Republic Day: మీ దేశ భక్తికి సలాం.., 71 వేల టూత్ పిక్‌లతో జాతీయ జెండా, వినూత్నంగా ఆలోచించిన అమృత్ సర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ బల్జీందర్ సింగ్,సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా ప్రతీ ఏడాది జనవరి 26 న దీన్ని జరుపుకుంటారు. 1950 జనవరి 26 న భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారనే విషయం అందరికీ తెలిసిందే..
Chandigarh, January 25: యావధ్బారతం 71 వ భారత గణతంత్ర దినోత్సవాన్ని (71st Republic Day) జరుపుకునేందుకు సిద్ధం అయింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా ప్రతీ ఏడాది జనవరి 26 న దీన్ని జరుపుకుంటారు. 1950 జనవరి 26 న భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారనే విషయం అందరికీ తెలిసిందే..
ఈ నేపథ్యంలో భారతదేశ గణతంత్ర దినోత్సవం రోజున తమ దేశ భక్తిని ఎంతో విన్నూత్నంగా చాటుకోవాలని ఎదురుచూస్తున్నారు. వీరంతా జాతీయ జెండాలను (National Flag) ప్రత్యేకంగా తయారు చేసి తమ దేశ భక్తిని చాటుకుంటున్నారు. అతి పెద్ద జెండాలను రూపొందించి తమ దేశభక్తిని నిరూపించుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. అతను చేసిన ప్రయత్నానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్‌లోని ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్ (Amritsar GOVT school teacher) అయిన బల్జీందర్ సింగ్ (Baljinder Singh) జాతీయ జెండా కోసం చేసిన ఓ ప్రయత్నం అందర్నీ విపరీతంగా ఆకట్టుకొంటోంది. మీ దేశభక్తికి హాట్సాఫ్ సార్ అంటూ నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.
Here's ANI Tweet
ఆయన 71 వేల టూత్ పిక్‌లతో (Toothpicks) జాతీయ జెండాను తయారు చేసి అందర్నీ అబ్బురపరుస్తున్నారు. ఇందుకు దాదాపు 40 రోజుల సమయం పట్టిందని ఆయన తెలిపారు. టూత్ పిక్‌లతో జాతీయ జెండాను తయారు చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నట్లు ఓ జాతీయ ఛానెల్‌తో తెలిపారు.
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా తన జెండాను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తానని బల్జీందర్ సింగ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మీ దేశభక్తికి వందనం చేస్తున్నామని, హాట్సాఫ్ అని వెల్లడిస్తున్నారు. దేశభక్తిని చూసి ఎంతగానో గర్విస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే 71వ రిపబ్లిక్ డేకు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.,