సమాచారం

Telangana TET Exam Schedule: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్, జనవరి 2 నుండి 20 వరకు టెట్ పరీక్షలు...వివరాలివే

Arun Charagonda

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ జరగనుంది.

Mobile Subscriptions in India: దేశంలో 115.12 కోట్లకు చేరుకున్న మొబైల్ సబ్‌స్కైబర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని

Hazarath Reddy

దేశంలోని 6,44,131 గ్రామాలలో, 6,23,622 గ్రామాలకు ఇప్పుడు మొబైల్ కవరేజీ ఉందని సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

Elon Musk: 500 బిలియన్ డాలర్లకు చేరిన ఎలాన్ మస్క్ ఆదాయం, ట్రంప్ విజయం తర్వాత రోజురోజుకు పెరుగుతున్న మస్క్ సంపాదన...ఏకంగా 107 శాతం పెరిగిన వైనం

Arun Charagonda

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత మస్క్ సంపాదన రోజురోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజుల క్రితం 439.2 బిలియన్ డాలర్లకు పెరిగిన మస్క్ సంపాదన తాజాగా 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క వారంలోనే 100 బిలియన్ డాలర్ల సంపద పెరుగగా మొత్తంగా ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద 107శాతానికి పైగా పెరిగింది.

Advertisement

TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి

Hazarath Reddy

శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

TTD News: తిరుమలలో ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

Tulsi Gowda Passes Away: పద్మ శ్రీ తులసి గౌడ కన్నుమూత, లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీగా గుర్తింపు, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన తులసిగౌడ

Arun Charagonda

లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటింది.

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి.

Advertisement

Health Tips: గోరువెచ్చటి పాలలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి..

sajaya

ఆయుర్వేదం ప్రకారం పాలు తేనెల కలయిక చాలా కాలంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది మన శరీరానికి అనేక పోషకాలను అందించడమే కాకుండా మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఔషధంలా పనిచేస్తుంది.

Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి

Rudra

దేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

Rudra

నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనపడటం లేదు. ఫెంగల్ తుఫాను తీసుకొచ్చిన నష్టం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త ఏపీని కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లుగా ఐఎండీ తెలిపింది.

Advertisement

RBI Receives Bomb Threat: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఈమెయిల్‌కు బెదిరింపు లేఖ..బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు

Arun Charagonda

ముంబై RBI కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు లేఖ కలకలం రేపింది. రష్యన్ బాషలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈమెయిల్‌ కు బెదిరింపు లేఖ రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.

Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన

Rudra

విజయవాడలో నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Rudra

తెలంగాణను చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఒకే దేశం-ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisement

Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .

Sanjay Malhotra: రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా, మూడేండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్న సంజయ్..వీడియో

Arun Charagonda

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన గవర్నర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

Hottest Year 2024: అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్.. నవంబర్‌ లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ వెల్లడి

Rudra

2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచింది. సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ తెలిపింది.

AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

Rudra

ఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

Advertisement
Advertisement