CM KCR Bathukamma Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు.. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి

తెలంగాణ పూలపండుగ బతుకమ్మ ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Bathukamma Telugu Messages (11)

Hyderabad, Oct 22: తెలంగాణ (Telangana) పూలపండుగ బతుకమ్మ (Bathukamma) ముగింపు చివరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ను పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు. దేవీదేవతలను అర్చించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవటం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞతాభావనను తెలియజేస్తాయని చెప్పారు.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ 

నిండైన బతుకమ్మ

సబ్బండ వర్గాలు సమిష్ఠిగా జరుపుకొనే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు. పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, ప్రకృతి వనరుల సమృద్ధితో నేడు తెలంగాణ నిండైన బతుకమ్మను తలపిస్తున్నదని వెల్లడించారు. బతుకమ్మల నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థించారు.

AP Govt. Good News: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఉద్యోగుల డీఏను 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం.. 2022 జులై 1వ తేదీ నుంచి అమలు



సంబంధిత వార్తలు