వార్తలు

Telangana: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వదిలి వెళ్లిందని లైవ్‌లోనే పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం, సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం..

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండలం కోటి నాయక్ తండాకు చెందిన విజయ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే భార్య నికిత తనను వదిలి వెళ్లిందని మనస్థాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

Thief at Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. గోడ దూకి చొరబడిన దుండగుడు.. చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ

Rudra

నిర్మల్ లోని బాస‌రలో కొలువైన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో చోరీ జ‌రిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు.

Schedule for Assembly Polls Today: మోగనున్న ఎన్నికల నగారా... పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

Rudra

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

Arun Charagonda

తెలంగాణలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు కోదండరాం, అమీర్ అలీఖాన్. మండలిలోని తన ఛాంబర్‌లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ....కోదండరాం, అమీర్ అలీఖాన్ చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement

CM Revanth Reddy Delhi Tour: హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చ, ఆపిల్- ఫాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, పూర్తి వివరాలివే..

Arun Charagonda

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఆగస్టు 14న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణ పనులు, మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల, సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

Ram Narain Agarwal Passes Away: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత

Rudra

డీఆర్డీవో మిస్సైల్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ గా పేరుగాంచిన రామ్ నరైన్ అగర్వాల్ (84) హైదరాబాద్‌ లో గురువారం కన్ను మూశారు. ఈ మేరకు డీఆర్డీవో అధికారికంగా ప్రకటించింది.

SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)

Rudra

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.

KTR-Women's Commission: మహిళలపై 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మహిళా కమిషన్ సీరియస్.. సుమోటోగా తీసుకున్న కమిషన్.. విచారణకు ఆదేశం.. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు

Rudra

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు’ ప్రయాణ సదుపాయంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.

Advertisement

Menstrual Leave in Odisha: ఒడిశా మహిళా ఉద్యోగినులకు శుభ‌వార్త‌.. మాసంలో ఒక రోజు నెలసరి సెలవు.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు ప్రైవేటు సెక్టార్ లో కూడా..

Rudra

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఒడిశా స‌ర్కార్ అక్కడి మ‌హిళ‌ల‌కు తీపి కబురు చెప్పింది. ఒడిశాలోని ప్ర‌భుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.

Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి

Rudra

తెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.

Taiwan Earthquake: తైవాన్‌ ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌ పై 6.1 తీవ్రత న‌మోదు (వీడియోతో)

Rudra

భారీ భూకంపంతో శుక్ర‌వారం తైవాన్‌ చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్‌ స్కేల్‌ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది. తైవాన్‌ తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌ నగరానికి 34 కిమీ దూరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది.

Jai Jawan Trailer Out: జై జవాన్ ట్రైలర్ విడుదల, దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలిపే మూవీ

Vikas M

సంతోష్‌ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'జై జవాన్‌'.ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు.

Advertisement

PM Modi Meets Medal Winners: ఒలింపిక్ విజేత‌ల‌ను కలిసిన ప్ర‌ధాని మోదీ వీడియో ఇదిగో, ఇదే పిస్టల్‌తో పతకం తెచ్చానంటూ ప్రధాని మోదీతో మను బాకర్‌ ముచ్చట్లు

Vikas M

భార‌త దేశ 78వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఒలింపిక్ విజేత‌ల‌ను క‌లిశారు. ఒలింపిక్స్‌లో కంచుమోత మోగించిన మ‌ను భాక‌ర్, స్వ‌ప్నిల్ కుశాలె వ‌రుస‌గా రెండో కాంస్యం గెలుపొందిన‌ హాకీ ఆట‌గాళ్లు, యువ‌రెజ్ల‌ర్ అమన్ షెహ్రావ‌త్‌ల‌ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు.

Virat Kohli in London: వీడియో ఇదిగో, లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ, బ్లాక్ డ్రెస్ వేసుకుని రోడ్డు దాటుతున్న వీడియో వైరల్

Vikas M

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్ అనంత‌రం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండ‌న్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.

Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది, ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభం, అక్టోబర్ 3 నుంచి బుకింగ్‌లు స్టార్ట్

Vikas M

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మహీంద్రా థార్ రాక్స్ ఎట్టకేలకు మార్కెట్లో లాంచ్‌ అయింది.మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే బుకింగ్‌లు మాత్రం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి

BSA Gold Star 650: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా బీఎస్‌ఏ గోల్డ్‌స్టార్‌ 650, ధర రూ.2.99 లక్షల నుంచి రూ.3.35 లక్షల వరకు..

Vikas M

బీఎస్‌ఏ (BSA) భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) భారత్ మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ గురువారం ఆవిష్కరించింది.తద్వారా దేశీయ ప్రీమియం మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది

Advertisement

Ola Roadster: ఓలా నుంచి తొలి ఈ మోటార్‌ సైకిల్, రోడ్‌స్టర్‌ ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

Vikas M

ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) ‘రోడ్‌స్టర్‌’ పేరిట మోటార్‌ సైకిల్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. విద్యుత్‌ స్కూటర్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి మోటార్‌ సైకిల్ ఇదే. దీని ధర రూ.74,999 నుంచి ప్రారంభం అవుతుంది.

Varalakshmi Vratham Story: సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పిన వరలక్ష్మీ వ్రత కధ ఇదే, పార్వతి దేవికి చారుమతి గురించి శివుడు ఏం చెప్పాడో తెలుసుకోండి

Vikas M

ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు.

Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసా, వ్రతం పూజా విధానం, పూజా సామాగ్రి తదితర వివరాలు ఓ సారి తెలుసుకోండి

Vikas M

వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వచ్చింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి

Cisco Layoffs: ఆగని లేఆప్స్, 6 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయిన సిస్కో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు అడుగులు

Vikas M

AI వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో వనరులను మరింత సమర్ధవంతంగా కేటాయించాలని కంపెనీ కోరుతున్నందున తొలగింపులు పునర్నిర్మాణ ప్రయత్నంగా చెప్పబడుతున్నాయి. Cisco నుండి అడుగు టెక్ పరిశ్రమలో AI మరియు సైబర్ భద్రత యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ తొలగింపులు దాదాపు 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement
Advertisement