రాజకీయాలు

Facbook Bans Raja Singh: ఫేస్‌బుక్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిషేధం, మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అభియోగం

Team Latestly

విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించటం పట్ల పలు రాజకీయ, సామాజిక పక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్క్ ఫేస్‌బుక్ ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ఖాతాను తమ ప్లాట్ ఫాంపై నిషేధించింది....

India-China Face Off: సరిహద్దు వద్ద దూకుడు పెంచిన భారత్, వ్యూహాత్మకంగా పలు కీలక స్థావరాలు స్వాధీనం, చైనా దళాలకు ఎదురుగా తరలుతోన్న భారత బలగాలు

Team Latestly

భారతదేశం తన స్థావరాలను బలోపేతం చేసుకోవడంతో పాటు దక్షిణ ఒడ్డున వ్యూహాత్మక పర్వత ఎత్తులను స్వాధీనం చేసుకోవడంతో, ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు కేవలం 300-500 మీటర్ల దూరంలో ఉన్నారని, దీంతో సరిహద్దు వద్ద తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది.....

PM Modi vs Chidambaram: ప్రధాని మోదీకి చిదంబరం చురక, 2013లో మోదీ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసిన మాజీ ఆర్థిక మంత్రి, ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ విమర్శ

Hazarath Reddy

దేశంలో జీడీపీ రేటు దారుణంగా పడిపోవడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ బీజేపీపై విమర్శల దాడి చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను తాజాగా పోస్ట్ చేసిన కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం తీవ్ర విమర్శలు (PM Modi vs Chidambaram) గుప్పించారు.

Power Subsidy Row: రైతులకు జగన్ సర్కారు శుభవార్త, అన్నదాతల అకౌంట్లోకే విద్యుత్ సబ్సిడీ మొత్తం, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై రైతుల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంపై రైతన్నల అజమాయిషీ పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసింది. ఇందులో భాగంగా ఇకపై సబ్సిడీ మొత్తాన్ని (Power Subsidy) నేరుగా రైతన్నల బ్యాంకు ఖాతాల్లో ( farmers’ bank accounts ) జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు రైతులు చెల్లిస్తూ వస్తున్నారు. ఇకపై ఆ బెంగ లేకుండా రైతుల ఖాతాలో జమ చేసిన తరువాతే ఆ డబ్బు డిస్కమ్‌లకు చేరుతుంది.

Advertisement

GDP Slump Row: జీడీపీ భారీగా పతనం..నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నాశనం, కేంద్రంపై విరుచుకుపడిన కాంగ్రెస్ పార్టీ, తొలిసారిగా 23.9 శాతం పతనమైన దేశ జీడీపీ

Hazarath Reddy

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసంలో దేశ జీడీపీ తొలిసారిగా 23.9 శాతానికి పతనమవడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలను (Congress Attacks Govt over GDP Slump) ఎక్కుపెట్టింది. దీనికి తోడు కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు (GDP Slum) పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఆగడం లేదు. జీడీపీ పతనంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది. నోట్ల రద్దుతో ఆర్ధిక వ్యవస్థ విచ్ఛిన్నం ప్రారంభమైందని (Ruining of economy began with demonetisation), ప్రభుత్వం ఆపై వరుసగా తప్పుడు విధానాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.

CM KCR on Pranab's Statesmanship: ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి, రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్న తెలంగాణ సీఎం

Team Latestly

ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలో కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని, కేసీఆర్ కు తెలంగాణ అంశమే తప్ప పోర్టు ఫోలియో అక్కరలేదని పేర్కన్నారని తెలియజేశారు....

Pranab Mukherjee Passes Away: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు! ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన 'దాదా', అధికారికంగా ధృవీకరించిన ఆయన కుమారుడు

Hazarath Reddy

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు....

Comprehensive Land Survey in AP: ఏపీలో జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే, భూ సర్వే పైలెట్‌ ప్రాజెక్టుపై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం వైయస్ జగన్, 2023 ఆగస్టు నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీలో భూ సర్వే పైలెట్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా.. జనవరి 1, 2021 నుంచి సమగ్ర భూ సర్వే (Comprehensive Land Survey in AP) చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2023, ఆగస్టు నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సమగ్ర భూ సర్వే వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి.. అక్కడికక్కడే వివాదాల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

Additional Revenue to AP Govt: జగన్ సర్కారు కొత్త ఎత్తుగడ, ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం, గ్రీన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం యాజమాన్యంతో మరోసారి చర్చలు

Hazarath Reddy

అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాల కోసం కొత్త ప్రయత్నాలను చేస్తూ సత్ఫలితాలను (Additional Revenue to AP Govt) రాబట్టుకుంటోంది. ఇందులో భాగంగానే ఏపీకి తాజాగా రూ.4,881 కోట్ల మేర అదనపు ఆదాయం (additional revenue) లభించింది. గత ప్రభుత్వం కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై మరోసారి చర్చలు జరపడం ద్వారా ఆ ఆదాయన్ని రాబట్టింది.

Shiv Sena MP Sanjay Raut: రాహుల్‌కి పగ్గాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ కనుమరుగు, సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, పార్టీని ప్రక్షాళన చేయాలని హితవు

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షఎన్నిక కోసం ఆరు నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్య సీనియర్ నేతలు అధ్యక్ష మార్పు రావాలంటూ లేఖ రాసి కాంగ్రెస్ పార్టీలో ముసలం రేపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌ సోనియా గాంధీకి 23 మంది ఆ పార్టీ సీనియర్‌ నేతలు లేఖ రాయడం పట్ల శివసేన ఎంపీ (Shiv Sena MP Sanjay Raut) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీని (Rahul Gandhi) పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా నిలువరిస్తే కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగవుతుందని ఆయన హెచ్చరించారు.

Monsoon Session 2020: ఎంపీలందరికీ కరోనా పరీక్షలు, వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని తెలిపిన స్పీకర్ ఓం బిర్లా, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు

Hazarath Reddy

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. సమావేశాల (Parliament Monsoon Session 2020) ప్రారంభానికి కనీసం 72 గంటల ముందు ఈ పరీక్షలు (MPs to Get COVID-19 Test Done 72 Hours Before) చేయించుకోవాలన్నారు. ఎంపీలు, మంత్రులతోపాటు సభలోకి వచ్చే అధికారులు, మీడియా ప్రతినిధులకు కూడా కరోనా పరీక్షలను తప్పనిసరి చేయాలన్నారు.సెప్టెంబరు 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన (Lok Sabha Speaker Om Birla) అధికారులతో సమావేశమయ్యారు.

PV Centenary Celebrations: పీవీ నరసింహారావుకు 'భారతరత్న' ప్రకటించాలి, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు పీవీ జ్ఞానమార్గ్‌గా పేరు పెట్టాలని నిర్ణయం

Team Latestly

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు పెట్టాలని...

Advertisement

Telangana: వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం, వచ్చే నెలలో జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపైనా చర్చించిన సీఎం, రేపు పీవీ ఉత్సవాలపై సమీక్ష

Team Latestly

కరోనా లాక్డౌన్ కారణంగా వీసీల నియామకాలకు సంబంధించి ఇప్పటికే జాప్యం జరిగిందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు....

Three Capitals Row: ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఝలక్, రాజధాని అంశంపై సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో పొడగింపు, వచ్చే నెల నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టం చేసిన న్యాయస్థానం

Team Latestly

గురువారం హైకోర్టులో విచారణ ఉండటంతో ఈరోజు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొని ఉండగా, చివరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కోను పొడగించేందుకే మొగ్గుచూపిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది....

CWC Meet: మళ్లీ సోనియాకే జై కొట్టిన కాంగ్రెస్ పెద్దలు, 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ నియామకం, ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ, 23 మంది రాసిన లేఖ నన్ను చాలా బాధించిందని తెలిపిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Hazarath Reddy

కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు కోసం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (Congress Working Committee Meet) ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశంలో ప్రస్తుతానికి సోనియా గాంధీనే (Sonia Gandhi) తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని పార్టీ ముఖ్య నేతలంతా సీడబ్ల్యూసీలో (CWC Meet) తీర్మానించారు. రాబోయే 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ను (New Congress President) ఎన్నుకోనున్నట్లు తెలిపారు.

HD Kumaraswamy: ఇది హిందీ ప్రభుత్వమా..భారత ప్రభుత్వమా, హిందీ రాకుంటే దేశం విడిచి వెళ్లాలా? ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార స్వామి, సౌత్ ఇండియాలో పెను దుమారం రేపుతున్న వైద్య రాజేష్ కోటేచా వ్యాఖ్యలు

Hazarath Reddy

తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా (AYUSH Secretary Vaidya Rajesh Kotecha) వ్యవహరించిన తీరు సౌత్ ఇండియాలో ఆగ్రహాన్ని రేపుతోంది. తాజాగా హిందీ రాకుంటే శిక్ష‌ణా కార్య‌క్ర‌మం నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటూ వ్యాఖ్య‌లు చేసిన రాజేష్ కోటేచాపై క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ( former Karnataka chief minister HD Kumaraswamy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హిందీ భాష రానంత మాత్రానా ఇత‌ర భాష‌ల వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలా అంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

CWC Meeting Highlights: మీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారు, సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఆగ్రహం,పెను ప్రకంపనలు రేపిన అధినాయకత్వ మార్పు లేఖ

Hazarath Reddy

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) భేటీ వేదికగా మరోసారి పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడ్డాయి. నాయకత్వ మార్పు కో​రుతూ సీనియర్‌ నేతలు లేఖ రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ పార్టీలో (Congress Working Committee) పెను ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) అనారోగ్య పరిస్థితులు, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌లో బీజేపీ సృష్టిస్తున్న అననుకూల పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదంటూ లేఖ రాసిన తీరును ఖండించారు.

Kerala Politics: కేరళ సీఎం పినరయిపై అవిశ్వాస తీర్మానం, చర్చకు ఆమోదం తెలిపిన స్పీకర్, అవిశ్వాసంపై చర్చించడానికి రెండు రోజులు సమయం కావాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

Hazarath Reddy

కేరళ సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ సోమవారం అవిశ్వాస తీర్మానాన్ని(UDF Moves No-confidence Motion) ప్రవేశపెట్టింది. పీకల్లొతు అవినీతిలో కూరుకుపోయారన్న విమర్శల నేపథ్యంలో ఎమ్మెల్యే వీడీ సతీషన్ (Congress legislator V D Satheeshan) పినరయి ప్రభుత్వంపై (Pinarayi Vijayan Govt) అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై చర్చించడానికి స్పీకర్ ఆమోదించారు. బంగారం స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో సీఎం పినరయ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Congress Working Committee Meet: అధ్యక్ష మార్పు లేఖ ప్రకంపనలు, కొత్త అధినేతను ఎన్నుకోవాలని కోరిన సోనియా గాంధీ, మీరే ఉండాలని కోరుతున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు

Hazarath Reddy

గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో అధ్యక్ష మార్పు జరగాలని చాలామంది కాంగ్రెస్ నేతలు తమ వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో గ‌త కొన్ని రోజులు వ‌స్తున్న ఊహాగానాల‌ను నిజం చేస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా (Sonia Gandhi Resignation) చేశారు. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో (Congress Working Committee Meeting) సోనియా గాంధీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు.

Kerala Assembly Session: రసవత్తరంగా కేరళ రాజకీయం, సీఎం పినరయి విజయన్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని తెలిపిన కాంగ్రెస్‌ పార్టీ, పదవి నుంచి వైదొలగాని డిమాండ్, ఆగస్టు 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

నిన్న మొన్నటిదాకా నార్త్ రాజకీయాలు రసవత్తరంగా సాగితే ఇప్పుడు సౌత్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యంగా కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం సీఎం పినరయి విజయన్ పీకల మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కేరళలో పినరయి విజయన్‌ సర్కార్‌ అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) పెట్టేందుకు రెడీ అయింది. ఈనెల 24న అసెంబ్లీ సమావేశాల్లో (Kerala Assembly Session on August 24) కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని ఆ పార్టీ నేత, విపక్ష నేత రమేష్‌ చెన్నితల (Ramesh Chennithala) శుక్రవారం స్పష్టం చేశారు.

Advertisement
Advertisement