Makar Sankrathi 2022: తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల, ట్వీట్ల ద్వారా సందేశాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, జగన్, చంద్రబాబు సందేశాలు...

ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ సహా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి తదితరులు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Happy Pongal (File Image)

తెలుగు రాష్ట్రాలు, సంక్రాంతి కళతో శోభాయమానంగా మారాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా.. కుటుంబాలతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతటి ఆనందకర సమయాన్ని.. ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మరింత ప్రత్యేకంగా మారుస్తున్నారు. భోగి మంటల్లో కరోనా కష్టాలు మాడిపోవాలని.. ప్రజలంతా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ సహా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి తదితరులు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif