Politics

Arvind Kejriwal’s First Reaction: అరెస్ట్ తర్వాత తొలిసారిగా స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, జైలులో ఉన్నా బయట ఉన్నా నా జీవితం దేశానికే అంకితమని వెల్లడి

Hazarath Reddy

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో హాజరుపరిచారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ తర్వాత ఆయన తొలిసారి మాట్లాడారు. ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటానని పేర్కొన్నారు.తన జీవితం దేశానికి అంకితం (My Life Dedicated To Nation) అని అన్నారు.

Order of the Druk Gyalpo: ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు అంకితమన్న ప్రధాని మోదీ, భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచిన భారత పీఎం

Hazarath Reddy

భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో' అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేశారు. శుక్రవారం భూటాన్ రాజు చేతుల మీదుగా ప్రధాని మోదీ అవార్డును అందుకున్నారు.

Ponmudy Sworn as TN minister: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొన్ముడి, సుప్రీంకోర్టు అక్షింతలతో దిగి వచ్చిన తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తమిళనాడుకు చెందిన డీఎంకే నేత పొన్ముడి ఎట్టకేలకు మంత్రిగా ప్రమాణం చేశారు.పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సుప్రీంకోర్టు అక్షింతలతో దిగి వచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు

Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు, ఈడీ 10 రోజుల కస్టడీ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు

Hazarath Reddy

ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను 10 రోజుల కస్టోడియల్ రిమాండ్ కోరుతూ ED దరఖాస్తుపై ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. ఆర్డర్ త్వరలో ఆమోదించబడుతుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీని నిన్న ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ ప్రధాని సూత్రధారి, 10 రోజుల‌పాటు క‌స్ట‌డీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరిన ఈడీ

Hazarath Reddy

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తీవ్ర ఆరోపణలు చేసింది, మద్యం వ్యాపారుల నుండి కిక్‌బ్యాక్ డిమాండ్ చేయడంలో కీలక కుట్రదారుగా, కింగ్‌పిన్‌గా అతని ప్రమేయం ఉందని ఆరోపించింది.

Delhi Excise Policy Case: వీడియో ఇదిగో, రౌస్‌ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపర్చిన ఈడీ, తీర్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ

Hazarath Reddy

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీని నిన్న ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Delhi Excise Policy Case: అరవింద్ కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించండి, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు, కేసుపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ

Hazarath Reddy

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో పిల్ (PIL in Delhi High Court ) దాఖలైంది. కోర్టు వర్గాల ప్రకారం, పిటిషన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి.

BJP 4th Candidate List: లోక్‌సభ ఎన్నికలు, నాలుగో జాబితాను విడుదల చేసిన బీజేపీ, ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌కు విరుద్‌నగర్‌ టికెట్‌

Hazarath Reddy

బీజేపీ నాలుగో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు నుంచి 14 స్థానాలకు, అలాగే.. పుదుచ్చేరి నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. బీజేపీ మూడో జాబితా గురువారం రిలీజ్‌ కాగా.. 9 మంది లిస్ట్‌లో కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌తో పాటు బీజేపీ స్టేట్‌ చీఫ్‌ అన్నామలైతో పాటు తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసైకి కూడా టికెట్‌ కేటాయించారు.

Advertisement

Telangana Elections 2024: నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, ఇప్పటివరకు ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదిగో..

Hazarath Reddy

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్‌ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు.

Anna Hazare on Arvind Kejriwal's Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అన్నా హజారే, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పి ఇప్పుడు అదే కేసులో అరెస్ట్ అవ్వడం బాధగా ఉందని వెల్లడి

Hazarath Reddy

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిరాశను వ్యక్తం చేస్తూ, "నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మద్యం పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డాను" అని పేర్కొన్నారు.

Arvind Kejriwal Arrested: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ, మద్దతు ప్రకటించిన ఇండియా కూటమి

Hazarath Reddy

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం పాలసీతో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన సంగతి విదితమే. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు ఆప్ నేత గోపాల్ రాయ్ ప్రకటించారు.

Delhi Excise Policy Case: బెయిల్ కోసం ముందు ట్రయల్ కోర్టుకు వెళ్లండి, కవితకు సుప్రీంకోర్టు సూచన, ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసులు జారీ

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో (Supreme Court) నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: దేవినేని ఉమాకు షాకిచ్చిన చంద్రబాబు, గంటాకు మళ్లీ నిరాశ, టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల, పెండింగులో 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు

Hazarath Reddy

టీడీపీ (TDP) అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు, 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థుల ప్రకటన

Hazarath Reddy

లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది.

Delhi Excise Policy Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటి వద్ద హైటెన్షన్‌, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్, ఆప్ అధినేత సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు

Hazarath Reddy

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు. సుమారు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈడీ తనిఖీల నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు.

BJP Third Candidate List: చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, బీజేపీ మూడో జాబితా ఇదిగో..

Hazarath Reddy

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌లకు భార‌తీయ జ‌న‌తా పార్టీ మూడో జాబితా విడుద‌ల చేసింది. త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ అధికారికంగా విడుద‌ల చేసింది.

Advertisement

Delhi Excise Policy Case: ఈడీ అరెస్ట్‌ నుంచి మినహాయింపు ఇవ్వలేం, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 22వ తేదీకి వాయిదా

Hazarath Reddy

లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు షాక్‌ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అరెస్ట్‌ చేయకుండా ఆదేశించలేమని చెప్పింది. ఈడీ అరెస్ట్‌ నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

Viksit Bharat WhatsApp Message Row: మోదీ సర్కారుకు ఎన్నికల సంఘం షాక్, పౌరుల వాట్సాప్‌కు వికసిత్‌ భారత్‌ మెసెజ్‌లు పంపడం తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల ముందు మోదీ సర్కారుకు భారత ఎన్నికల సంఘం షాక్‌‌ ఇచ్చింది. ‘వికసిత్‌ భారత్‌’ పేరుతో కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్‌ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్‌కు వికసిత్‌ భారత్‌ మెసెజ్‌లు పంపడం తక్షణమే ఆపేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది

Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కీలక నేత మాకినీడి శేషు కుమారి

Hazarath Reddy

కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement
Advertisement