One Nation-One Pay Day: ఇక జీతాల ఆలస్యం జరగదు, దేశమంతటా ఉద్యోగస్తులందరికీ ఒకే రోజు జీతాలు చెల్లించేలా 'ఒకే దేశం- ఒకే రోజున వేతనం' పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న మోదీ సర్కార్

దేశవ్యాప్తంగా గల 23 కోట్ల మంది రేషన్ కార్డు దారులందరికీ లబ్ది చేకూరేలా జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా....

One Nation - One Pay Day| Representational Image | (Photo Credit: File)

New Delhi, November 20:  ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రెండు భారీ పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో ఒకటి జీతాల చెల్లింపునకు సంబంధించిన 'ఒకే దేశం- ఒకే రోజున వేతనం' (One Nation One Pay Day) పథకం కాగా, మరొకటి రేషన్ కార్డుకు సంబంధించిన పథకం.

దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో పనిచేసే ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించబడేలా ఏకరీతి చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రధాని ఆసక్తి చూపుతున్నారని, కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ (Santosh Gangwar) వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక చట్టం త్వరలోనే ఆమోదించబడవచ్చు అని మంత్రి అన్నారు. అదేవిధంగా, కార్మికుల మెరుగైన జీవిన విధానం కొరకు కనీస వేతనాన్ని (minimum wage) కూడా సవరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఉద్యోగ భద్రత, ఆరోగ్యం మరియు పనిచేసే పరిస్థితులకు సంబంధించి (OSH) కోడ్ ను ఈ ఏడాది జూలై 23, 2019న ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ కోడ్ ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇక దీనిని అమలు చేసేందుకు విధివిధానాలు ఖరారు చేస్తున్నట్లు మంత్రి గంగ్వార్ తెలిపారు.

ఈ కోడ్ అమలులోకి వస్తే ప్రైవేట్ రంగం మరియు కార్పోరేషన్ కింద పనిచేసే ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. దీని ప్రకారం ఉద్యోగంలో చేరేటపుడు తప్పనిసరిగా అపాయింట్ మెంట్ లెటర్ ఇవ్వటంతో పాటు ఉద్యోగ భద్రత, ఉచిత మెడికల్ చెకప్స్, మెరుగైన వర్కింగ్ కండిషన్స్ తదితర అంశాల్లో విస్తృతమైన కవరేజీ ఉద్యోగికి లభించనుంది.

ఇక మరొకటి, దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డ్ (One Nation- One Ration Card) విధానాన్ని కూడా అమలు చేసే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా గల 23 కోట్ల మంది రేషన్ కార్డు దారులందరికీ లబ్ది చేకూరేలా జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన రేషన్ వస్తువులు అందించే విధానం అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని కేంద్ర ఆహార మంత్రి రామ్‌విలాస్ పాస్వాన్ తెలిపారు.



సంబంధిత వార్తలు

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌