Visa,e-Visa of Foreigners: ఇండియాలో చిక్కుకున్న విదేశీయులకు ఊరట, వారి వీసా గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన హోం మంత్రిత్వ శాఖ

ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారు ఇండియాలోనే చిక్కుకుపోయారు. విమానాలను రద్దు చేయడంతో వారి ఇండియా నుంచి వెళ్లలేకపోయారు. అయితే ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది.విదేశీయుల వీసా గడువును పొడిగించింది.

Coronavirus Outbreak in India | PTI Photo

New Delhi, April 14: కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ (India Lockdown) విధించింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారు ఇండియాలోనే చిక్కుకుపోయారు. విమానాలను రద్దు చేయడంతో వారి ఇండియా నుంచి వెళ్లలేకపోయారు. అయితే ఇండియాలో చిక్కుకు పోయిన విదేశీయులకు భారత ప్రభుత్వం ఊరట కల్పించింది.విదేశీయుల వీసా గడువును పొడిగించింది.

ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి, విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ఇది సమయం కాదు

విదేశీయుల వీసాల చెల్లుబాటును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ హోం మంత్రిత్వ శాఖ (Home Ministry) ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా బారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరుల రెగ్యులర్ వీసా, ఇ-వీసా (Visa, e-Visa of Foreigners) లేదా స్టే నిబంధనలను 30.04.2020 (అర్ధరాత్రి) వరకు పొడిగించినట్టు ఈ ఉత్తర్వుల్లో తెలిపింది. విదేశీ పౌరుల వీసాలను ఎలాంటి జరిమానా లేకుండా ఉచితంగా ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై నేడు వీడనున్న సస్పెన్స్

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో దేశీయంగా రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. అలాగే ఇతర దేశాలకు రాకపోకలను కూడా నిషేధించిన సంగతి విదితమే. కాగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్‌ నేటితో ముగియనుంది.

లాక్‌డౌన్ దెబ్బ, గంగా,యమున నదుల్లోకి స్వచ్ఛమైన నీరు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని కోరుకుంటుండగా. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.