రాజకీయాలు
TDP MLA Karanam Balaram: వైసీపీలోకి 10 నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుతో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
Hazarath Reddyటీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం (TDP MLA Karanam Balaram) తెలుగుదేశం పార్టీ మీద, దాని అధినేత మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము టీడీపీ అధినేత చంద్రబాబుతో (TDP Chief Chandrababu) ) ఎంతకాలం నుంచి ఉన్నామో అందరికీ తెలుసని, ఎంత ఇబ్బంది పడ్డామో కూడా తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వైఖరికి, జగన్ వ్యవహారశైలికి ఎంతో తేడా ఉందని, జగన్ (YS Jagan) తనను నమ్మినవాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తాడని స్పష్టం చేశారు. జగన్ తండ్రి వైఎస్ తోనూ తమకు సన్నిహిత సంబంధాలుండేవని కరణం గుర్తుచేసుకున్నారు.
Vijay Mallya: లిక్కర్ కింగ్‌ను ఇప్పట్లో ఇండియాకు పంపలేం, విజయ్ మాల్యా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపిన యూకే ప్రభుత్వం
Hazarath Reddyలిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను (Vijay Mallya) భారత్‌కు అప్పగించే విషయంలో యూకే ప్రభుత్వం (UK Govt) ఊహించని మెలిక పెట్టింది. ఇంకా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదనీ.. పెండింగ్‌లో ఉన్న సమస్య పూర్తయ్యే వరకు మాల్యాను భారత్‌కు పంపలేమని బ్రిటిష్ హైకమిషన్ (British High Commission) పేర్కొంది. చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది.
Gandhi Statue Vandalised: అమెరికాలో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ధ్వంసం, క్షమాపణలు కోరిన అమెరికా, ఆర్మీని రంగంలోకి దింపుతామని తెలిపిన ట్రంప్
Hazarath Reddyగత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు (Ongoing Protests in US) మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సెగ ఇండియా మహత్ముడికి (Mahatma Gandhi) కూడా తగిలింది. అమెరికాలో ఆందోళ‌న‌కారులు మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం (Gandhi Statue Vandalised) చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని ఇండియ‌న్ ఎంబ‌సీలో ఉన్న గాంధీ విగ్ర‌హాన్ని న‌ల్ల‌జాతీయులు ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ నిర‌స‌న‌కారులు ఈ విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్న‌ది.
Dr Sudhakar Case: డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన సీబీఐ
Hazarath Reddyఈ మధ్య కాలంలో ఏపీలో పలు సంచలనాలు, వివాదాలకు కారణమైన కేసుల్లో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు (Dr Sudhakar Case) ఒకటి. ఆయన వివాదాస్పద వ్యవహారశైలి తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు (AP High Court) సీబీఐకి అప్పగించింది. కాగా కేసు సీబీఐ (CBI) దగ్గర కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
Rajya Sabha Polls: వైసీపీతో పోటీకి సై అంటున్న టీడీపీ, ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు 19న ఎన్నికలు, దేశ వ్యాప్తంగా 24 రాజ్యసభ స్థానాలకు అదే రోజు పోలింగ్
Hazarath Reddyదేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు (Rajya Sabha Polls) జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (EC) సోమవారం ప్రకటించింది. వీటిలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానాలు 18 ఉండగా.. మిగిలిన ఆరు స్థానాలు తాజాగా ఖాళీ అయ్యాయి. వీటన్నింటికి కలిపి ఎన్నికలు జరుగనున్నాయి. వాస్తవానికి మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. కాగా, 55 స్థానాలకు 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
TRS vs Congress: వేదికపైనే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గలాట, నల్గొండలో రసాభాసగా మారిన వానాకాలం పంటల వ్యవసాయ ప్రణాళిక సన్నాహక సమావేశం
Hazarath Reddyఆదివారం నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన నియంత్రిత సాగు సన్నాహక సమావేశంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Jagadish Reddy vs Uttam Kumar Reddy) మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువురూ వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో ఆదివారం నల్లగొండ కలెక్టరేట్‌లో జరిగిన వానాకాలం పంటల వ్యవసాయ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది.
AP Lockdwon 5.0: చంద్రబాబు,నారా లోకేశ్‌లపై కేసు నమోదు, లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన ఓ న్యాయవాది, వారిద్దరితో పాటు మరికొందరిపై కేసులు
Hazarath Reddyకోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు(COIVD-19) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను (Lockdown) విధించిన సంగతి తెలిసిందే. ఆ లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రధానంగా భౌతికదూరం, మాస్కుల వినియోగం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను చంద్రబాబు, లోకేశ్‌లు ఉల్లంఘించారంటూ (violating lockdown rules) ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
Borewell Death: నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలి, బోరుబావిలో పడిన బాలుడు ఆక్సిజన్ అందక మృతి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలింపు
Hazarath Reddyమెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడిన బాలుడు (Boy Falls Into Borewell) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోరు బావిలోపడిన సంజయ్‌ సాయి వర్దన్‌‌ని ప్రాణాలతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. 120 అడుగుల లోతు వేయించిన బోరు బావిలో 17 అడుగుల వద్ద బాలుడి మృతదేహం (Borewell Death) లభ్యమైంది.
TDP Mahanadu: వైయస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, టీడీపీ మహానాడులో విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు, టీడీపీ కార్యాలయానికి కోవిడ్ 19 నోటీసులు పంపించిన ఏపీ సర్కారు
Hazarath Reddyతొలిరోజు సమావేశంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులు, ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తలకు మహానాడు వేదిక ద్వారా తమ సంతాపం తెలియజేశారు.
Maharashtra Politics: మళ్లీ రసకందాయంలో 'మహా' రాజకీయాలు, రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్, మాతోశ్రీలో శరద్ పవార్ & సిఎం ఉద్ధవ్ థాకరే భేటీ
Hazarath Reddyదేశంలో ఓ వైపు కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయాలు (Maharashtra Politics) రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు ఒకరినొకరుపై విమర్శలు సంధించుకుంటున్నారు. ముంబైలో కోవిడ్ 19 (Mumbai Covid 19) కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ స్థిరత్వంపై సందేహాలు వ్యక్తం చేసినందుకు శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ మంగళవారం ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
N. Chandrababu Naidu: 65 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబునాయుడు, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రతిపక్షనేత
Hazarath Reddyఏపీ ప్రతిపక్ష నేత ఎన్‌.చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu), ఆయన కుమారుడు లోకేష్‌ ఎట్టకేలకు అమరావతికి (Amaravati) చేరుకున్నారు. సుమారు 65 రోజుల తర్వాత వీరిద్దరూ ఎపిలో కాలుపెట్టారు. అంతకుముందు వీరిద్దరూ హైదరాబాద్‌ వెళ్లగా కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ (Lockdown) ప్రకటించారు. దీంతో వీరు అక్కడే చిక్కుకొని పోయారు. లాక్‌డౌన్‌ నాలుగో దశలో (Lockdwon 4) వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుని పోయిన ప్రజలు సొంతూళ్లు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో చంద్రబాబు, లోకేష్‌ కూడా హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్నారు.
Social Media Crimes: టిక్‌టాక్ వీడియోలు మహిళలపై అత్యాచారాలు, ఆసిడ్ దాడులను ప్రోత్సహిస్తున్నాయి; లాక్డౌన్ కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగాయన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్, సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
Team Latestlyనేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్‌పర్సన్ రేఖ శర్మ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. టిక్‌టాక్‌ ను దేశం నుంచి పూర్తిగా నిషేధించాలని చెప్పారు. ఈ చైనీస్ యాప్ దేశంలోని యువతను ఎందుకూ ఉపయోగంలేని జీవితం వైపు నెట్టివేస్తుందని అన్నారు...
Package a 'Cruel Joke': రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ క్రూరమైన జోక్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ
Hazarath Reddyవిపక్షాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ .20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన దేశంపై విధించిన "క్రూరమైన జోక్" (Rs 20 Lakh Crore Package a Cruel Joke) అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) శుక్రవారం సంయుక్త ప్రతిపక్ష సమావేశంలో అన్నారు.
Madhya Pradesh Coronavirus: పెళ్లయిన 2 రోజులకు పెళ్లికూతురుకు కరోనా, పెళ్లి కొడుకుతో సహా బంధువులంతా క్వారంటైన్‌లోకి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘటన
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి ఆగడం లేదు, కరోనా దెబ్బకు అన్నీ పనులు వాయదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మధ్య ప్రదేశ్ లో (Madhya Pradesh) ఓ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన రెండు రోజుల‌కే ఓ యువ‌తికి క‌రోనా (Newly married bride tests positive for covid-19) ఉన్న‌ట్లు తేలింది. దీంతో అటు వ‌ధూవ‌రుల‌ కుటుంబాల‌తోపాటు పెళ్లికి వ‌చ్చిన బంధువుల్లోనూ క‌ల‌వ‌రం మొద‌లైంది.
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్ ఎత్తివేసిన ఏపీ హైకోర్టు, వెంటనే ఆయన్ని విధుల్లోకి తీసుకోండి, సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించండి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ
Hazarath Reddyఏపీ ప్రభుత్వానికి (AP Govt) ఇవాళ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావుపై (AB Venkateswara Rao) ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు (AP high court) ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. వెంకటేశ్వరరావు రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటుగా వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
Aatma Nirbhar Bharat Package-4: బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ గుత్తాధిపత్యం తొలగింపు, రక్షణలో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతానికి పెంపు, ప్రైవేటుకు మరో 6 విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి నిర్మల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ-4 ముఖ్యాంశాలు
Team Latestlyప్రధాని ప్రకటించిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటివరకు వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇలు, భారీ తరహా పరిశ్రమలు, కార్మిక-ఇంటెన్సివ్ రంగాలతో సహా భారతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ అంశాలన్నింటి గురించి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ఇక చివరి విడతగా ఈ ప్యాకిజీలో మిగిలిన అంశాలను....
Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరే సీఎం పదవి సేఫ్, ఏకగ్రీవంగా మండలికి ఎన్నికైన మహారాష్ట్ర సీఎం, ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక
Hazarath Reddyమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Maharashtra CM Uddhav Thackeray) శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) తన రాజకీయ జీవితంలో శాసన సభ్యుడిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి.
Krishna Water Row: మా నీళ్లను మేము తీసుకుంటున్నాం, దీనిపై రాజకీయాలు చేయడం తగదు, కృష్ణా జ‌లాల అంశంపై స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికి అక్కడ ప్రాజెక్టు కట్టుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. దీన్ని రాజ‌కీయం ( (Krishna Water Row) చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని వ్యాఖ్యానించారు. తన నివాసంలో ఇరిగేష‌న్ అధికారుతో స‌మావేశ‌మైన ఏపీ సీఎం కృష్ణా జ‌లాల అంశంపై పలు విషయాలను వెల్లడించారు. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి దాపురించింద‌న్నారు. ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల‌న్నారు
Water Tussle: ఏపీ సీఎం జగన్ చర్యపై టీఎస్ సీఎం కేసీఆర్ ఆగ్రహం, ఎత్తిపోతల పథకంపై ఏపీ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని వ్యాఖ్య, వెంటనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశం
Team Latestlyగతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపికి స్నేహహస్తం అందించింది, అయినప్పటికీ....
Telangana: ఇతర రాష్ట్రాల నుంచి 'వలస' వస్తున్న కరోనావైరస్, తెలంగాణలో 1200లకు చేరువైన కోవిడ్-19 బాధితులు, గత 24 గంటల్లో కొత్తగా మరో 33 పాజిటివ్ కేసులు నమోదు
Team Latestlyఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. యితే ఇటీవల జరిగిన తెలంగాణ కేబినేట్ భేటి తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ కొన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు....