వార్తలు

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌, తెలంగాణకు మరో మూడు రోజుల పాటు వర్ష సూచన

Hazarath Reddy

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతారాతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మోస్తరు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది.వర్షం పడడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.

Chhatrapati Shivaji Maharaj Statue: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం, మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

మహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం.

Anna Canteens: వీడియో ఇదిగో, మురికి నీటిలో కడుగుతున్న అన్న క్యాంటీన్ ప్లేట్లు, తణుకులో వెలుగులోకి వచ్చిన ఘటన

Hazarath Reddy

చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన అన్నా క్యాంటిన్లలో నాణ్యతాలోపం కనపడుతోంది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. తాజాగా తణుకులో మురికి నీటిలో అన్న క్యాంటీన్ ప్లేట్లు కడుగుతున్న వీడియో బయటకు వచ్చింది

Andhra Pradesh: పొలం నుంచి వస్తుండగా రైతును తొక్కి చంపిన ఏనుగు, మన్యం జిల్లాలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..

Hazarath Reddy

మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు.

Advertisement

Telangana: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, త్వరలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన, నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి

Hazarath Reddy

యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై... మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను రేవంత్ రెడ్డి నేడు పంపిణీ చేశారు.

ISRO Chief on Aliens: ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...

Vikas M

యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇటీవలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ గ్రహాంతరవాసుల ఉనికి, UFO వీక్షణల స్వభావంపై ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. టీఆర్‌ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ చర్చలో గ్రహాంతర జీవితం, బ్లాక్ హోల్స్ సహా వివిధ అంశాలను కవర్ చేశారు.

Health Tips: మీ పిల్లలకు టాల్కం పౌడర్ అతిగా వాడుతున్నారా..అయితే దానివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

sajaya

చంటి పిల్లలకు చాలామంది టాల్కం పౌడర్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము. టాల్కం పౌడర్ అధికంగా వాడడం ద్వారా దద్దుర్లు, దురద ఎక్కువగా వచ్చి చిన్న చిన్న కురుపులు కూడా అవుతూ ఉంటాయి.

Telegram CEO Pavel Durov’s Arrest: టెలిగ్రాంలో పిల్లల సెక్స్ వీడియోలు, ప్రాన్స్‌లో సీఈఓ పావెల్ దురోవ్‌ అరెస్ట్, అక్కడ నిషేధం విధిస్తారా..

Vikas M

టెలిగ్రామ్‌ను ప్రాన్స్‌ నిషేధిస్తుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సం‍స్థ సీఈఓ పావెల్ దురోవ్‌(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్‌ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.

Advertisement

Astrology: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఆకస్మిక ధన లాభం.ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువ

sajaya

జ్యోతిష శాస్త్రం, న్యూమరాలజీ రెండు కూడా ఒక మనిషి అదృష్టాన్ని తెలియజేస్తాయి. అయితే రాడిక్స్ సంఖ్య 1 ఉన్నవారికి అనేక రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి. ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

IBM Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఐబిఎం, ఏ దేశంలో ఉద్యోగులు ప్రభావితమవుతారంటే..

Vikas M

బీజింగ్, ఆగస్టు 26: చైనాలో ఐటి హార్డ్‌వేర్‌కు డిమాండ్ మందగించడంతో పాటు చైనాలో వృద్ధి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐబిఎం చైనాలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని, దేశంలో దాదాపు 1,000 మందిని తొలగించాలని యోచిస్తోంది.

Astrology: సెప్టెంబర్ 30 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కుజ గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా ప్రతి రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు సెప్టెంబర్ 6 నుండి 30వ తేదీ వరకు ఆగ్రా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

Astrology: ఆగస్టు 29 న బుధ గ్రహం,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం..మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 29న బుధుడు ,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధన లాభాన్ని కలిగిస్తుంది. ఈ గొప్ప కలయిక వల్ల అన్ని రాశుల్లో ప్రభావితం చేస్తుంది.

Advertisement

Which Date is Telugu day? తెలుగు భాషా దినోత్సవం తేదీ ఎప్పుడు, తెలుగు దినోత్సవంను ఎందుకు జరుపుకుంటారు, గిడుగు వెంకట రామమూర్తి గురించి తెలుసుకోండి

Vikas M

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని (birthday of Telugu poet Gidugu Venkata Ramamurthy) పురస్కరించుకుని ఈ తేదీని ఎంచుకున్నారు

Health Tips: కొలెస్ట్రాల్ ఉన్నవారికి బ్రౌన్ రైస్ మంచిదా..వైట్ రైస్ మంచిదా.

sajaya

ప్రస్తుత సమయాల్లో మన జీవన శైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్ సమస్య అందరిలో కూడా కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల మనకు గుండె సంబంధం సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది.

Dutch Watchdog Fines Uber: ఉబ‌ర్‌కు భారీ షాకిచ్చిన నెద‌ర్లాండ్స్ డేటా ప్రొటెక్ష‌న్ విభాగం, ప‌ర్స‌న‌ల్ వివ‌రాల‌ను అమెరికాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన కేసులో 32.4 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా

Vikas M

ఉబ‌ర్(Uber ) సంస్థ‌కు నెద‌ర్లాండ్స్ డేటా ప్రొటెక్ష‌న్ విభాగం (Dutch watchdog) భారీ జ‌రిమానా విధించింది . ఉబ‌ర్‌ రెయిడ్ స‌ర్వీస్ సంస్థ‌కు 32.4 కోట్ల డాల‌ర్ల జ‌రిమానా వేశారు. యురోపియ‌న్ డ్రైవ‌ర్ల ప‌ర్స‌న‌ల్ వివ‌రాల‌ను అమెరికాకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్ష‌న్ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Manchu Avram: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు, కన్నప్పలో తిన్నడుగా మంచు విష్ణు కుమారుడు అవ్రామ్

Vikas M

Advertisement

Pakistan: వీడియో ఇదిగో, తమ జాతి కాదని 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు, పది వాహనాలకు నిప్పు, పాకిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘటన

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లాలో ఉగ్రవాదులు 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు.

Ladakh Gets 5 New Districts: లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 5 కొత్త జిల్లాలతో మెరుగైన పాలన అందుతుందని వెల్లడి

Hazarath Reddy

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌‌(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.

Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి..ఈ మూడు ఆహారాల ద్వారా ఉపశమనం పొందవచ్చు.

sajaya

మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య గర్భాశయవాపు. దీని ద్వారా గర్భశయంలో కనుతులు ఏర్పడతాయి. పిసిఒఎస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. మోనోపాజ్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: ప్రతిరోజు ఒక స్పూన్ అవిస గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.

sajaya

అవిస గింజలను ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Advertisement
Advertisement