రాజకీయాలు

Dubbaka By-poll Heat: దుబ్బాక నోట్ల కట్టల రాజకీయం, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, బీజేపీది ఓటమి భయమన్న టీఆర్ఎస్, మీరు పోలీసులా అంటూ బీజేపీ ఫైర్, అసలేం జరిగింది..ఘటనపై ఎవరేమన్నారు?

Hazarath Reddy

తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల్లో (Dubbaka By-poll Heat) భాగంగా నోట్ల కట్టల వివాదం సోమవారం నుంచి హాట్ టాపిక్ అయిన విషయం విదితమే. బీజేపీ చేసిన పనేనంటూ టీఆర్ఎస్.. కాదు కాదు అంతా టీఆర్ఎస్సే చేసిందంటూ బీజేపీ ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు.

Case Booked Against Nara Lokesh: నారా లోకేష్‌పై కేసు నమోదు, అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపినందుకు ఐపీసీ 279,184, 54ఎ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఆకివీడు పోలీసులు

Hazarath Reddy

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో నారా లోకేష్‌పై కేసు (Case Booked Against Nara Lokesh) నమోదైంది. రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని, కొందరి ప్రాణాలకు హాని కలించేలా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు.

Dubbaka Bypoll: దుబ్బాకలో దొరికిన డబ్బులెవరివి? బీజేపీ నాయకులు అడ్డదారిలో వెళుతున్నారని తెలిపిన హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే అరాచకం నడుస్తుందని మండిపడ్డ బీజేపీ ఎంపీ బండీ సంజయ్

Hazarath Reddy

తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల్లో (Dubbaka bypoll) నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దిపేటలో డబ్బు నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మూడు చోట్ల సోదాలు నిర్వహించగా డబ్బులు దొరికాయని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు.

Bihar Assembly Elections 2020: బీహార్‌కు కాబోయే‌ బాద్‌షా ఎవరు ? నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం, అక్టోబర్ 28 నుంచి తొలి దశ పోలింగ్

Hazarath Reddy

రాష్ట్రంలో ఈ నెల 28న తొలి ధపా పోలింగ్ (Bihar Assembly Elections 2020) జరగనుంది. నేటితో బీహార్ లో తొలి దఫా ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. ఇప్పటికే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Advertisement

'Maha' Moves to Delhi: ఢిల్లీలోనూ పాగా వేస్తాం, సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు, కేంద్రంపై విరుచుకుపడిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, శివసైనికుల ఆగ్రహం తట్టుకోలేరంటూ చురక

Hazarath Reddy

దసరా సందర్భంగా శివసేన పార్టీ వార్షిక సమావేశంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ( Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో 25 ఏండ్లపాటు మహా వికాస్ అగాడి కూటమి (Maha Vikas Aghadi government) అధికారంలో కొనసాగుతుందని, కేంద్రంలోనూ అధికారంలోకి రావచ్చని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి మనం ఎదుగుతామని ఆయన అన్నారు.

'Muslims Are Not Kids to be Misguided': ముస్లింలు చిన్న పిల్లలు కాదు తప్పుదారి పట్టించడానికి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసి, పోటాపోటీగా బీహార్ ఎన్నికల ప్రచారం

Hazarath Reddy

వివాదాస్పద పౌరసత్వం (సవరణ) చట్టంపై "కొంతమంది మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టించారు" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు. “మేము చిన్న పిల్లలం కాదు మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ’('Muslims Are Not Kids to be Misguided')అని ట్విట్టర్ వేదికగా కౌంటర్ విసిరారు. CAA + NRC ఏమి చేయాలో BJP సరైన విధంగా చెప్పలేదు. ఇది ముస్లింల గురించి కాకపోతే, మతం గురించి అన్ని సూచనలను చట్టం నుండి తొలగించండి ”అని ఒవైసీ (Asaduddin Owaisi) ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Covid in TS: తెలంగాణలో తాజాగా 978 పాజిటివ్ కేసులు, నలుగురు మృతితో 1307కు చేరుకున్న మరణాల సంఖ్య, రాష్ట్రంలో యాక్టివ్‌గా 19, 465 కేసులు

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్నవారి శాతం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో రికవరీ రేటు 91.01శాతానికి చేరుకోగా, దేశంలో 89.09 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 40,79,668 లక్షల టెస్టులు పూర్తిచేయగా, 2,31, 252 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 2.10, 480 లక్షల మంది కోలుకోగా, 19,937 మంది ఇండ్లు, దవాఖానల్లో కోలుకుంటున్నట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.

Naini Narshimha Reddy No More: 'బుల్లెట్ నరసన్న' ఇక లేరు! తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి కన్నుమూత, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

Team Latestly

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశారు. పార్టీ శ్రేణులు నాయినిని "బుల్లెట్ నరసన్న" గా పిలుచుకునేవారు....

Advertisement

Lanka Dinakar Suspended From BJP: లంకా దినకర్‌పై వేటు, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇవ్వని దినకరన్

Hazarath Reddy

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నియమావళి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాలు, నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేత లంకా దినకర్‌ను (Lanka Dinakar Suspended From BJP) ఆ పార్టీ షాకిచ్చింది. పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో చర్చల్లో పాల్గొంటున్నారని పార్టీ సీరియస్ అయ్యింది.

AP Coronavirus: ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు మొత్తం బాధ్యత ప్రభుత్వానిదే, స్పష్టం చేసిన వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని, ఏపీలొ తాజాగా 2,918 మందికి కోవిడ్-19

Hazarath Reddy

ఏపీలో తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 2,918 కొత్త కేసులు (AP Coronavirus Report) వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 468 పాజిటిట్ కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది.అదే సమయంలో ఏపీలో 24 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,453కి పెరిగింది. తాజాగా 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. 7,44,532 మందికి కరోనా నయం కాగా, ఇంకా 35,065 మంది చికిత్స పొందుతున్నారు.

Farooq Abdullah Questioned by ED: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ స్కాం, మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ అధికారులు, అలాంటిదేమి లేదని తెలిపిన కుమారుడు ఒమర్ అబ్దుల్లా

Hazarath Reddy

జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ అధికారులు (Farooq Abdullah Questioned by ED) విచారిస్తున్నారు. జ‌మ్మూక‌శ్మీర్ క్రికెట్ సంఘంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల విష‌యంలో ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తున్నారు. ఫరూక్‌ అబ్దుల్లా సహా పదిమంది జేకేసీఏ కార్యవర్గ సభ్యులు సంస్థను రుణాల జారీ సంస్థగా మార్చేశారని, ఈ కుంభకోణం వెలుగుచూసిన 2005-12లో పలు బోగస్‌ ఖాతాలను నిర్వహించారని ఈడీ (Enforcement Directorate) ఆరోపిస్తోంది. కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఫరూక్‌ అబ్దుల్లాను ప్రశ్నిస్తున్నారని ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపించారు.

Kamal Nath’s ‘Item’ Comment Row: ఆమె పెద్ద ఐటమ్..క‌మ‌ల్‌నాథ్ వ్యాఖ్యలపై పెను దుమారం, నిరసనగా మౌన దీక్ష చేపట్టిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, చర్యలు తీసుకోవాలంటూ సోనియా గాంధీకి లేఖ

Hazarath Reddy

మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్‌.. బీజేపీ నేత ఇమార్తి దేవిపై ఆదివారం ఉప ఎన్నిక‌ల కోసం ప్ర‌చారంలో ఆమె ఓ పెద్ద ఐట‌మ్ (Kamal Nath’s ‘Item’ Comment Row) అంటూ అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ద‌బ్రా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ.. త‌మ పార్టీ అభ్య‌ర్థి చాలా సాదాసీదా వ్య‌క్తి అని, కానీ బీజేపీ అభ్య‌ర్థి గురించి మీకు తెలుసు అని, ఆమె ఓ ఐట‌మ్ అంటూ క‌మ‌ల్‌నాథ్ (Kamal Nath) కామెంట్ చేశారు. ఆమె పేరు కూడా ఉచ్చ‌రించ‌డం నాకిష్టం లేద‌ని, ఆమె ఓ పెద్ద ఐట‌మ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో క‌మ‌ల్ నాథ్ కామెంట్ ప‌ట్ల బీజేపీ నేత‌ల ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

Advertisement

Atchannaidu Kinjarapu: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, కమిటీలను ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడును (Atchannaidu Kinjarapu) నియమించారు. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను ( L Ramana) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్‌ (Nara Lokesh) నియమితులయ్యారు.

DK Aruna & Revanth Reddy Arrested: ఎంపీ రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ అరెస్ట్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు

Hazarath Reddy

కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ నీట మునగడంతో దానిని సందర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉప్పునుంతల-కొల్లాపూర్ మార్గంలో తెలకపల్లి వద్ద కాంగ్రెస్ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ రేవంత్ సహా పలువురి నేతల వాహనాలను ముందుకు కదలినివ్వలేదు

Undavalli Arun Kumar: చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలి, ప్రజాప్రతినిధుల కేసులు వర్చువల్‌ కోర్టుల్లో విచారించాలి, మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్‌ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్ (High Court Gag order) ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్‌ఐఆర్‌ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.

Mahagathbandhan Manifesto: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు తీసుకువస్తాం, మేనిఫెస్టోను విడుదల చేసిన మహాఘట్ బంధన్ కూటమి, అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన చిరాగ్‌ పాశ్వాన్‌

Hazarath Reddy

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి శనివారం మేనిఫెస్టోను (Mahagathbandhan Manifesto) విడుదల చేసింది. తాము గనక అధికారంలోకి వస్తే.. మొదటి శాసనసభా సమావేశాల్లోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును తీసుకొస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Singh Surjewala) హామీ ఇచ్చారు

Advertisement

Khushbu Sundar Joins BJP: పదేళ్లలో మూడు పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన కుష్బూ సుందర్, కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శలు

Hazarath Reddy

తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, నటి కుష్బూ బీజేపీలో (Khushbu Sundar Joins BJP) చేరారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు కీలక బాధ్యతలు సైతం అప్పగించే అవకాశం ఉంది. ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన కుష్బూ (Khushbu) పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

TS-AP Bus Operations: తెలంగాణ-ఏపీ మధ్య బస్సు సర్వీసులకు లైన్ క్లియర్, 322 బస్సులను తగ్గించుకునేందుకు సిద్ధమైన ఏపీఎస్ఆర్టీసీ, రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం

Hazarath Reddy

తెలంగాణ-ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల విషయంలో (Interstate bus services) ఓ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ డిమాండ్‌ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆ రాష్ట్రానికి 322 బస్సులను (TS-AP Bus Operations) తగ్గించనుంది. లాక్‌డౌన్‌ ముందు వరకు ఏపీ నుంచి తెలంగాణకు రోజుకు 1,009 బస్సుల్ని ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నడిపింది. ఇకపై 687 బస్సులను మాత్రమే తిప్పనుంది. తెలంగాణ భూభాగంలో ఇంతకుముందు వరకు 2.65 లక్షల కి.మీ.లలో బస్సులను తిప్పగా ఇక నుంచి 1.61 లక్షల కి.మీ.కే పరిమితం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు త్వరలో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

Nizamabad MLC Election Result: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత ఘన విజ‌యం, పోటీ ఇవ్వలేకపోయిన ప్రత్యర్థి పార్టీలు, 824 ఓట్ల‌లో 728 ఓట్లను సాధించిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌లో (Nizamabad MLC Election Result) టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత విజ‌యం (Kalvakuntla Kavitha wins ) సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 824 ఓట్ల‌లో 823 ఓట్లు పోల‌య్యాయి. ఇందులో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వ‌చ్చాయి. మొత్తం ప‌ది ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది.

AP Local Body Elections Row: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణ నవంబర్‌ 2కి వాయిదా

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections Row) ఎప్పుడు నిర్వహిస్తారో తెలియచేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC)ని ఆదేశించింది. ఇందులో భాగంగా ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

Advertisement
Advertisement