Condoms

Pune, Dec 31:  మహారాష్ట్రలోని పుణెలో ఉన్న హై స్పిరిట్స్‌ పబ్‌ న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా అందరికీ ఆహ్వాన పత్రికలు పంపింది. అయితే నూతన సంవత్సర వేడుకల ఇన్విటేషన్‌తోపాటు కండోమ్ ప్యాకెట్, ఓఆర్ఎస్ పంపించింది. ఈ ఇన్విటేషన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్ మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.

శృంగారం మధ్యలో కండోమ్ తీసేసిన ప్రియుడు, కోర్టు కెక్కిన ప్రియురాలు, దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన న్యాయస్థానం..

పబ్, నైట్ లైఫ్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే యూత్‌ను తమ పబ్‌కు వచ్చేలా ఇలాంటి దిగజారుడు పనులు, చెత్త మార్కెటింగ్ వ్యూహాలు సరికావని మండిపడ్డారు. సదరు పబ్‌పై వెంటనే పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇన్విటేషన్ కార్డును అందుకున్న పలువురిని పిలిచి విచారించినట్లు చెప్పారు.

ఫిర్యాదు స్వీకరించిన తర్వాత, పోలీసులు ఈ విషయంపై విచారణ ప్రారంభించి, "కండోమ్‌లు పంపిణీ చేయడం నేరం కాదు" అని పేర్కొన్న యజమానుల వాంగ్మూలాలను నమోదు చేశారు. యువతలో అవగాహన కల్పించడం, భద్రతను పెంపొందించడం మరియు బాధ్యతాయుత ప్రవర్తనను ప్రోత్సహించడం ఈ వస్తువుల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్ పేర్కొంది. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది