Father's Day Wishes: హ్యాపీ ఫాదర్స్ డే కోట్స్, వేలు పట్టుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి

నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి.

Fathers day telugu

పితృ దినోత్సవ శుభాకాంక్షలు: అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే.. నాన్న ఆ బిడ్డకు జీవితాన్ని అందిస్తారు. వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు.

జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డల ఎదుగుదలను మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను ఏడాదిలో ఒక్కసారైనా గౌరవించడం మన బాధ్యత.

వేలు పట్టుకుని లోకాన్ని చూపించే నాన్నకు వందనం, అందరికీ పితృ దినోత్సవం శుభాకాంక్షలు, ఫాదర్స్ డే విషెస్ , కోట్స్, వాట్సప్ మెసేజెస్ మీకోసం

అందుకే ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ‘ఫాదర్స్ డే’ను (Father’s Day 2021) నిర్వహిస్తున్నారు. ఈ మెసేజెస్ ద్వారా నాన్నకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.

Fathers day telugu

అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వెలిబుచ్చుతుంది. కానీ, నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు

Fathers-Day-2022

నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కానీ, అపజయం మాత్రం ఉండదు. హ్యాపీ ఫాదర్స్ డే.

Fathers day

అమ్మది నమ్మకం.. నాన్నది కోపం, అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే..నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది. హ్యాపీ ఫాదర్స్ డే.

Father's-Day-Image

నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యేనాటికి..మన మాటలు తప్పుపట్టే కొడుకులు సిద్ధమవుతుంటారు. హ్యాపీ ఫాదర్స్ డే.

Fathers day telugu

నాన్నా.. నా మొట్టమొదటి గురువు, నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.. హ్యాపీ ఫాదర్స్ డే.

 

Fathers day telugu

మన ముందు కఠినంగా ఉండే నాన్న బయట వారితో మన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు..ఫాదర్స్ డే శుభాకాంక్షలు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif