శృంగారంలో అనుభవం ఉన్న వివాహిత మహిళ తనపై లైంగిక దాడి జరుగుతున్నప్పుడు ప్రతిఘటించకపోతే, ఆమెతో శారీరక సంబంధాన్ని చెప్పలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న 30 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. సెప్టెంబరు 2024లో అరెస్టయిన 20 ఏళ్ల నిందితుడికి ప్రస్తుతం 376, 504, 506 సెక్షన్ల కింద ఛార్జిషీట్‌ను ఎదుర్కొంటున్నందుకు ఉపశమనం ఇస్తూ జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
రూ.6 లక్షల భరణం కోరిన భార్య, మీరే సంపాదించుకోవాలన్న మహిళా జడ్జి
ఆరోపించిన బాధితురాలు, దాదాపు 9 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మరియు 4 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లల తల్లి.భర్త 4 సంవత్సరాల క్రితం మరణించాడు. అవివాహితుడైన 20 ఏళ్ల ఆమె బావ గత రెండేళ్లుగా తనతో నిరంతరం శారీరక సంబంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వివాహం నెపంతో మరియు ఆమె పిల్లలను చూసుకుంటానని వాగ్దానంతో ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. ఈ సమయంలో ఆమె గర్భవతి కావడంతో నిందితుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అబార్షన్ చేసుకోమని ఒత్తిడి చేశాడు. తరువాత తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఆమెకు ప్రాణహాని కూడా జారీ చేశాడు.
మహిళ లైంగిక దాడిని ప్రతిఘటించకపోతే అత్యాచారంగా పరిగణించలేం
Physical Relation Not Considered Against Will If Married Woman With Experience In Sex Offers No Resistance: Allahabad HC | @ISparshUpadhyay
Victim, a mother of 3 children, was capable of understanding morality associated with the act : HChttps://t.co/T1eTRO3DGX
— Live Law (@LiveLawIndia) January 14, 2025
ఈ కేసులో బెయిల్‌ను కోరుతూ నిందితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ, బాధితురాలు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, వైద్య పరీక్షల్లో బాధితురాలి గర్భ పరీక్ష నెగిటివ్‌గా తేలిందని, దానిని ఆమె దృవీకరించిందని వాదించారు. బాధితురాలి వయస్సు దాదాపు 30 సంవత్సరాలు, అయితే ఆమె బావ వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. వాస్తవానికి, బాధితురాలు ఆమె బావని వివాహం చేసుకోవాలనుకుంది. అయితే బావ వైపు నుండి నిరాకరించడంతో, అతనిపై తప్పుడు కేసు పెట్టిందని నిందితుడి న్యాయవాది వాదించారు. ప్రస్తుత సందర్భంలో ఆమె గర్భం దాల్చిందన్న ఆరోపణలో కొంత భాగం వైద్య సాక్ష్యాధారాలతో సమర్ధించలేదని, అందువల్ల దరఖాస్తుదారుని (ఆమె బావ) తప్పుడు కేసుల్లో పెట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పేర్కొంటూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.