Republic Day 2022 Parade Guidelines: రిపబ్లిక్ డే పరేడ్ మార్గదర్శకాలు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని స్పష్టం

వ్యాక్సినేషన్ డోస్‌లు పూర్తిగా వేయించుకుని ఉండాలని, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఆ మార్గదర్శకాల్లో (Republic Day 2022 Parade Guidelines) పేర్కొన్నారు.

Republic Day Parade (Photo Credits: PTI)

New Delhi, Jan 24: ఈ నెల 26న రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారంనాడు మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ డోస్‌లు పూర్తిగా వేయించుకుని ఉండాలని, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఆ మార్గదర్శకాల్లో (Republic Day 2022 Parade Guidelines) పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం సహా కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఓ ట్వీట్‌లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

గణతంత్ర దినోత్పవం రోజున ఈవెంట్ ను (Republic Day 2022 Guidelines) తిలకించేందుకు వచ్చే విజిటర్స్ వ్యాక్సినేషన్ సర్టిఫ్ కేట్ తప్పక చూపించాలి. విజిటర్స్ కు సీటింగ్ బ్లాక్స్ ను ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీ ఈవెంట్ సెక్యూర్టీ కోసం 27 వేల మంది పోలీసుల్ని మొహరించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. ఎయిర్ స్పేస్ సెక్యూరిటీ కోసం డ్రోన్లను వాడుతున్నారు. ట్రాఫిక్ కోసం ప్రత్యేక అడ్వైజరీ కూడా జారీ చేశారు.