News

Crocodile Drags Woman Into River: వీడియో ఇదిగో, నదిలో బట్టలు ఉతుక్కుంటున్న మహిళను లాక్కెళ్లిన మొసలి, ఎంత భయంకరంగా ఉందంటే..

Team Latestly

ఒడిశాలో ఖరాస్రోటా నదీ తీరం వద్ద శనివారం ఒక భయంకర సంఘటన వెలుగుచూసింది. జజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో, నదీ తీరానికి దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లిన 55 ఏళ్ల సౌదామినీ మహాలా అనే మహిళపై అకస్మాత్తుగా మొసలి దాడి చేసింది. మహిళను నోట కరిచి, ఆమెను నీటిలోకి లాగేసింది. ఈ దారుణం స్థానికులను షాక్‌కి గురిచేసింది.

Guava Leaves Benefits: జామ ఆకులతో మీ ఆరోగ్యం ఎంతో సురక్షింతగా ఉంటుంది.. దగ్గు, జలుబు, శ్లేష్మం, శ్వాసకోశ, ఊపిరితిత్తులు, ఇమ్యూనిటీకి అన్నింటిని మీ శరీరం నుండి తరిమేస్తుంది..

Team Latestly

జామ చెట్టు ఆకులు మన ఆరోగ్యానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రధానంగా దగ్గు, జలుబు, శ్లేష్మం, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో జామ ఆకులు సహాయపడతాయి. వర్షాకాలంలో, గాలి మార్పులు, తుడిచిన వాతావరణం వలన వచ్చే జలుబులు, దగ్గు, జలుబుపోకలు, శ్లేష్మ సమస్యలకు జామ ఆకుల టీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.

IMD Alert: తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మారిపోయిన వాతావరణం, మరో మూడు రోజుల పాటు ఎండలతో కూడిన వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్

Team Latestly

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణం అస్తవ్యస్తంగా మారిపోయింది. పగలంతా ఎండ కాసి, సాయంత్రం ఆకస్మిక వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఈ తారుమారైన వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని సూచించింది.

Bihar Assembly Elections 2025 Date: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, రెండు దశల్లో పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు, మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు

Team Latestly

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశంలో, నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Jubilee Hills By-poll Schedule: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, నవంబర్‌ 11 వ తేదీన ఉప ఎన్నిక, 14వ తేదీన కౌంటింగ్‌, అదే రోజు ఫలితాలు విడుదల

Team Latestly

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 13వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయి 21వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రో రైలులో బూతులు తిట్టుకుంటూ తన్నుకున్న ఇద్దరు వ్యక్తులు, బిత్తరపోయి చూస్తుండిపోయిన ఇతర ప్రయాణికులు

Team Latestly

ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఇద్దరు వ్యక్తులు ఘోరంగా తన్నుకున్న వీడియో వైరల్ అవుతోంది. అనుచిత మాటలతో ఇద్దరూ ఘర్షణ పడిన వీడియో కెమెరాలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించిన 23 సెకన్ల వీడియోను ఘర్ కే కలేష్ అనే వ్యక్తి X (మునుపటి ట్విట్టర్) లో షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది.

CJI BR Gavai: సీజేఐ బీఆర్ గ‌వాయ్‌పై లాయర్ అటాక్‌, ఇలాంటి సంఘటనలు మనల్ని ప్రభావితం చేయవని తెలిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అసలు కోర్టులో ఏం జరిగిందంటే..

Team Latestly

సుప్రీంకోర్టులో ఈ రోజు ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. న్యాయవాది వేషధారణలో ఉన్న వ్యక్తి.. దేశ ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ కూర్చున్న డయాస్ వైపు షూ విసరడానికి ప్రయత్నించడం, కోర్టు వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే క‌ల‌గ‌జేసుకుని ఆ లాయ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

SC on OBC Reservation: బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కారుకు ఊరట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం

Team Latestly

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 9పై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.

Advertisement

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్, పాక్‌కు చెందిన ఎఫ్‌-16, జే-17 యుద్ధ విమానాల‌ను కూల్చేశామని తెలిపిన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్. ఇంకా ఏమన్నారంటే..

Team Latestly

భారత వైమానిక దళం “ఆపరేషన్ సింధూర్”లో ఘన విజయాన్ని సాధించినట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా, అమెరికా తయారీ ఎఫ్‌-16, చైనా తయారీ జే-17 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు.

Tomato Virus: టొమాటో వైరస్ అంటే ఏమిటి ? ఈ వ్యాధి ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏమైనా ఉందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Team Latestly

భోపాల్‌లో పాఠశాలల్లో ‘టొమాటో వైరస్’ అని పిలువబడే వైరల్ ఇన్‌ఫెక్షన్ పుట్టిందని అధికారులు గుర్తించారు. గురువారం పాఠశాలలు తల్లిదండ్రులను అప్రమత్తం చేసి, ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, పిల్లలు దాని ప్రభావంతో ఏ పరిస్థితుల్లో ఉన్నారో వివరించారు.

Devaragattu Bunny Festival: నెత్తురోడిన దేవరగట్టు బన్నీ ఉత్సవం, కర్రలతో తీవ్రంగా కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు, వీడియోలు ఇవిగో..

Team Latestly

కర్నూలు(Kurnool) జిల్లాహొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది.

Khandwa Tragedy: దుర్గామాత నిమ‌జ్జ‌నం కోసం వెళుతుండగా చంబాల్ న‌దిలో పడిపోయిన ట్రాక్టర్, ఊపిరాడక 16 మంది మృతి, వీడియో ఇదిగో..

Team Latestly

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో దుర్గామాత నిమజ్జన వేడుకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంబాల్ నదిలో దుర్గామాత నిమజ్జనం కోసం భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ నియంత్రణ కోల్పోవడంతో నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 10 మంది చిన్నారులు ఉన్నారు.

Advertisement

Sudden Death in Sitapur: షాకింగ్ వీడియో ఇదిగో, ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో డ్రమ్స్ వాయిస్తూ కుప్పకూలి పడిపోయిన కార్యకర్త, చికిత్స పొందుతూ మృతి

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో విషాదకరమైన సంఘటన జరిగింది. ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన మార్చ్‌లో ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త డ్రమ్ వాయిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అంకిత్ సింగ్ అనే స్వచ్ఛంద సేవకుడు డ్రమ్స్ వాయిస్తుండగా అకస్మాత్తుగా సమతుల్యత కోల్పోయి కుప్పకూలి పడిపోయాడు,

Dussehra Quotes in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు, విజయదశమి పండుగ వేళ మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

Realme 15x 5G Launched in India: రియల్‌మీ 15x 5G భారత మార్కెట్లో విడుదల, 7,000mAh బ్యాటరీతో పాటు 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా, ధర ఎంతంటే..

Team Latestly

ప్రముఖ చైనా దిగ్గజం రియల్ మీ తన తాజా స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 15x 5G ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 7,000mAh బ్యాటరీతో వస్తుంది, అది 60W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కెమెరా వ్యవస్థలో 50MP సోనీ AI వెనుక కెమెరా, 50MP AI ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు వినియోగదారుకు స్పష్టమైన, ప్రొఫెషనల్-క్వాలిటీ ఫోటోలు, సెల్ఫీలు అందించేలా డిజైన్ చేశారు.

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతి వేగంగా వెళుతూ ట్రక్కును ఢీకొట్టిన కారు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని చెబుతున్న నివేదికలు

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు, వీరిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. క్యాన్సర్‌తో మరణించిన స్థానిక మహిళ భర్త చితాభస్మ నిమజ్జనం కోసం బాధితులు హరిద్వార్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

Hyderabad: మాదన్నపేటలో దారుణం, కుక్క విషయంలో గొడవపడి వృద్ధురాలిపై కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులు దాడి, వీడియో ఇదిగో..

Team Latestly

హైదరాబాద్‌ నగరంలోని మాదన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబసభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారు. తన ఇంటి ముందు, పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలు ప్రశ్నించింది.

US Government Shuts Down: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ అంటే ఏమిటి? ఆరేళ్ల తర్వాత షట్‌డౌన్‌లోకి ట్రంప్ సర్కారు, భారత వాణిజ్యంపై దీని ప్రభావం ఎంత ఉంటుంది?

Team Latestly

డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆరేళ్ల తర్వాత షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ప్ర‌వేశపెట్టిన ఫెడరల్ నిధుల బిల్లుకు అవసరమైన ఆమోదం దక్కలేదు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 11.59 నిమిషాల వరకూ ఆ బిల్లు క్లియరెన్స్ కోసం వేచి చూడడం జరిగింది

RBI Repo Rate 2025: రెపో రేటు 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా, రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయిలోనే ఉందని వెల్లడి

Team Latestly

భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును ఎటువంటి మార్పులు లేకుండా 5.5 శాతం వద్దే కొనసాగించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన రేట్లు అవసరమని స్పష్టం చేశారు

Hyderabad New CP: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్‌, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా బదిలీ అయిన సీవీ ఆనంద్‌

Team Latestly

Advertisement
Advertisement