Politics

No Lockdown in Delhi: కేసులు పెరిగినా లాక్‌డౌన్ విధించ‌బోం, లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కొన్ని ఆంక్షలు మాత్రం తప్పవని వెల్లడి

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వేళ లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించబోవడం (No Lockdown in Delhi) లేదని స్పష్టం చేశారు.

Assam Assembly Elections 2021: అసోంలోని నాలుగు పోలింగ్ స్టేషన్లలో 20న రీపోలింగ్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం, ర‌త‌బారి, సొనాయ్‌, హ‌ఫ్లాంగ్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాలుగు పోలింగ్ బూత్‌ల‌లో రీపోలింగ్‌కు ఆదేశాలు

Hazarath Reddy

అసోంలోని మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోగ‌ల‌ నాలుగు పోలింగ్ బూత్‌ల‌లో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. ఈ మేర‌కు శ‌నివారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర్వులు జారీచేసింది.

Tirupati Bypoll: వైయస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేనని తెలిపిన ఏపీ సీఎం, తిరుపతి ప్రజలకు బహిరంగ లేఖ

Hazarath Reddy

MLA Raosaheb Antapurkar Dies: కరోనాతో కన్నుమూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు సాహెబ్ అంత‌పుర్క‌ర్, నాందేడ్ జిల్లాలోని డేగ్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రావు సాహెబ్

Hazarath Reddy

క‌రోనా బారిన ప‌డ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు సాహెబ్ అంత‌పుర్క‌ర్(64) శ‌నివారం చ‌నిపోయారు. కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయిన త‌ర్వాత ముంబైలోని ఓ ఆస్ప‌త్రిలో రావు సాహెబ్ చేరి చికిత్స పొందారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయ‌న ప‌రిస్థితి విష‌మించడంతో.. వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతూ శ‌నివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు.

Advertisement

Peddapalli MP Venkatesh: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ‌మిస్సింగ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు, పెద్దపల్లి ఎంపీ ఫోటోను పట్టుకుని బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీ

Hazarath Reddy

పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ (Peddapalli MP Venkatesh) ఫొటోను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి మంచిర్యాల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు (BJP leaders complaint) చేశారు.

Clubhouse Chat Audio Leaked: మమత ఓడిపోతుంది, బీజేపీ గెలుస్తుంది, కలకలం రేపుతున్న ప్రశాంత్ కిషోర్ క్లబ్‌హౌస్ చాట్ ఆడియో టేప్, ధైర్యం ఉంటే మొత్తం చాట్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేసిన ప్రశాంత్ కిషోర్

Hazarath Reddy

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్‌ జరుగుతోంది. టీెంసీ, బీజేపీల మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లు అక్కడ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన ‘క్లబ్‌హౌస్ చాట్’ ఆడియో టేప్ (Clubhouse Chat Audio Leaked) సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది.

West Bengal Elections 2021: టీఎంసీ–బీజేపీ నేతల ఘర్షణ, కాల్పుల్లో నలుగురు మృతి, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుపై దాడికి ప్రయత్నం, పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపిన పోలీసులు

Hazarath Reddy

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుచ్‌బెహార్‌లో టీఎంసీ – బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన కొంతమంది అక్కడున్న ఓ సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుపై దాడికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు కాల్పులు జరిపారు.

Tirupati Bypoll: లోకేశ్‌, చంద్రబాబులపై డీజీపీకి ఫిర్యాదు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన వైసీపీ నేతలు, ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే పోస్టులు పెట్టారని ఆరోపణ

Hazarath Reddy

టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లపై వైసీపీ నేతలు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఫేస్‌బుక్‌ అక్కౌంట్‌లో తమపార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరిచే విధంగా పోస్టింగ్‌లు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీకి ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Sharmila New Party: కొత్త మలుపులతో తెలంగాణ రాజకీయాలు, జూలై 8న షర్మిలారెడ్డి కొత్త పార్టీ, అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపిన వైయస్ఆర్ తనయ, షర్మిల ఇక నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అంటున్న వైయస్ విజయమ్మ

Hazarath Reddy

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ (New Party in Telangana) రాబోతోంది. త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నా అని వైఎస్‌ షర్మిల ఖమ్మం సంకల్ప సభ వేదికగా ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి (Late Chief Minister YS Rajasekhara Reddy Birthday) రోజైన జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు వైఎస్‌ షర్మిల ప్రకటించారు.

AP's Parishad Polls 2021: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్, చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం, 60.91 శాతం పోలింగ్ నమోదు, హైకోర్ట్ తీర్పు తర్వాత కౌంటింగ్ 

Team Latestly

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 7,220 ఎంపిటిసిలు, 515 జెడ్‌పిటిసి స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తున్నారు.....

Major Jolt to TDP: తెలంగాణలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ, తెలంగాణ టీడీపీ శాసనసభ పక్షం అధికార టీఆర్ఎస్ పార్టీలో విలీనం, టీఎస్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయిన తెలుగు దేశం పార్టీ

Team Latestly

తెలుగు దేశం పార్టీకి ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో హైకోర్ట్ తాజా తీర్పుతో బోక్కబోర్లా పడ్డ టీడీపీకి, ఇటు తెలంగాణలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ తెలుగు దేశం శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు.....

Assembly Elections 2021: ముగిసిన మినీ సంగ్రామం, మే 2న కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి, కేరళలో 74%, తమిళనాడులో 65.68%, పుదుచ్చేరిలో 80.67%, అస్సాం: 82.29%, పశ్చిమ బెంగాల్: 77.68% పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ (Assembly Elections 2021) ముగిసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.

Advertisement

Thalapathy Vijay: సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన నటుడు విజయ్, అభిమానులతో సెల్ఫీలకు పోజులు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్‌ వేగంగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు.

Assembly Elections 2021: అయిదు రాష్ట్రాల మినీ సంగ్రామం, ప్రారంభమైన పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న కమల్ హాసన్, రజినీకాంత్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులు, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌

Hazarath Reddy

దేశంలో అయిదు రాష్ట్రాల్లో మినీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Assembly Elections 2021) ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి.

Anil Deshmukh Resigns: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా, హోంమంత్రిపై సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ జరపాలని బాంబే హైకోర్టు ఆదేశాలు, 15 రోజుల్లోగా సీబీఐ విచార‌ణ పూర్తి చేయాల‌ని సూచించిన కోర్టు

Hazarath Reddy

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.ముంబై మాజీ క‌మీష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల కేసులో.. హోంమంత్రి దేశ్‌ముఖ్‌పై 15 రోజుల్లోగా సీబీఐ విచార‌ణ పూర్తి చేయాల‌ని ఇవాళ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హోంమంత్రి రాజీనామా (Anil Deshmukh Resigns As Maharashtra Home Minister) చేశారు.

Assembly Elections 2021: అయిదు రాష్ట్రాల్లో రేపే పోలింగ్, మోదీ-అమిత్ షాల మేజిక్‌ పనిచేస్తుందా, తమిళనాడులో గెలిచేదెవరు, కేరళను ఏలేదెవరు, అస్సాంలో ఆఖరి దశ పోలింగ్, దేశాన్ని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు

Hazarath Reddy

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు, అస్సాం, పశ్చిమ బెంగాల్ లో మూడవ దశ పోలింగ్ (Assembly Election 2021) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగిల్ ఫేజ్ పోలింగ్ రేపు తమిళనాడు (Tamil Nadu Election 2021), కేరళ, పుదుచ్చేరిలో జరగనుండగా, అస్సాం మూడు దశల ఓటింగ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఓటింగ్ జరగనుంది.

Advertisement

Assam Assembly Election 2021: ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన ప్రధాని మోదీ, ముందు ఆ కార్యకర్తకు వైద్యం చేయాలని వైద్యులకు సూచన, మిలిటెంట్లు ఆయుధాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జాజీవితంలో క‌లిసి పోవాల‌ని కోరిన ప్రధాని

Hazarath Reddy

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్ర‌ధాని మోదీ ఇవాళ అస్సాంలో పర్యటించారు. త‌ముల్‌పుర్‌లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Assam Assembly Election 2021) మాట్లాడుతూనే మధ్యలో ఒక్కసారిగా ప్రసంగాన్ని ఆపేశారు.

AP MPTC, ZPTC Elections 2021: టీడీపీ అవుట్, బీజేపీ సై, నిజమైన ప్రతిపక్షం మాదేనంటున్న సోము వీర్రాజు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహష్కరించిన టీడీపీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన బీజేపీ

Hazarath Reddy

ఏపీలో ఈ నెల 8న జరగనున్న ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము పోటీలో లేమని ప్రజలు గమనించాలని కోరారు. ఇక బీజేపీ ఎన్నికల్లో (AP MPTC, ZPTC Elections 2021) పోటీ చేస్తున్నామని స్పష్టం చేసింది.

Election Code in AP: ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్, ఆఖిలపక్షంతో భేటీ అనంతరం స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, భేటీకి బీజేపీ, టీడిపీ మరియు జనసేన పార్టీల గైర్హాజరు

Team Latestly

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ అన్నారు. శుక్రవారం నాడు అఖిల పక్షం నేతలతో సమావేశం నిర్వహించిన నీలం సాహ్నీ, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు....

AP ZPTC MPTC Elections 2021: ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 8న పోలింగ్‌, 10న ఫలితాలు, ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

Hazarath Reddy

ఏపీలో మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది. ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ (AP ZPTC MPTC elections 2021) విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు.

Advertisement
Advertisement