Hyderabad, Jan 3: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. సంధ్య థియేటర్ కేసు ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జనవరి పదో తేదీతో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పర్మిషన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఆసక్తిగా మారింది.
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు..
డిసెంబర్ 30న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్
బన్నీ పోలీస్ విచారణ పూర్తిగా సహకరిస్తున్నాడని.. రెగ్యులర్ బెయిల్ మంజూరు… pic.twitter.com/sEtpHwaGhB
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025
పోలీసుల కౌంటర్
అల్లు అర్జున్ కు ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు బెయిల్ వస్తుందా? లేదా? అని ఫ్యాన్స్ ఆందోళనతో ఉన్నారు.
సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత