తపాతం జరగకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం, గాయపడిన వారికి వెంటనే చికిత్స, నిఘా నేత్రంలో బన్ని ఉత్సవాలు

Hazarath Reddy

కర్నూలు జిల్లా దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి చెంత జరుగుతున్న బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం రక్తం కారేలా కర్రలతో కొట్టుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.

Advertisement

Valmiki Jayanti: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఇకపై ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి, ఇంతకీ మహర్షి వాల్మీకీ ఎవరు?, గొప్పతనం ఏంటీ?, ఆపేరు ఎలా వచ్చింది?, పూర్తి విశ్లేషణాత్మక కథనం మీకోసం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి వేడుకలు జరపాలన్నారు.

Ayodhya Ram Mandir: గుడ్ న్యూస్..నవంబర్ 18న రామ మందిర్‌ నిర్మాణం, రామజన్మభూమిపై సుప్రీంకోర్టులో 17న విచారణ పూర్తి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే, యూపీ సీఎం వ్యాఖ్యలకు బలం

Hazarath Reddy

అయోధ్యలోని రామజన్మభూమి మీద దశాబ్దాలుగా వివాదం నడుస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ వివాదానికి సుప్రీంకోర్టు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌చంద్‌ పరాఖ్‌ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Jio Stunning Plan: జియో సరికొత్త వ్యూహం, రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది, దిగ్గజాలకు షాకిస్తూ 2జీ మార్కెట్‌పై కన్ను, ప్రత్యేక ఆఫర్లతో ముందుకు, జియోఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో..

Hazarath Reddy

దేశీయ టెలికాం మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో సరికొత్తగా అడుగులు వేస్తోంది. టెలికం రంగం మొత్తాన్ని జియోకు ముందు, జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం ఇప్పుడు మొబైల్ మార్కెట్‌ని శాసించేందుకు ఎత్తులు వేస్తోంది.

Nobel Prize 2019: వైద్యరంగంలో ఈ ఏడాది ముగ్గురికి నోబుల్ ప్రైజ్, ముగ్గురిని కలిపి సంయుక్త విజేతలుగా ప్రకటన, ఆ ముగ్గురు ఎవరు మరియు దేనిపైన పరిశోధనలు జరిపారో తెలుసుకోండి

Vikas Manda

వీరు చేసిన పరిశోధనలు కేన్సర్, అనీమియా లాంటి వ్యాధులపై మెరుగైన చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నోబుల్ అవార్డ్స్ కమిటీ అభిప్రాయపడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కణసంబంధిత జీవక్రియ మరియు శారీరక పనితీరు....

Advertisement

Samsung Galaxy Fold 2: వావ్...శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 కూడా వచ్చేస్తోంది, పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న శాంసంగ్, అమ్మకాల్లో దుమ్మురేపుతున్న గెలాక్సీ ఫోల్డ్, 30 నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్

Hazarath Reddy

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్ ద్వారా హైఎండ్ మార్కెట్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.

RBI Decision: పెద్ద నోట్లపై షాకింగ్ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంకు, కనుమరుగు కానున్న రూ.2 వేలు, రూ.500 నోట్లు..!, ప్రణాళికను అమలు చేస్తున్న ఎస్‌బిఐ, ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా పెంపు

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చారు. అయితే కొన్ని నెలల నుంచి ఆ నోటు కనిపించడం లేదు.

Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్, విశాఖ తుఫాను వాతావరణ కేంద్రాలు

Hazarath Reddy

రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ,విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేశాయి.

Terrorists Active In J&K: దేశంలోకి ఎంటరయిన 300 మంది ఉగ్రవాదులు, వారిని సరిహద్దు దాటించిన పాకిస్తాన్, ఎన్‌కౌంటర్లలో కొందరు ఉగ్రవాదులు హతం, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన జమ్మూ కాశ్మీర్ డీజీపీ

Hazarath Reddy

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ , పాకిస్తాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని దానిని టచ్ చేయవద్దని ఇండియా దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ప్రపంచదేశాల ముందు తన గోడును వెళ్లబోసుకుంటోంది.

Advertisement
Advertisement