Padma Awards 2020: తెలుగు రాష్ట్రాలకు 5 పద్మ అవార్డులు, ఏడు మందికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118మందికి పద్మ శ్రీ అవార్డులు, భారత గణతంత్ర దినోత్సవం రోజున పురస్కారాలు అందుకున్న వారి మొత్తం లిస్ట్ ఇదే

71వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు (71st Republic Day) కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను (Padma Awards) నేడు అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషణ్, (Padma Vibhushan) 16 మందికి పద్మ భూషణ్,(Padma Bhushan) 118మందికి పద్మ శ్రీ అవార్డులు (Padma Shri Awards) ప్రకటించారు.

Government announces 141 Padma Awards for this year on occasion of 71st Republic Day (Photo-Twitter)

New, Delhi, January 26: 71వ  భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు (71st Republic Day) కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సామాజిక సేవలో భాగంగా పలువురికి ఈ అవార్డులను (Padma Awards) నేడు అందజేయనున్నారు. ఏడుగురు పద్మ విభూషణ్, (Padma Vibhushan) 16 మందికి పద్మ భూషణ్,(Padma Bhushan) 118మందికి పద్మ శ్రీ అవార్డులు (Padma Shri Awards) ప్రకటించారు.

వీరిలో రెండు దశాబ్దాలుగా పేదవారికి ఉచిత భోజనం పెడుతున్న జగదీశ్ లాల్ అహూజా, దివ్యాంగులకు రెండు దశాబ్దాలుగా సాయం అందిస్తున్న జావేద్ అహ్మద్ తక్, 25సంవత్సరాలుగా అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహిస్తున్న మొహ్మద్ షరీఫ్(చాచా షరీఫ్) వంటి వారు ఉన్నారు. ఈయన దాదాపు 25వేల శవాలకు మతాల బట్టి అంత్యక్రియలు పూర్తిచేశాడు.

ఇండియా వైభవాన్ని విశ్యవ్యాప్తం చేసిన గూగుల్ డూడుల్

జావేద్ అహ్మద్ తక్ వెన్నెముకకు చికిత్స చేయించుకుని రెండు దశాబ్దాలుగా వీల్ చైర్ లోనే కాలం వెల్లదీస్తున్నాడు. అయినప్పటికీ దివ్యాంగులకు రెండు దశాబ్దాలుగా సాయం అందిస్తున్నాడు.

Republic Day 2020 Greetings కోసం క్లిక్ చేయండి 

ఇక మరో హీరో జగదీశ్ లాల్ అహూజా(లంగర్ బాబా) ఎటువంటి లాభాపేక్ష లేకుండా రెండు దశాబ్దాల నుంచి పేదవారికి ఉచిత భోజనం పెడుతున్నాడు. ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు దుప్పట్లు, బట్టలు ఇస్తున్నాడు. భారతదేశానికి వట్టి చేతులతో వలస వచ్చి బిలీయనీర్ గా ఎదిగాడు. ఆస్తులు అమ్మి పేదలకు సేవ చేస్తున్నాడు.

See Here's Full list

వీరితో పాటు ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలు, 16 మందికి పద్మభూషణ్ పురస్కారాలు, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు ఉన్నారు. 18 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు.

Congratulations to the true heroes of India 

12 మంది చనిపోయిన తర్వాత పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి. వారిలో పీవీ సింధుకు పద్మ భూషణ్ (తెలంగాణ), చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం - తెలంగాణ), విజయసారధి శ్రీభాష్యం (తెలంగాణ - విద్యారంగం), యడ్ల గోపాల్ రావు (కళలు, ఆంధ్రప్రదేశ్), దాలవాయి చలపతిరావు (కళలు, ఆంధ్రప్రదేశ్) పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.

పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖులు

రవి కన్నన్ అసోం వైద్య రంగం

ఎస్. రామకృష్ణన్ తమిళనాడు దివ్యాంగుల సంక్షేమం, సామాజిక కార్యకర్త

సుందరం వర్మ రాజస్థాన్ భజన కీర్తనల గాయకుడు

యోగి ఆరోన్ ఉత్తరాఖండ్ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు

రహీబాయి సోమా పోపరే మహారాష్ట్ర సేంద్రీయ వ్యవసాయం

హిమ్మట రాంబాబు రాజస్థాన్ పర్యావరణం సామాజిక కార్యకర్త

మూజిక్కర్ పంకజాక్షి కేరళ తోలుబొమ్మలాట కళాకారిణి.

ఏక్తా కపూర్ (సినీ పరిశ్రమ)

కంగనా రనౌత్ (సినీ పరిశ్రమ)

అద్నన్ సామి (సినీ పరిశ్రమ)

కరణ్ జోహార్ (సినీ పరిశ్రమ)

ఉషా చమర్ సామాజిక కార్యకర్త, పారిశుధ్యం

పోపట్ రావ్ పవార్ మహారాష్ట్ర, నీటిపారుదల సామాజిక కార్యకర్త

హరేకాల హజబ్బా కర్నాటక విద్యాబోధన, సామాజిక కార్యకర్త

అరుణోదయ మండల్ పశ్చిమ బెంగాల్ వైద్య సేవలు

రాధా మోహన్ ఒడిశా సేంద్రియ వ్యవసాయం

కుశల్ కన్వర్ శర్మ అస్సాం వెటర్నరీ డాక్టర్

ట్రినిటీ సాయో మేఘాలయ సేంద్రీయ వ్యవసాయం

Padma Awards 2020

పద్మ భూషణ్ అవార్డు గ్రహీతలు

అనిల్‌ ప్రకాశ్‌ జోషి - ఉత్తరఖండ్‌

డాక్టర్‌ స్తేరింగ్‌ లండల్‌ - లడక్‌

ఆనంద్‌ మహింద్రా - మహారాష్ట్ర

నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్‌ - కేరళ

మనోహర్‌ గోపాలకృష్ణ ప్రభు పారికర్‌ -గోవా

ప్రొఫెసర్‌ జగదీశ్‌ సేథ్‌ -యూఎస్‌ఏ

పీవీ సింధు - తెలంగాణ

శ్రీ వేణు శ్రీనివాసన్‌ - తమిళనాడు

ముంతాజ్‌ అలీ - కేరళ

సయ్యద్‌ ముజీమ్‌ అలీ - బంగ్లాదేశ్‌

ముజఫర్‌ హుస్సెన్‌ బెగ్‌ - జమ్ముకశ్మీర్‌

అజయ్‌ చక్రవర్తి - వెస్ట్‌బెంగాల్‌

మనోజ్‌దాస్‌ - పాండిచెరి

బాలక్రిష్ణదాస్‌ - గుజరాత్‌

క్రిష్ణమ్మల్‌ జగన్నాథ్‌ - తమిళనాడు

ఎస్‌సీ జమిర్‌ - నాగాలాండ్‌

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు

మేరీ కోం - మణిపూర్‌

ఛన్నులాల్‌ మిశ్రీ - ఉత్తరప్రదేశ్‌

సుశ్మాస్వరాజ్‌ - ఢిల్లీ

విశ్వేశతీర్థ స్వామీజీ ప్రజావార అధోఖాజ మత్ర ఉడుపి - కర్ణాటక

జార్జ్‌ఫెర్నాండెజ్‌ - బిహార్‌

అరుణ్‌జైట్లీ - ఢిల్లీ

అనిరుద్‌ జగనాథ్‌

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now