Happy Children’s Day: బాలల దినోత్సవం వచ్చింది.. బోలెడు సందడి తెచ్చింది.. నేడే చిల్డ్రన్స్ డే.. పండిట్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారంటే?
బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు
Hyderabad, Nov 14: నవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని (Children’s Day) దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు (Jawaharlal Nehru birth anniversary). మరి ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకోవడానికి బలమైన కారణం ఉంది. చాచా నెహ్రూ .. పిల్లలను అమితంగా ఇష్టపడే భారత తొలి ప్రధాని. స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటిష్ (British) పాలనలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న భారతదేశాన్ని, స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా పురోగమనం వైపు నడిపించడంలో ఆయన చూపించిన దార్శనికత, ఆయన ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేస్తాయి.
పండిట్ నెహ్రూ పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారిని దగ్గరకు తీసుకునే వారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రు అని పిలిచేవారు. ఆయనకు గులాబీ పువ్వులు అంటే ఎనలేని మక్కువ. దీంతో ఆయనకు గులాబీ పువ్వుల ను ఇచ్చి మరీ పిల్లలు ఆయన చుట్టూ చేరేవారు. ఈ కారణం చేతనే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా ఏటా భారత్ లో జరుపుకుంటున్నాం.