Dasra 2023 Wishes: దసరా శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు ఇలా చెప్పేయండి...Facebook, Whatsapp స్టేటస్‌గా బెస్ట్ గ్రీటింగ్ కొటేషన్స్ మీ కోసం..
మహిషాసుర విజయానికి గుర్తుగా అశ్వమేధ యాగం తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు.
విజయదశమి పండుగ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. మహిషాసుర విజయానికి గుర్తుగా అశ్వమేధ యాగం తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. దుర్గామాత విజయానికి ప్రతీక. ఈ రోజున, ప్రజలు దుర్గా దేవి పట్ల తమ భక్తిని చాటుకుంటుారు. అలాగే విజయదశమి సందర్భంగా రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఈ పండుగను ఆనందంగా వేడుకగా జరుపుకుంటారు. దసరా సామాజిక సామరస్యానికి మరియు మంచి పనులను ప్రోత్సహించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది.
విజయ దశమి సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
మీకు మీ కుటుంబ సభ్యులకు ధైర్యం, విజయం చేకూర్చాలని ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు
ఈ దసరా శరన్నవరాత్రుల సమయాన అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు
అమ్మవారి కృప, ఆశీస్సులు మీవెంట ఎల్లకాలము వుండాలని కోరుకుంటూ, మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు
దసరా పండగ సందర్భంగా మీకు,మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని,ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ విజయదశమి మహోత్సవ శుభాకాంక్షలు.
చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ ఈ దసరా పండగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకొంటూ దసరా నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు.