రాజకీయాలు

Ban on Chinese Apps: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం, టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం, రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

Team Latestly

భారత్ లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుని, మంచి మార్కెట్ ను ఏర్పర్చుకున్న టిక్‌టాక్, వీచాట్, యూసి బ్రౌజర్‌లతో సహా 59 చైనీస్ యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

Pakistan Stock Exchange Attack: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై గ్రేనేడ్ దాడి, ఇద్ద‌రు మృతి, ముగ్గురికి గాయాలు, నలుగురు ఉగ్రవాదులు హతం, మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం

Hazarath Reddy

పాకిస్తాన్‌లో ఉగ్రమూకలు (Terror attack) మరోసారి రెచ్చిపోయాయి. దాయాది దేశంలోని క‌రాచీలో ఉన్న స్టాక్ మార్కెట్ బిల్డింగ్ వ‌ద్ద ఈ రోజు గ్రేనేడ్ దాడి (Pakistan Stock Exchange Attack) జరిగింది. ఇవాళ ఉదయం నలుగురు ఉగ్రవాదులు కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు (Terror attack in Karachi) జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతిచెంద‌గా మ‌రో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. కాల్పులకు తెగబడిన అనంతరం ఉగ్రవాదులు పాకిస్తాన్ స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోనే నక్కారు.

India-China Face-Off: చైనా ఆక్రమించకపోతే 20 మంది ఎలా అమరులయ్యారు? కేంద్రానికి సూటి ప్రశ్నను సంధించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నిజాలు దాస్తున్నదంటూ ఆరోపణలు

Hazarath Reddy

బార్డర్లో చైనా ఇండియా మధ్య వార్ (India-China Face-Off) నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కేంద్రాన్ని టార్గెట్ చేసింది. బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించింది. చైనా గనక భారత భూభాగాన్ని ఆక్రమించలేదన్న మాటే నిజమైతే.. 20 మంది భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో (Why Our Soldiers Were Martyred)చెప్పాలని కేంద్రానికి సూటి ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ సంధించింది. చైనాతో ఉన్న సరిహద్దులను కాపాడే విషయంలో కేంద్రం తప్పించుకోజాలదని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) పేర్కొన్నారు.

Manipur Political Crisis: మళ్లీ చక్రం తిప్పిన అమిత్ షా, మణిపూర్‌లో యూటర్న్ తీసుకున్న రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని ఎన్‌పీపీ నిర్ణయం, ట్విట్టర్ ద్వారా తెలిపిన హిమాంత బిశ్వ శర్మ

Hazarath Reddy

మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి (Manipur Political Crisis) వారం రోజుల క్రితం మద్దతు ఉపసంహరించుకొన్న ‘నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి (National People's Party) చెందిన నలుగురు శాసన సభ్యులు హుటాహుటిన మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం విదితమే. బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరపడం కోసమే వారు ఢిల్లీ వచ్చారని వార్తలు వచ్చాయి. అమిత్ షాతో సమావేశమైన ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు. మేఘాలయా ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా (Meghalaya Chief Minister Conrad Sangma) నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును కొనసాగించాలని నిర్ణయించిందని హిమాంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి వెల్లడించారు.

Advertisement

MP Raghu Rama Krishna Raju: అనుకున్నదే జరిగింది, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ నుంచి షోకాజ్ నోటీస్, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Hazarath Reddy

ఈ మధ్య ఏపీలో హాట్ టాఫిక్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వివాదానికి ఎవైసీపీ పార్టీ చెక్ పెట్టే దిశగా ఎట్టకేలకు అడుగులు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు (MP Raghu Rama Krishna Raju) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

'Ranneeti not Rajneeti' : దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజనీతి కాదు, రణనీతి కావాలి. దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదు; ప్రధానితో అఖిలపక్షం భేటీలో టీఎస్ సీఎం కేసీఆర్

Team Latestly

కరోనా వైరస్ కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశం నుంచి చాలా బహుళ జాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారతదేశంవైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమైనదని ప్రపంచ వ్యాప్తంగా భావిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142 వ స్థానం నుంచి 63వ స్థానానికి భారతదేశం ఎదిగింది...

Rajya Sabha Election Results 2020: టీడీపీకి భంగపాటు, ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ, దేశంలో 11 స్థానాలకు ఫలితాలు వెల్లడి

Hazarath Reddy

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు (AP Rajya Sabha Election Results 2020) ఏకపక్షంగా సాగాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ (YSRCP) తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి.

Rahul Gandhi 50th Birthday: 50వ వడిలోకి అడుగు పెట్టిన రాహుల్ గాంధీ, ఈ సారి పుట్టిన వేడుకలకు దూరంగా కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీ నేత (Congress President), సోనియా గాంధీ దివంగత రాజీవ్ గాంధీ ముద్దుల తనయుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం 50వ వడిలోకి (Rahul Gandhi 50th Birthday) అడుగుపెట్టారు. 1970 జూన్‌ 19న ఆయన జన్మించారు. ఈ సారి ఆయన వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా సంక్షోభంతోపాటు లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో చైనా, భారత్‌ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులు కావడంతో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఎలాంటి వేడుకలు జరుపవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అయితే ప్రజలకు సహాయంగా ఉండాలన్నారు.

Advertisement

Rajya Sabha Elections 2020: పెద్దల సభకు వెళ్లే పెద్దలు ఎవరు? రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం, దేశ వ్యాప్తంగా 19 సీట్లకు నేడు ఎన్నికలు, ఏపీలో నాలుగు స్థానాలకు పోలింగ్

Hazarath Reddy

రాజ్యసభ ఎన్నికలకు (2020 Indian Rajya Sabha elections) సర్వం సిద్ధమైంది. 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, గుజరాత్‌లో నాలుగు, జార్ఖండ్‌లో 2, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్‌లో 3, మణిపూర్, మేఘాలయలో ఒక్కో సీటుకు ఎన్నికలు జరగున్నాయి. మొత్తం 19 సీట్లకు ఈ రోజు ఎన్నికలు (Rajya Sabha Election 2020) జరగనున్నాయి.

Manipur Govt Trouble: బీజేపీకి తొలిసారి ఎదురుదెబ్బ, సంక్షోభంలో మణిపూర్ సర్కార్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు

Hazarath Reddy

దేశంలో బీజేపీకి తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలింది. ఈశాన్య భారతంలో సంకీర్ణ ప్రభుత్వంతో పాగా వేసిన బీజేపీ సర్కారు (BJP-led govt in Manipur) ఇప్పుడు పతన అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈశాన్య భారతంలోని మ‌ణిపూర్‌లో బీజేపీ (BJP)నేతృత్వంలోని సంకీర్ణ‌ స‌ర్కారు ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇతర రాష్ట్రాల్లో ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా ప్రభుత్వాలను ప‌డ‌దోసి అధికారంలోకి వ‌స్తున్న భారతీయ జ‌నతాపార్టీకి‌ మణిపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది.

Chintakayala Ayyanna Patrudu: టీడీపీకి మళ్లీ షాక్, బట్టలు ఊడదీస్తానని వార్నింగ్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

టీడీపీ నేతలకు (TDP Leaders) వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఘటనలు మరువక ముందే తెలుగుదేశం( Telugu desam Party) పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ (Vizag Munsipal Commissionar) తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై (Chintakayala Ayyanna Patrudu) నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు వెల్లడించారు.

AP Budget 2020-21 Highlights: రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్, రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం, బడ్జెట్‌లోని ప్రధాన అంశాల గురించి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం (AP CM YS Jagan Mohan Reddy) రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను (AP Budget 2020) ఏపీ ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (FM Buggana Rajendranath Reddy), మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Advertisement

Biswabhusan Harichandan: సీఎం వైయస్ జగన్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు, తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Session 2020) ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ (2020-21) సమావేశాలు సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ (Governor Biswabhusan Harichandan) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలిసారి ఆన్‌‌లైన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్‌భవన్‌ (Raj Bhavan) నుంచి గవర్నర్ ప్రసంగం చేశారు. గవర్నర్ మాట్లాడుతూ.. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP cM YS Jagan) నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.

AP Budget Session 2020: బడ్జెట్ సమావేశాలకు వేళాయెనే, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ, మండలిలోని ప్రతి సీటు శానిటేషన్‌, వెల్లడించిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Hazarath Reddy

ఏపీలో బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. ఏపీ బడ్జెట్‌ సమావేశాలపై (AP Budget Session 2020) స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమీక్షలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాసన మండలి చైర్మన్ షరీఫ్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్లు శ్రీనివాసులు, ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులు, పలు శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Indian Officials Missing in Pak: పాకిస్థాన్‌లో ఇద్దరు భారత దౌత్యాధికారులు మిస్సింగ్, అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన భారత్

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) ఇద్దరు భారత దౌత్యాధికారులు అదృశ్యం కావడం (Indian Officials Missing in Pak) కలకలం రేపుతోంది. పాక్ లోని ఇస్లామాబాద్‌లో (Islamabad in Pakistan) గల భారత హై కమిషన్‌లో పనిచేస్తోన్న ఆ ఇద్దరు అధికారులు ఒకేసారి కనపడకుండాపోయారని తెలుసుకున్న భారత్‌ దీనిపై స్పందింది. అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి వారు ఒక్కసారిగా అదృశ్యమైనట్లు తెలిసింది. ఇటీవలే న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌లో ఇద్దరు పాక్‌ అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Digvijaya Singh: దిగ్విజయ్‌ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు, సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై ఫేక్ వీడియో షేర్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై (Congress leader Digvijaya Singh) పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు(CM Shivraj Singh Chouhan) సంబంధించి ఎడిటెడ్‌ వీడియోను (Fake video) షేర్‌ చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై భోపాల్‌ పోలీసులు సోమవారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

ESI Medicine Scam: రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్‌ రవికుమార్‌

Hazarath Reddy

ఈఎస్‌ఐ కుంభకోణంలో (ESI Medicine Scam) ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ( Tekkali TDP MLA Atchannaidu) ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ (ACB) అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

AP SEC Row: నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడాన్ని ఏపీ హైకోర్టు (AP High Court) తప్పు పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లిన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బాబ్డే (chief justice S A Babde), జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది.

Sidda Raghava Rao joins YSRCP: ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్, వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కరణం బలరాం (Karanam Balaram) ప్రకంపనలు మరవక ముందే ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు (DP Ex-Minister Sidda Raghava Rao) బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSRCP) చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్‌ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (AP CM YS Jagan)వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

LG Overrules Delhi CM's Order: దిల్లీలో ఎక్కడివారికైనా వైద్యం అందించాల్సిందే! సీఎం కేజ్రీవాల్ ఆదేశాలను రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

Team Latestly

లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలపై దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులు తీవ్రతరం అవుతున్నందున దేశం నలుమూలల నుంచి దిల్లీకి వచ్చే రోగులకు చికిత్సను అందించడం అనేది అతిపెద్ద సవాలు లాంటిది. దీనివల్ల....

Advertisement
Advertisement