Politics
Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం, ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. గుంటూరులో మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు.
Andhra Pradesh Elections 2024: ప్రజాశాంతి పార్టీకి కుండ గుర్తును కేటాయించిన ఈసీ, తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేఏ పాల్
Hazarath Reddyరానున్న ఎన్నికల్లో కే ఏ పాల్ అధ్యక్షుడుగా ప్రజాశాంతి పార్టీకి 'కుండ' గుర్తు ను కేటాయించింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో తన పార్టీ కార్యాలయంలో 'కుండ' ను కేఏ పాల్ ప్రదర్శించారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధినేత ఈరోజు తనదైన శైలిలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
BRS MLC Kavitha Arrested: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన సీబీఐ, మధ్యాహ్నం తరువాత వాదనలు వింటామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyమద్యం పాలసీ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్టు చేసిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె కవితను శుక్రవారం ఉదయం రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను ఐదు రోజుల కస్టోడియల్ రిమాండ్ కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.
Andhra Pradesh Elections 2024: కొడుమూరులో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి
Hazarath Reddyఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్న కొడుమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పోటీలో ఉన్నారు.
Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడటానికి ప్రపంచంలోని తెలుగువాళ్లంతా తండోపతండాలుగా వస్తారు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలా వస్తున్నారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడడానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక టూర్ లాగా వస్తారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఎంతో దూరంలో లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు బీఆర్‌ఎస్ నేత కేటీ రామారావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ చేశారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఒంగోలులో ఘోరంగా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలినేని
Hazarath Reddyఒంగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఘోరంగా కొట్టుకున్నారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ చేరుకోగా.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరుపార్టీల కార్య కర్తలను చెదరగొట్టి, గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై నారా లోకేష్ ట్వీట్ చేశారు.
CBI Arrests Kavitha: తీహార్‌ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించింది.. కోర్టుకు కూడా తెలిపింది.
Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పాలన సూపర్ అంటున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమం అంటూ కితాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయాల రూపంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవస్థ‌ను తీసుకొచ్చారంటూ కితాబిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని వైఎస్సార్సీపీ తన ఎక్స్ లో షేర్ చేసింది. మళ్లీ వచ్చేది జగనే అంటూ క్యాప్షన్ జోడించింది.
Andhra Pradesh Elections 2024: హిందూపురంలో వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌
Hazarath Reddyవైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోబుధవారం టీడీపీలో చేరారు. ఇక్బాల్ కు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
Andhra Pradesh Elections 2024: వాలంటీర్ల పేర్లు వింటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి, పల్నాడు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyమనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోందన్నారు.ప్రతిపక్షాలు జిత్తులమారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయంటూ సీఎం మండిపడ్డారు. జిత్తుల మారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Khagen Murmu Kissing Controversy: ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన బీజేపీ ఎంపీ, మోదీ పరివార్‌ ఇదేనంటూ విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన టీఎంసీ, ఘటనపై ఎంపీ ఏమన్నారంటే..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓ బీజేపీ ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి యువతి బుగ్గపై ముద్దు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ న్యూస్ లోకి వెళ్తే.. బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ (Khagen Murmu) పోటీ చేస్తున్నారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జై చంద్రబాబు అనకుండా జై జగన్ అనేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక్కసారిగా షాక్ తిన్న తెలుగుదేశం కార్యకర్తలు
Hazarath Reddyకర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. రోడ్ షోలో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు..చివర్లో ఓట్లు వేయాలని అభ్యర్థించి జై చంద్రబాబు అనబోయి జై జగన్ అనేశారు. తర్వాత పొరపాటును గమనించి సరిదిద్దుకున్నారు
Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు
Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన పోతిన మహేష్, విజయవాడ వెస్ట్‌లో జనసేనకు బిగ్ షాక్, వీడియో ఇదిగో..
Hazarath Reddyజనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇంఛార్జ్ పోతిన మహేష్ ఈరోజు జగన్ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనకు షాక్‌ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్‌ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే.
Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ సబబేనని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. లిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్‌ కోర్టు కస్టడీకి ఇవ్వడం అక్రమమని కేజ్రీవాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది
Lok Sabha Elections 2024: సీఈసీ రాజీవ్‌కుమార్‌కు జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ, రక్షణగా 40 నుంచి 45 మంది సీఆర్పీఎఫ్‌ కమాండోలు
Hazarath Reddy2024 లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఎన్నికల వేళ ఆయనకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదిక ఆధారంగానే భద్రత పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి
Delhi Excise Policy Case: నన్ను భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు, తీహార్‌ జైలు నుంచి నాలుగు పేజీల లేఖను విడుదల చేసిన కవిత
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మనీలాండరింగ్‌ అభియోగాలపై అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీహార్‌ జైలు నుంచి నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో కోర్టుకు వచ్చిన ఆమెను స్పందించాల్సిందిగా మీడియా కోరగా.. తాను చెప్పదల్చుకున్న విషయాల్ని ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని ఆమె అన్నారు.
Delhi Excise Policy Case: కవితకు కోర్టులో దక్కని ఊరట, జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ 14 రోజుల కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశ పెట్టారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో గృహప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్న జనసేనాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే స్థానికంగా ఓ ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటానని పవన్ ప్రకటించారు. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం గృహప్రవేశం చేశారు