Saddula Bathukamma Wishes: సద్దుల బతుకమ్మ పండగ సందర్బంగా ఫోటో గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..

ఆడపడుచుల ఆటపాటలతో ఊరంతా సంబురం.. ఎంగిలిపూవు నుంచి సద్దుల వరకు 9 రోజులు తీరొక్క పూలతో వేడుకలు.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు, గొప్ప సంప్రదాయం, విశిష్టమైన సహజ వారసత్వానికి ప్రతీక. తెలంగాణా అంతటా దీనిని ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో రంగురంగుల పువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ పండుగ ప్రకృతి దేవతకు అంకితం చేస్తారు. అందుకే దీనిని పూల పండుగ అని కూడా అంటారు. కొంతమంది దీనిని నీరు, నేల, మానవుల సమన్వయ పండుగ అని పిలుస్తారు. ఇది వర్షాకాలం, శీతాకాలం ప్రారంభాన్ని సూచించే పండుగగా కూడా పరిగణించబడుతుంది. తెలంగాణ మహిళలు రంగురంగుల పూలతో గోపురం వంటి నిర్మాణాన్ని సిద్ధం చేస్తారు. సాధారణంగా ఇది ఏడు స్థాయిలను కలిగి ఉంటుంది. దీనిని అగరబత్తులతో అలంకరించి, పైన పసుపు ముద్దను నైవేద్యంగా ఉంచి, చేతికి లేదా నుదుటిపై ఉంచి ఆలయానికి లేదా ఇతర బహిరంగ ప్రదేశాలకు తీసుకువెళతారు. మహిళలు రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి జానపద పాటలు పాడుతూ వేడుక చేస్తారు. సామూహిక వేడుకలు జరిగే చోట మహిళలు బతుకమ్మ ప్రదక్షిణ చేస్తూ పాటలతో నృత్యాలు చేస్తారు.

ఊరంతా పూల వైభవం.. ఆడపడుచుల ఆటపాటలతో ఊరంతా సంబురం.. ఎంగిలిపూవు నుంచి సద్దుల వరకు 9 రోజులు తీరొక్క పూలతో వేడుకలు.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ ఆచార,సంప్రదాయాలకు ప్రతీక మన ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే పూల పండుగ ...ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...

బతుకమ్మ అంత అందంగా, మనందరి బ్రతుకులు ఉండాలని కోరుకుంటూ ... ఆడపడుచులకి, ఆత్మీయులకి, ప్రపంచవ్యాప్తంగా పండగ జరుపుకుంటున్న ఆడబిడ్డలకు .... సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

పూలను పూజించే,ప్రకృతిని దేవతగా ఆరాధించే మన సంస్కృతి,సాంప్రదాయ పండుగ బతుకమ్మ..ఆడపడుచులు తీరొక్క పూలతో కన్నుల పండుగగా చేసుకొనే గొప్ప పండగ మన బతుకమ్మ..సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

ఈరోజుతో, తొమ్మిది రోజుల పూల జాతర పతాక స్థాయికి చేరుకొని, వైభవంగా సద్దుల పండుగతో ముగుస్తుంది !! తొమ్మిది రోజుల పూల పరిమళాలు, పాటల మధురిమలు, ఆటల ఉత్సాహం సంవత్సరమంతా మీతో ఉండాలని కోరుకుంటూ.. అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు !!

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.