రాజకీయాలు

Mudragada Padmanabham: అయ్యా చంద్రబాబు.. నన్ను నా భార్యను ఎంతగా అవమానించారో గుర్తుకు తెచ్చుకోండి, నీ పతనం చూడాలనే ఇన్నాళ్లు చావకుండా బతికి ఉన్నా, చంద్రబాబుకు లేఖ రాసిన సీనియర్ కాపు నేత ముద్రగడ

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాజీ మంత్రి, కాపు ఉద్యమ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో (Mudragada Padmanabham Writes Letter to Chandrababu) పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

Three Capital Bill Withdrawn: మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం, కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటన

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి (Three Capital Bill Withdrawn) తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులపై (Three Capitals Bill) అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.

Chandrababu Naidu: త్వరలో వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తా, బాధితులకు అండగా నిలుస్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు, బాధితులను ఆదుకోవాలని టీడీపీ శ్రేణులకు సూచన

Hazarath Reddy

భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను త్వరలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల నాయకులతో శనివారం మాట్లాడారు. టీడీపీ శ్రేణులు బాధితులు ఆదుకోవాలని సూచించారు.

Jr NTR on AP Politics: ఏపీ రాజకీయాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆవేదన, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని వీడియో విడుదల

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నందమూరి తారక రామారావు మనవడు, దివంగత హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నిన్న అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, అంతేకానీ అలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు.

Advertisement

AP Assembly Day 2: మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు, టీడీపీ అధినేత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం వైయస్ జగన్, చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనే విషయం అందరికీ తెలుసంటూ చురక

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు (AP Assembly Day 2) వాడి వేడిగా ముగిశాయి. వ్యవసాయ రంగంపై జరుగుతున్న చర్చ కాస్తా వ్యక్తిగత చర్చగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సీఎం గా గెలిచిన తరువాతనే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేశారు

PM Modi Address Nation: నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒప్పించలేకపోయానని తెలిపిన ప్రధాని, పూర్తిగా రద్దు చేసేవరకు కదిలేది లేదంటున్న రైతులు, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దును స్వాగతించిన ప్రతిపక్షాలు

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి (PM Modi Address Nation) ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు (Repeal of 3 Farm Laws) చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు.

Farm Laws Repeal: సత్యాగ్రహంతో కేంద్రం అహంకారాన్నిరైతులు ఓడించారు, సాగు చట్టాల రద్దుపై రాహుల్ గాంధీ రియాక్షన్, రైతులకు అభినందనలు తెలిపిన రాహుల్

Naresh. VNS

సాగు చట్టాలను రద్దు చేయడంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేప‌ట్టిన స‌త్యాగ్రహం, కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడించిన‌ట్లు రాహుల్ విమ‌ర్శించారు. దేశ రైతులు త‌మ స‌త్యాగ్రహ దీక్షతో.. కేంద్ర స‌ర్కార్ అహంకారాన్ని త‌ల‌దించుకునేలా చేశార‌న్నారు.

Kuppam Municipality: కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కైవసం, బీటలువారిన చంద్రబాబు కంచుకోట, మెజార్టీ వార్డులను కైవసం చేసుకుని చైర్మన్ పదవి చేజిక్కించుకున్న అధికార వైసీపీ పార్టీ

Hazarath Reddy

25 వార్డుల్లో ఇప్పటికి వెలువడిన ఫలితాల ప్రకారం 17 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. టీడీపీ రెండు స్థానాల్లో గెలిచింది. హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కౌంటింగ్‌ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.

Advertisement

AP Municipal Election Results 2021: కుప్పంలో చంద్రబాబుకు భారీ షాక్, ఇప్పటికే పది వార్డుల్లో అధికార పార్టీ ఘన విజయం, మున్సిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ అడుగులు, కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వస్థలమైన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ మొత్తం 25 వార్డులకు గానూ 24 వార్డుల ఓట్ల లెక్కింపు జరుతున్నది. ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవమైంది. బాబు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ ఖాతా తెరించింది.

MLC Elections in AP: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి, 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ, డిసెంబరు 10న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Hazarath Reddy

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖ జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 2, కృష్ణా జిల్లాల్లో 2, అనంతపురం జిల్లాలో 1, తూర్పు గోదావరి జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

MLC Elections in Telangana: తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ఎమ్మెల్యే కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్ సర్కారు, సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు

Hazarath Reddy

తెలంగాణలో స్థానిక సంస్థ‌ల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు (MLC Elections in Telangana) నోటిఫికేష‌న్ వెలువ‌డింది. నేటి నుంచి ఈ నెల 23 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 26. డిసెంబ‌ర్ 10న పోలింగ్, డిసెంబ‌ర్ 14న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

Bandi Sajnjay Nalgonda Tour: సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు, చివ్వెం ఐకేపీ సెంటర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ప్రభుత్వం వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ నేత డిమాండ్

Hazarath Reddy

బండి సంజయ్ నల్గండ టూర్ (Bandi Sajnjay Nalgonda Tour) సందర్భంగా సూర్యపేట జిల్లా చివ్వెం ఐకేపీ సెంటర్‌ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐకేపీ సెంటర్‌ను సందర్శించేందుకు వచ్చిన బండి సంజయ్‌ను స్థానిక టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ( TRS- BJP clash in Nalgonda) అడ్డుకున్నారు. నల్లజండాలతో నిరసనలు తెలిపారు.

Advertisement

AP Panchayat Election Results 2021: పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులదే హవా, 27 సర్పంచ్‌, 47 వార్డు స్థానాలు కైవసం, పెండింగ్ పంచాయితీ ఎన్నికల ఫలితాల పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

36 సర్పంచి, 68 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెల్చుకున్నారు. 27 సర్పంచ్‌ పదవుల్ని, 47 వార్డుల్ని అధికార పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

AP MLC Elections 2021: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టును ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి, పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నామని తెలిపిన పార్టీ ప్రధాన కార్యదర్శి

Hazarath Reddy

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను (YSRCP MLC candidates) పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో 18 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారని, వారిలో 11 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారేనని ఆయన (Sajjala Ramakrishna Reddy) చెప్పారు.

Mizoram: మాకు హిందీ రాదు, ఆమెకు మా భాష రాదు, మా భాష వచ్చిన వారిని సీఎస్‌గా నియమించండి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మిజోరాం సీఎం జొరంతంగ

Hazarath Reddy

మిజోరాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రేణు శర్మ నియామకంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జొరంతంగ (Mizoram CM Zoramthanga) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నియామకం వద్దంటూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

CM KCR Press Meet: ఫాంహౌజ్ దున్నడానికి నీవు డ్రైవర్‌వా, ఓ తోకగానివి, నా ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్‌, బండి సంజయ్‌పై విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని వదిలే ప్రశ్నే లేదని.. వెంటాడుతూనే ఉంటానని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. బండి సంజ‌య్ నువ్వో తోక‌గాడివి..నా ఫాంహౌజ్ దున్నుతా అంటున్నావ్‌.. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ వా? అంటూ మండిపడ్డారు.

Advertisement

Navjot Singh Sidhu: రాజీనామాపై వెనక్కు తగ్గిన సిద్ధూ, కానీ కాంగ్రెస్‌కు ఓ కండీషన్, అప్పటి వరకు పార్టీ ఆఫీస్‌లో అడుగుపెట్టబోనని శపథం

Naresh. VNS

పంజాబ్‌ పీసీసీ చీఫ్ పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. అయితే కాంగ్రెస్‌కు ఒక కండీషన్ పెట్టారు. పంజాబ్‌కు కొత్త అడ్వకేట్ జనరల్‌ను నియమించిన రోజే తాను కాంగ్రెస్ ఆఫీస్‌లో అడుగుపెట్టి, బాధ్యతలు స్వీకరిస్తానని అల్టిమేటం జారీ చేశారు.

Bypoll Results 2021: కమలానికి రైతుల సెగ తగిలిందా..30 అసెంబ్లీ స్థానాల్లో 7 సీట్లకే పరిమితమైన బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయం, మూడు లోక్‌సభ స్థానాల్లో ఒకదానికే పరిమితమైన కాషాయం పార్టీ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి నిరాశనే మిగిల్చాయి. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు (Bypoll Results 2021) జరగ్గా అందులో కేవలం ఒక లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. అధికారంలో ఉన్న చోట కూడా బీజేపీ పరాజయం పాలైంది.

Amarinder Resigns From Congress: దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్

Hazarath Reddy

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Resigns From Congress) మంగళవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పెట్టేశారు. పార్టీకి పంజాబ్ లోక్ కాంగ్రెస్ (Punjab Lok Congress) అని పేరు పెట్టారు. వచ్చ ఏడాది పంజామ్ కు జరగనున్న ఎన్నికల్లో (Punjab Assembly Elections 2022) పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కెప్టెన్ తెలిపారు.

Badvel Bypoll Result 2021: జగన్ పాలనకే జై కొట్టిన బద్వేల్ ఓటర్లు, 90,533ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ, విజేతకు అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ పార్టీ ఘన విజయం (YSRCP's Dasari Sudha Wins) సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ దూకుడు ముందు మిగతా పార్టీలు ఏవీ నిలబడలేకపోయాయి.

Advertisement
Advertisement