News

Andhra Pradesh: ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్ళమని చెప్పినందుకు బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగిన మహిళ, పోలీస్ స్టేషన్‌లో నా బొమ్మ చూపించు అంటూ ఫైర్

Team Latestly

జగ్గయ్యపేట నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. బస్ ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్లమని డ్రైవర్ సూచించిన తరువాత డ్రైవర్, మరో ప్రయాణికునితో తీవ్రంగా గొడవకు దిగింది. ఈ సంఘటన బస్‌లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల ముందు చోటుచేసుకుంది.

Bengaluru: దారుణం, కాలేజీలోనే ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై క్లాస్‌మేట్‌ అత్యాచారం , గర్భం రాకుండా పిల్ కావాలా అంటూ ఫోన్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Team Latestly

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై తన క్లాస్‌మేట్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన అక్టోబర్ 10న లంచ్‌ బ్రేక్ సమయంలో జరిగింది. 21 ఏళ్ల జీవన్ గౌడ అనే వ్యక్తి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు.

Dhanteras 2025: ధంతేరస్ నాడు బంగారమే కాదు ఈ వస్తువుల కూడా కొంటే అదృష్టం మీ తలుపు తడుతుంది, ధనలక్ష్మిని ఆరాధించే పవిత్రమైన రోజు గురించి తెలుసుకోండి

Team Latestly

ధంతేరస్, దీపావళి పండుగకు ముందే వచ్చే పండుగ. హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత కలిగినది. దీన్ని త్రయోదశి నాడు జరుపుకుంటారు, అందుకే ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది (2025) ధంతేరస్ అక్టోబర్ 18న జరిగింది. దీపావళి వేడుకలు దీనితో ప్రారంభమై ఐదు రోజులు కొనసాగుతాయి.

Diwali Wishes in Telugu: దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్ ఇవిగో.. దీపావళి అక్టోబర్ 20 లేదా 21నా? ఏ తేదీ కరెక్ట్.. పండితులు ఏమి చెబుతున్నారు?

Team Latestly

భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటి దీపావళి. పెద్దలు కూడా పిల్లలులాగా ఆనందించే ఈ పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 20న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి, హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగగా.. లక్ష్మీదేవి పూజతో పాటుగా సంపద, శ్రేయస్సు, సుఖశాంతి కోసం జరుపుకుంటారు.

Advertisement

Lakshmi Puja Wishes in Telugu: దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేసే సమయం ఇదే..ఈ టైంలో పూజ చేస్తేనే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్న పండితులు, బెస్ట్ విషెస్, కోట్స్ మీకోసం..

Team Latestly

దీపావళి అనేది హిందూ ధర్మంలో వెలుగుల పండుగగా ప్రసిద్ధి చెందినది. దీన్ని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ప్రారంభమై, కార్తీక మాసం శుక్లపక్షం విదియ తేది వరకు ఐదు రోజులుగా జరుపుకుంటారు.

CWG 2030 in India: 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్, అహ్మదాబాద్ వేదికగా క్రీడలు ప్రారంభం, భారతదేశానికి దక్కబోతున్న మరో అంతర్జాతీయ గౌరవం

Team Latestly

భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం దక్కబోతోంది.2030 కామన్వెల్త్ క్రీడలను భారత్ నిర్వహించబోతుంది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఈరోజు (అక్టోబర్ 16) ప్రకటించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఈ మహత్తర క్రీడా సమారంభానికి వేదిక కానుంది.

Bengaluru: వీడియో ఇదిగో, నాకే ఎదురు చెబుతావా అంటూ.. ప్రయాణికుడిని పదేపదే చెంప దెబ్బలు కొట్టిన ట్రాఫిక్ పోలీసు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Team Latestly

భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్ దగ్గర తప్పుడు మార్గంలో వాహనం నడిపినందుకు బైకర్‌ను ఆపేసిన ఒక ట్రాఫిక్ పోలీసు అతడిని పదేపదే చెంపదెబ్బ కొట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఆ ఫుటేజ్‌లో ఆ రైడర్ ట్రాఫిక్ పోలీసుతో వాదులాడుతుండగా.. ఇతర అధికారులు పరిస్థితిని శాంతింపజేయడానికి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది

PM Modi Srisailam Visit: వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు.

Advertisement

SC Verdict on BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టులో విచారణ సాగుతున్నందున పిటిషన్‌ను స్వీకరించబోమని స్పష్టం

Team Latestly

తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Dhanteras Wishes in Telugu: ధన త్రయోదశి శుభాకాంక్షలు, ధంతేరస్ విషెస్ తెలుగులో చెప్పాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఇమేజెస్ రెడీగా ఉన్నాయి మరి..బెస్ట్ కోట్స్ ఇవిగో..

Team Latestly

హిందువులు అత్యంత ముఖ్యమైన పండుగ దంతేరస్. ఈ ఏడాది 2025లో ధన త్రయోదశి (Dhantrayodashi) అక్టోబర్ 18 శనివారం జరగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభమవుతుంది.

Diwali 2025: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, బాణాసంచా అమ్మ‌కాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్, అక్టోబ‌ర్ 18 నుంచి 21వ తేదీ వ‌ర‌కు గ్రీన్ క్రాక‌ర్స్ అమ్మ‌కాల‌కు అనుమ‌తి

Team Latestly

దీపావళి రాకముందే దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండ‌లి తెలిపింది. బుధవారం ఉదయం రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా ఎన్‌సీఆర్‌లో తొలి దశ ఆంక్షలు అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ అధికారులను ఆదేశించింది.

Tamil Nadu: హిందీపై ఉక్కుపాదం మోపుతున్న స్టాలిన్ సర్కారు, తమిళనాడులో హిందీ పాటలు, సినిమాలపై బ్యాన్‌, కొత్త బిల్లును తీసుకువస్తున్నట్లుగా వార్తలు

Team Latestly

త్రిభాషా సూత్రం విషయంలో కేంద్రం, తమిళనాడు మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ రాష్ట్రంలో హిందీ భాషను వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో హిందీ భాషను నిషేధించే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని చెప్పినందుకు దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు

Team Latestly

కూకట్‌పల్లిలోని కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 5లోని ఒక నివాస ప్రాంతంలో తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని కోరిన దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి చేశారు. దాడికి ముందు దంపతులు హాస్టల్ విద్యార్థులను మా ఇంటి ముందు బైక్ పార్క్ చేయొద్దని అడిగారు. అయితే వారిలో కొంతమంది స్పందించకపోవడంతో తలెత్తిన విరోధం దాడి రూపానికి చేరింది

Dhanteras 2025: ధనత్రయోదశి ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలి? శుభ ముహూర్తం, పూజా విధానం, ఆ రోజు కచ్చితంగా బంగారం, వెండి కొనాలా.. పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

ఈ ఏడాది 2025లో ధన త్రయోదశి (Dhantrayodashi) అక్టోబర్ 18 శనివారం జరగనుంది. ఇది ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచించే అత్యంత శుభప్రదమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా దీపావళి 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. లక్ష్మీపూజ, ధన సంపద, ఆర్థిక శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తుంది.

PM Modi Andhra Pradesh Tour: అక్టోబర్ 16న ప్రధాని మోదీ ఏపీ పర్యటన, రూ. 13 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని, శ్రీశైలం పర్యటన పూర్తి వివరాలు ఇవే..

Team Latestly

ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రధాని శ్రీశైలం పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా మంగళవారం పరిశీలించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శ్రీశైలం, కర్నూలులో పర్యటించనున్నారు

India’s First AI Hub in Visakhapatnam: విశాఖపట్నంలో Google-Airtel భాగస్వామ్యంతో భారతదేశపు తొలి AI హబ్, భారతదేశ డిజిటల్ భవిష్యత్తు ఇక పరుగే పరుగు

Team Latestly

Advertisement

Tenali Horror: తెనాలిలో పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, స్కూటీపై మాస్క్‌ వేసుకొని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు, షాకింగ్ వీడియో ఇదిగో..

Team Latestly

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు, తెనాలి చెంచుపేటలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Rajasthan Bus Fire: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం, నేషనల్ హైవేపై వెళ్తుండగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, 15 మంది సజీవ దహనం అయినట్లుగా వార్తలు

Team Latestly

రాజస్థాన్‌ (Rajasthan)లోని జైసల్మేర్‌ (Jaisalmer)లో మంగళవారం నాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో కదుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేశారు.

Google AI Hub in Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ సెంటర్, ఐదేళ్లలో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ కీలక ప్రకటన, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం ఏపీలో..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 15 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడిగా ఖరారు చేసింది.

Nagula Chavithi 2025: నాగుల చవితి ఎప్పుడు? స్త్రీలు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు? పూజా సమయం, ఉపవాసం, నైవేద్యం, మంత్రాలు, పూర్తి సమాచారం ఇదిగో..

Team Latestly

నాగుల చవితి (Nagula Chavithi) హిందూ సంప్రదాయంలో పాములను పూజించే పవిత్రమైన పండుగ. చంద్ర మాసంలో చతుర్థి (నాలుగవ రోజు) రోజున జరుపుకునే ఈ పండుగను నాగ పూజా దినంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తులు నాగ దేవతలను ఆరాధించి, కుటుంబ శ్రేయస్సు, సంతానాభివృద్ధి మరియు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.

Advertisement
Advertisement