Politics
BRS Status In AP: బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ.. ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ కు నిరాశ.. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ నిర్ణయం
Rudraపొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది.
AAP Now National Party: ఈసీ కీలక నిర్ణయం, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీలకు జాతీయ హోదా రద్దు, ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ ప్రకటన
Hazarath Reddyకేంద్ర ఎన్నికల సంఘం సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. ఈ మేరకు ఈసీ నుంచి ప్రకటన వెలువడింది.
'Nobody Can Take Our Land': చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా, భారత్‌ భూభాగంలో ఒక్క ఇంచు కూడా తీసుకోలేరంటూ కౌంటర్, వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం ప్రారంభించిన హోం మంత్రి
Hazarath Reddyఅరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి చెందిన ఇంచు (Pin's tip Worth) భూభాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరని, దేశంపై చెడు దృష్టి సారించే సాహసం కూడా ఎవరూ చేయలేరని చైనాను ఉద్దేశించి అమిత్‌షా (Amit Shah) అన్నారు.
Two Leaders Suspended From BRS: బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు, పొంగులేటి, జూపల్లిని సస్పెండ్ చేసిన పార్టీ అధిష్ఠానం
Hazarath Reddyమాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్‌ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఇద్దర్నీ సస్పెండ్‌ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది.గతకొద్ది రోజులుగా జూపల్లి, పొంగులేటి.. బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
Chhattisgarh Excise Minister Kawasi Lakhma: నా ఊపిరి ఉన్నంతవరకు మద్యపాన నిషేదం జరగనివ్వను! చత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
VNSమద్యపానం ఆరోగ్యానికి హానికరం (liquor ban) అని ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రి(Excise Minister)....వారిని ప్రోత్సహించేలా మాట్లాడారు.తన కంఠంలో ప్రాణం ఉండగా మద్యపాన నిషేదం అమలు కానివ్వను అంటూ ప్రతిన బూనారు. ఇది ఎక్కడో కాదు. చత్తీస్‌ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా (Excise Minister Kawasi Lakhma) ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చిన జడ్జి నాలుక కోస్తాం..కాంగ్రెస్ నేత మణికందన్‌ వివాదాస్పద వ్యాఖ్య.. కేసు పెట్టిన పోలీసులు
Rudraక్రిమినల్ డీఫమేషన్‌ కేసులో ఇటీవల రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ తీర్పిచ్చిన న్యాయమూర్తి నాలుక కోస్తానంటూ తమిళనాడు కాంగ్రెస్ నేత మణికందన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Kiren Rijiju Accident: కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కారుకు తృటిలో తప్పిన ముప్పు, జమ్మూకశ్మీర్ పర్యటనలో రిజుజు కారును ఢీకొట్టిన ట్రక్కు
VNSకేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకు (Kiren Rijiju) తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కారును శనివారం రాంబన్ జిల్లాలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై (Jammu to Srinagar) వెళ్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టింది.
Kailash Vijay Vargiya: ఆ దుస్తులలో శూర్పణఖలా ఉంటారు.. మహిళల వస్త్రధారణపై బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు
Rudraమహిళల వస్త్రధారణపై బీజేపీ నేత కైలాశ్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి, మహవీర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కైలాశ్ వర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది మహిళలు చెడ్డ దుస్తులు ధరించి శూర్పణఖలాగా కనిపిస్తుంటారని అన్నారు.
Sharad Pawar On Adani: అదానీ, అంబానీ వంటి వారిని టార్గెట్ చేయాలనుకోవడం సరికాదన్న శరద్ పవార్.. కావాలనే అదానీని టార్గెట్ చేశారన్న నేత
Rudraప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గురించి రిపోర్ట్ ఇచ్చిన హిండెన్ బర్గ్ ఎక్కడిది, దాని చరిత్ర ఏమిటని ప్రశ్నించారు. కావాలనే అదానీని టార్గెట్ చేశారని విమర్శించారు.
Mekapati Rajamohan Reddy: నా తమ్ముడి పంచన ఓ దుష్టశక్తి చేరింది, చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్‌పై స్పందించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉదయగిరి ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని వెల్లడి
Hazarath Reddyమాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati Rajamohan Reddy) తన సోదరుడి క్రాస్ ఓటింగ్ అంశంపై స్పందించారు. తన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనని అన్నారు. తన మాట వినకుండా చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు.
Karnataka Assembly Elections 2023: కాంగ్రెస్‌ను గెలిపిస్తే..బీజేపీ రద్దు చేసిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కోటా పునరుద్ధరిస్తాం, కర్ణాటకలో డీకే బిగ్ ప్రామిస్
Hazarath Reddyకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీని గెలిపిస్తే ముస్లింలకు అధికార బీజేపీ సర్కార్ రద్దు చేసిన 4 శాతం రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు.
Kiran Kumar Reddy Joins BJP: బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా వేసుకున్నారు
Jagananne Maa Bhavishyathu: జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం, ఈ నెల 20వ తేదీ వరకూ 175 నియోజకవర్గాల్లో కొనసాగనున్న కార్యక్రమం, ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం
Hazarath Reddyరాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకునే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి నేటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టింది. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ సైనికులుగా పార్టీ పదాతిదళం ప్రతి ఇంటికీ వెళ్తుంది.
India Slams China: అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రదేశాల పేర్లు మార్చిన చైనా, అది మా భూభాగమంటూ మండిపడిన భారత్, మద్దతుగా నిలబడిన అమెరికా
Hazarath Reddyవిదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగమని, చైనా తన స్వంత ఆవిష్కరణ పేర్లను పెట్టడం వల్ల వాస్తవికత మారదని అన్నారు.
Protest Against PM Modi: మోదీ నుంచి దేశాన్ని కాపాడాలంటూ పార్లమెంట్ సమీపంలో నిప్పంటించుకున్న ఓ వ్యక్తి, రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు
Hazarath Reddyఢిల్లీలోని పార్లమెంట్ భవనం సమీపంలో గురువారం ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.రోహిణి నివాసి అయిన రాజ్ కుమార్ శర్మ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నాడని వర్గాలు తెలిపాయి.
Taj Mahal Not Symbol of Love: తాజ్‌మహల్‌పై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, అది ప్రేమకు చిహ్నం కాదు, దాన్ని వెంటనే కూల్చేయాలని వెల్లడి
Hazarath Reddyతాజ్‌మహల్‌పై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. ‘తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నం కాదు. షాజహాన్‌ తన నాలుగో భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు.
BJP MLA Sanjeeva Matandoor: యువతితో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్, అవి ఫేక్ ఫోటోలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సంజీవ మతాండూర్
Hazarath Reddyదక్షిణ కన్నడ జిల్లాలో గుర్తుతెలియని మహిళతో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సంజీవ మతాండూర్ (BJP MLA Sanjeeva Matandoor) దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఆయన గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పతనాన్ని నిర్ధారించే కుట్రలో భాగంగా వైరల్ ఫోటోలను ఎడిట్ చేసి వైరల్ చేశారని మతాండూర్ పేర్కొన్నారు.
CM Jagan Slams Chandrababu: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, తోడేళ్లంతా ఏకమై వచ్చినా నేను సింగిల్‌గానే వస్తానని వెల్లడి, ప్రజలే నా సైనికులని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyగురువారం చిలుకలూరిపేట లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్‌ బహిరంగ సభలో ప్రతిపక్షంపై జగన్ విరుచుకుపడ్డారు. స్కాములు తప్ప స్కీములు తెలియని బాబులు.. సామాజిక న్యాయం తెలియని పరాన్న జీవులు అంటూ ప్రతిపక్ష టీడీపీ అండ్‌ కోను సీఎం జగన్‌ ఏకిపారేశారు.
Vidadala Rajini on CM Jagan: మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి, నాకు రాజకీయ భిక్ష నువ్వు పెట్టిందే అన్న, భావోద్వేగంతో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే విడదల రజని
Hazarath Reddyఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం పూర్తిస్థాయి ప్రారంభం కార్యక్రమంలో భాగంగా విడదల రజనీ మాట్లాడారు. చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.