Kanuma Festival 2022: కనుమ పండుగ రోజు ప్రయాణం చేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్టట్టే, ప్రయాణం ఎందుకు చేయకూడదో తెలిస్తే షాక్ తింటారు..
అలా ఎందుకు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణం లోనికి ప్రవేశించేటప్పుడు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు భూమి తిరిగే దిశ కూడా మారుతుంది. ఈ సందర్భంలోనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో మకర సంక్రాంతిని జరుపుకుంటారు.మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ దేశ వ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో జరుపుకోవడం విశేషం. మొదటి రోజు భోగి, మరి నాడు మకర సంక్రాంతి, చివరిగా కనుమ పండుగను జరుపుకుంటారు.అయితే మన పెద్దవారు కనుమ పండుగ రోజు ఎవరు కూడా ప్రయాణాలు చేయకూడదని చెబుతుంటారు. అలా ఎందుకు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి పండుగలో మొదటి రెండు రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పండుగను జరుపుకుంటారు. చివరి రోజయిన కనుమ పండుగను వివిధ రకాల మాంసాహార లను చేసుకొని తింటారు.ఈ కనుమ రోజు మాంసం తినని వారికి మాంసంలో లభించే పోషకాలతో సమానమైన పదార్థాలను వండుతారు. అందుకోసమే కనుమ నాడు మినుము తినాలనేది సామెతగా వాడుతుంటారు. సంక్రాంతి పండుగ రోజు కుటుంబ సభ్యులతో పాటు కూతుళ్ళు, అల్లుళ్ళు ఇంటికి రావడంతో అందరు కలిసి భోజనం చేయడం ఆనవాయితీ ఈ కనుమ రోజు పితృదేవతలకు ప్రసాదాన్ని పెట్టి కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేస్తారు.
అదే విధంగా అందరూ కలిసి కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడటం కోసం కనుమ రోజు ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా, కేవలం కుటుంబ సభ్యులతో గడపాలని చెబుతుంటారు.అంతేకాకుండా కనుమ రోజు కాకి కూడ కదలదని సామెతను మన పెద్దలు కూడా చెబుతుంటారు. అత్యవసరమైతే తప్ప ఈ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ పెద్దల మాట కాదని ప్రయాణం చేసిన వారి ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతాయని పెద్దలు చెబుతుంటారు.