India Republic Day 2020: భారత గణతంత్ర దినోత్సవం, ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్, తాజ్‌మహల్ నుండి ఇండియా గేటు వరకు..,జాతీయ పక్షి నుండి వస్త్రాలు మరియు నృత్యాలు వరకు..
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం నుంచే అన్ని రాష్ట్రాల్లో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. సోషల్ మీడియాలో (Social Media) ప్రజలు ఒకరి కొరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. జాతీయ జెండాకు, సైనికులకు వందనాలు సమర్పిస్తున్నారు.
Mumbai, January 26: ఈ రోజు భారత భారత గణతంత్ర దినోత్సవం (Republic Day) . దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం నుంచే అన్ని రాష్ట్రాల్లో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. సోషల్ మీడియాలో (Social Media) ప్రజలు ఒకరి కొరకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. జాతీయ జెండాకు, సైనికులకు వందనాలు సమర్పిస్తున్నారు.
ఇక ఢిల్లీలో భారీ భద్రత మధ్య గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (Brazil President Jair Bolsonaro) వచ్చారు. ఆయనకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఘన స్వాగతం పలికారు.
Republic Day 2020 Greetings కోసం క్లిక్ చేయండి
ఈ రోజు దేశం తన 71 వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున గూగుల్ డూడుల్ (Google Doodle) భారతదేశం యొక్క విభిన్న సంస్కృతి మరియు వారసత్వాన్ని తన డూడుల్ ద్వారా హైలైట్ చేసింది.
ప్రపంచ ప్రఖ్యాత మైలురాళ్లైన తాజ్ మహల్ (Taj mahal)మరియు ఇండియా గేట్ (India Gate) నుండి, జాతీయ పక్షి వంటి విస్తృత జంతుజాలం నుండి శాస్త్రీయ కళలు, వస్త్రాలు మరియు నృత్యాలు వరకు, డూడుల్ భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందులో విలీనం చేసింది. దీన్ని సింగపూర్ ఆధారిత అతిథి కళాకారుడు మెరూ సేథ్ (Meroo Seth) రూపొందించారు.
చాచా పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్
1950 జనవరి 26. భారత దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున మన దేశం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం ( Indian Constitution) అమల్లోకి వచ్చింది. ఆ సందర్భంగా ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇదే రోజున మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సంపూర్ణ స్వరాజ్ విప్లవం (Poorna Swaraj Resolution) ఫలితంగా మన దేశంలో బ్రిటీష్ చట్టాలన్నీ తొలగిపోయి.. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలవడం మొదలైంది. నేడు 71వ భారత గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్నాం.
200 ఏళ్ల పాటు బ్రిటీష్ వారి పాలనలో నలిగిపోయిన భారతీయులకు ఎందరో త్యాగధనుల పోరాట ఫలంతో ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం (Poorna Swaraj) వచ్చినా 1950 వరకు భారత దేశంలో బ్రిటీష్ రాజ్యాంగం అమల్లో ఉండేది. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగేది. స్వాతంత్య్రం తర్వాత మనకు ఓ ప్రత్యేక రాజ్యాంగం అవసరమని 1947, ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు.
Kaifi Azmi: 20వ శతాబ్దపు ప్రఖ్యాత భారతదేశపు కవి
1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. మనం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారత్ ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్య’ రాజ్యంగా అవతరించింది. ఆ రోజునే మనం ఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము.